Crime News: కాపీ కొట్టావని నిందించిన టీచర్- మనస్తాపంతో విద్యార్థిని ఏం చేసిందంటే?
Sri Sathya Sai District Crime News: టీచర్ అవమానించిందని శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేసింది.
Sri Sathya Sai District Crime News: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాపీ కొట్టి మార్కులు తెచ్చుకున్నావని ఉపాధ్యాయులు నిందించడంతో తట్టుకో లేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. 10 తరగతి చదువుతున్న విద్యార్థిని నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పరీక్షల్లో కాపీ కొట్టడంతో ఎక్కువ మార్కులు వచ్చాయని ఓ టీచర్ నిందించారు. తోటి విద్యార్థుల ముందు అవహేళనగా మాట్లాడడంతో మనస్తాపం చెందింది. దీంతో విద్యార్థిని నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు 108 ని పిలిచి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాగా చదువుకుంటూ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ ఉపాధ్యాయరాలు అలా హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
విద్యార్థి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ బాగా చదువుతుందని చెబుతున్నారు. ఎలిమెంట్రీ స్కూల్ నుంచే బాగా చదివేదని అంటున్నారు. ఎప్పుడూ మార్కులు మంచిగా వస్తాయని కానీ టీచర్ కాపీ కొట్టారని అనేసరికి తట్టుకోలేకపోయిందన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.