అన్వేషించండి

Chhattisgarh Naxals surrender: చత్తీస్‌ఘడ్‌లో ఆశన్నతో సహా 208 మంది నక్సలైట్ల సరెండర్ - మావోయిస్టుల ఉనికి మరింత పతనం !

Chhattisgarh :చత్తీస్ ఘడ్‌లో 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అగ్రనేత ఆశన్నసహా కీలక నేతలు లొంగిపోయిన వారిలో ఉన్నారు.

208 Naxalites surrender in Chhattisgarh:    ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ వికల్ప్ (59) సహా 208 మంది నక్సలైట్లు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి .  డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎదుట లొంగిపోయారు. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమూహ లొంగుబాటు ఘటనగా నిలిచింది. ఈ సంఘటనతో ఉత్తర బస్తర్ మరియు అబుజ్‌మడ్ ప్రాంతాలు నక్సల్ రహితంగా మారాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.  

తక్కళ్లపల్లి వాసుదేవరావు తెలంగాణలోని ములుగు గ్రామానికి చెందినవారు. మావోయిస్టులలో 'బాంబ్ మేకర్'గా పేరుగాంచిన ఆయన, 2000లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి రూపకర్తగా భావిస్తున్నారు. 1999లో మాజీ హోం మంత్రి ఎ. మాధవరెడ్డి, యువ IPS అధికారి ఉమేష్ చంద్ర హత్యల్లో కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. అబుజ్‌మడ్ ప్రాంతంలో ఆపరేట్ చేస్తున్న రూపేష్‌ను ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీకి  ఎంపిక చేశారు.  కానీ అతను ఒక్క మీటింగ్‌కు కూడా హాజరు కాలేదు. రూపేష్‌తో పాటు డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC)  డివిజన్ ఇన్‌చార్జ్ రనీతా, సంతు వంటి కీలక నాయకులు కూడా లొంగిపోయారు. మొత్తం 20 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 30 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. 
  
మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు రూపేష్ సహా ఇతర క్యాడర్ సభ్యులు ఉన్నారు. వారు 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో  మెషిన్ గన్స్, గ్రనేడ్ లాంచర్లు  వంటివి ఉన్నాయి.   

 
ఈ లొంగుబాటుతో ఉత్తర బస్తర్ ప్రాంతం నక్సల్ రహితంగా మారింది. అబుజ్‌మడ్ ప్రాంతం నుంచి మావోయిస్టు ప్రభావం తొలగిపోయింది. ఇక దక్షిణ బస్తర్‌పై దృష్టి సారించనున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారు, 1,785 మందిని అరెస్టు చేశారు, 477 మందిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.  

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
ABP Desam Top 10, 5 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 5 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget