అన్వేషించండి
Advertisement
Paagal Movie Review : ''పాగల్''.. ఇదొక పిచ్చి ప్రేమ కథ..
తాజాగా ఈ హీరో నటించిన 'పాగల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాగల్
రొమాంటిక్ కామెడీ
Director
నరేష్ కుప్పిలి
Starring
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ , సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు
'వెళ్లిపోమాకే' సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్ ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది', ఫలక్ నుమా దాస్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాదితో విడుదలైన 'హిట్' సినిమా విశ్వక్ సేన్ కి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఈ హీరో నటించిన 'పాగల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతో మంచి బజ్ ను క్రియేట్ చేయగలిగారు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
ప్రేమ్ (విశ్వక్ సేన్) ఏడేళ్ల వయసులో తన తల్లిని(భూమిక) కోల్పోతాడు. ఎంతగానో ప్రేమించిన తల్లి దూరం కావడంతో ఆ ప్రేమ మరో అమ్మాయి దగ్గరే దొరుకుతుందని.. కనిపించిన ప్రతీ అమ్మాయికి ఐలవ్యూ చెబుతుంటాడు. కానీ అందరూ ప్రేమ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంటారు. కొందరు అమ్మాయిలు మాత్రం డబ్బు కోసం అతడిని వాడుకొని వదిలేస్తారు. ఇలా ప్రేమలో విఫలమైన ప్రేమ్ ఫైనల్ గా రాజకీయనాయకుడు రాజీ(మురళీశర్మ)ను ప్రేమిస్తాడు. పురుషుడైన రాజీని ప్రేమ్ ఎందుకు ప్రేమిస్తాడు..? ప్రేమ్ జీవితంలోకి తీర(నివేతా పేతురేజ్) ఎలా వచ్చింది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
లింగ బేధం లేకుండా ఎవరినైనా ప్రేమలోకి దించే ఓ ప్రేమికుడి కథే ఈ సినిమా. తల్లి ప్రేమతో మొదలయ్యే ఈ కథ ఆ తరువాత అమ్మాయిల చుట్టూ సాగుతుంది. ప్రేమ-పిచ్చి ఒకటే అని వెనకటి ఓ కవి ఎవరో అన్నారు. అలాంటి ఓ పిచ్చి ప్రేమ కథతో ఈ సినిమా తీశారు. టైటిల్ కి తగ్గట్లే ఇదొక చిత్రమైన కథ. కథలో, పాత్రల్లో ఎక్కడా సహజత్వం కనిపించదు. ఎప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరిగే ఓ కుర్రాడు.. సడెన్ గా ఓరోజు అంకుల్ వయసున్న వ్యక్తికి ప్రపోజ్ చేయడం.. క్రమంగా అతడు కూడా హీరోని ప్రేమించడం వంటి సన్నివేశాలు వెగటు పుట్టిస్తాయి.
నిజానికి ప్రేమ కథలంటే ఎంతో ఎమోషనల్ గా సాగుతాయి. కానీ ఇందులో తల్లి సెంటిమెంట్ తప్ప ఇంకెక్కడా ఎమోషన్స్ పండవు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా నడిపించేశారు.. సెకండ్ హాఫ్ లో హీరో, హీరోయిన్ మధ్య నడిచే కొన్ని సన్నివేశాలు తప్ప మిగిలినవేవీ భరించలేని విధంగా ఉన్నాయి. కథ మనం ఊహించలేని విధంగా.. బలవంతపు వ్యవహారంలా సాగుతుంటుంది. క్లైమాక్స్ సన్నివేశాలు ఏమంత ఆకట్టుకోవు.
లవర్ బాయ్ ప్రేమ్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. తీర పాత్రలో నివేతా పేతురాజ్ బాగా నటించింది. నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతసేపు తెరపై అందంగా కనిపించింది. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించరు మురళీ శర్మ. ఎప్పటిలానే తనపాత్రలో పరకాయ ప్రవేశం చేశారు ఈ సీనియర్ నటుడు. రాహుల్ రామకృష్ణ, మహేష్ లు తమ కామెడీతో మెప్పించారు. సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ వంటి వారు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా విలువలు బాగున్నాయి. సంగీతం, కెమెరా పనితనం మెప్పిస్తాయి. దర్శకుడు కథ, కథనాల విషయంలో కొత్తదనం చూపించలేకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
గమనిక : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion