Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌నీ ముంచెత్తుతున్న వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కారణంగా 50 మంది గల్లంతు
Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షిమ్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా 50 మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది.
Himachal Pradesh Cloudburst: వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ విపత్తుతోనే సతమతం అవుతుంటే అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే ముప్పు వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షిమ్లాలోని రామ్‌పూర్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత కురిసింది. ఈ కారణంగా దాదాపు 50 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖాడ్ వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వద్ద ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా రహదారులపైనా ప్రభావం పడింది. ఈ ప్రాంతంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు మండీలోనూ ఇదే విపత్తు సంభవించింది. ప్రయాణం చేయడానికి వీల్లేని పరిస్థితులున్నాయని, పలు చోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయని అధికారులు తెలిపారు. (Also Read: Wayanad Landslide: మృతుల దిబ్బగా మారిన వయనాడ్- ముమ్మరంగా సహాయ చర్యలు- సాయం ప్రకటించిన సెలబ్రిటీలు)
"ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడు స్టాఫ్‌ని, స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్‌ని వేరే చోటకు తరలించడం కష్టం. ఈ ప్రయత్నం చేసినా అది ప్రమాదకరమే అవుతుంది. వెంటనే స్కూల్స్‌తో పాటు ట్రైనింగ్ సెంటర్స్‌నీ మూసేయాలి"
- అధికారులు
#WATCH | Himachal Pradesh | 19 people are missing after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district. The SDRF team at the spot for the search and rescue operation
— ANI (@ANI) August 1, 2024
(Visual source - DPRO Shimla) pic.twitter.com/afz23ylf4P
ఉత్తరాఖండ్‌లోనూ ఈ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ వర్షాలకు ఇద్దరు బలి అయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. State Disaster Response Force (SDRF) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. అర్ధరాత్రి ఒక్కసారిగా కుండపోత కురవడం వల్ల ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. హరిద్వార్‌లో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. 9 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కూలిన ఘటనలో ఈ చిన్నారులు మృతి చెందారు. ఇక్కడి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. అన్ని విధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ ముమ్మంగా కొనసాగుతోంది.
PM Narendra Modi has been closely monitoring the situation in Mandi, Himachal Pradesh in the wake of heavy rains and a cloudburst. He has asked top officials to ensure all possible assistance is provided to the affected. Relief operations are underway in full swing: Sources… pic.twitter.com/p2Imqxp4Pj
— ANI (@ANI) August 1, 2024
Also Read: SC Sub Classify: ఎస్సీ వర్గీకరణను ఆ న్యాయమూర్తి ఎందుకు వ్యతిరేకించారు? ఆమె వినిపించిన వాదనేంటి?