By: ABP Desam | Updated at : 09 May 2023 01:29 PM (IST)
మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం
Madhya pradesh Bus Accident : మధ్యప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున వంతెన పై నుంచి బస్సు పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 31మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖోరేగావ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. డోంగార్‌గావ్ సమీపంలోని బరోడ్ నదిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు ఖోరేగావ్ నుంచి ఇండోర్‌కు వెళ్తోంది. వంతెనపై బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నీరు లేకపోవడంతో నేరుగా భూమిని తాకింది బస్సు. రమాద సమయంలో బస్సులో దాదాపు 80మందికిపైగా ఉన్నారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు.
मध्य प्रदेश से बड़ा दर्दनाक हादसा सामने आया है. खरगोन जिले में एक बस 50 फीट ऊंचे पुल से नदी में जा गिरी जिसमें अब तक 15 लोगों के मरने की खबर है@brajeshabpnews की रिपोर्ट #KhargoneBusAccident #Khargone #MadhyaPradesh https://t.co/DqGOFF5iVZ
— ABP News (@ABPNews) May 9, 2023
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్ర గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం ఇండోర్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేలు ఆర్ధిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు.
#MadhyaPradesh government announces compensation of Rs 4 lakh each to next of kin of deceased, Rs 50,000 to injured in bus accident in #Khargone district. pic.twitter.com/BQY0DaqFun
— All India Radio News (@airnewsalerts) May 9, 2023
అటు కేంద్రం కూడా రూ.2 లక్షల మేర ఆర్ధిక సాయం ప్రకటించింది.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the bus accident in Khargone, Madhya Pradesh. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 9, 2023
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్
Coromandel Express Accident: నాలుగేళ్లలో 11 వందలకుపైగా ప్రమాదాలు, అన్నింటికీ కారణమదే - కాగ్ రిపోర్ట్
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి
Odisha Train Accident: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో రైలు ప్రమాదాల్ని నియంత్రించొచ్చా? అదెలా సాధ్యం?
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ
Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!