Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి
Yadadri Bhuvanagiri News: యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
![Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి Road accidents in Telangana due to fog six people died in various accidents Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/ef744f933c9ff4bf684f0f834abd83e71703469477913215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Road Accidents In Telangana: పొగమంచు ప్రాణాలు తీస్తోంది. వాహనాలు డ్రైవింగ్ చేయాడానికే వణికిపోతున్నారు డ్రైవర్లు. పొగమంచు కారణంగా నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. నిడమనూరు మండలం వేంపాడు స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతన్ని చూసేందుకు వస్తున్న బంధువులు కూడా ప్రమాదం బారిన పడ్డారు. పెద్దపూర మండలం మల్లెవాని కుంట తండాకు చెందిన వారంత ఆటోలో వేంపాడు వస్తున్నారు. వాళ్లు వస్తున్న ఆట పార్వతీపురం వద్ద ప్రమాదానికి గురైంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది.
ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో నలుగురు చనిపోయారు. ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఇంకో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. గుణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జి చనిపోయిన వారిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలోనే గంటల వ్యవధిలోనే ఐదుగురు చనిపోవడం ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపింది.
మక్తల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నారాయణపేట జిల్లా మఖ్తల్ పీఎస్ పరిధిలోని జక్లెయిర్ వద్ద వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్‌టేక్ చేసింది. ఈ ప్రయత్నంలో ఆ కారు ఎదురుగా వస్తున్న వెహికల్‌ను ఢీ కొట్టింది.
వికారాబాద్ జిల్లాలో పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగింది. శివారెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనోల ఒక్కరు గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. క్రేన్ సాయంతో కారును అధికారులు బయటకు తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)