News
News
X

Ori Devuda Movie Review: ‘ఓరి దేవుడా’ రివ్యూ: విశ్వక్‌సేన్‌ను దేవుడు కరుణించినట్లేనా?

దీపావళి బరిలో నిలిచిన మూవీస్‌లో ‘ఓరి దేవుడా’ ఒకటి. మరి, ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? రేటింగ్ ఎంత?

FOLLOW US: 

సినిమా పేరు: ఓరి దేవుడా

నటీనటులు: విశ్వక్ సేన్, విక్టరీ వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, నాగినీడు.

సంగీతం: లియోన్ జేమ్స్.
 
డైలాగ్స్ : తరుణ్ భాస్కర్

ఎడిటింగ్ : విజయ్.

News Reels

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్నా

నిర్మాతలు: ప్రసాద్ వి పొట్లూరి.

దర్శకత్వం: ఆశ్వత్ మారిముత్తు.

బ్యానర్లు: పీ వీ పీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

విడుదల తేదీ: 21-10-22

మిళంలో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' ను తెలుగులో 'ఓరి దేవుడా'గా రీమేక్ చేశారు. ఆశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడిగా ప్రత్యేక పాత్రలో కనిపించారు. సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే జరగడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అందులోనూ లవ్ స్టొరీలో ఫాంటసీని మిక్స్ చేయడం.. ఇంకాస్త ఆసక్తి కలిగించింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? విశ్వక్‌సేన్-వెంకటేష్‌లు ప్రేక్షకులను మెప్పించారా?

కథ: అర్జున్ దుర్గారాజ్(విశ్వక్ సేన్), అను పాల్ రాజ్(మిథిలా పాల్కర్), మణి(వెంకటేష్ కకుమాను) చిన్నప్పటి నుంచీ స్కూల్ మేట్స్. అర్జున్ బాక్ లాగ్స్ పూర్తి చేసినందుకు ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తాడు. ఆ సమయంలో పెళ్లి ప్రస్తావన వస్తుంది. తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే తెలిసిన అమ్మాయిని చేసుకుంటేనే లైఫ్ బాగుంటుందని అర్జున్ అంటాడు. ఆ మాట విన్న అను.. ‘‘అర్జున్ నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడుగుతుంది. అర్జున్ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే కదా అని ఓకే అంటాడు. పెద్దల సమక్షంలో అర్జున్, అను ఒక్కటవుతారు. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత ఈ జంట విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కుతారు. అయితే కోర్ట్ లో అను కళ్ళు తిరిగిపడిపోడంతో విడాకులు ఆ రోజు సాయంత్రానికి వాయిదా పడతాయి. ఇదంతా అర్జున్‌కి ముందే చెప్పిన ఒకతను ఒక అడ్రెస్ ఇచ్చి అక్కడిరా నీకు విడాకులు వస్తాయ్ అని చెప్తాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. అర్జున్‌కు భవిష్యత్తు చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? అర్జున్‌కు దేవుడు(వెంకటేష్) ఇచ్చే ఆ సెకండ్ ఛాన్స్ ఏమిటీ? అర్జున్-అను మళ్లీ కలుస్తారా? అనేది వెండితెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ: సాధారణంగా ఫాంటసీ అంశాలున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ‘ఓరి దేవుడా’ కేవలం ఫాంటసీ చిత్రమే కాదు.. మంచి మెసేజ్ ఉన్న సినిమా కూడా. చేసే పని మనకి నచ్చకపోతే అప్పుడు మన ఆలోచనలు ఎలా డైవర్ట్ అవుతాయి, దాని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? మళ్ళీ సెకండ్ చాన్స్ వస్తే ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఆలోచిస్తాం వంటి అంశాలను సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు. ప్రథమార్థంలో అర్జున్, అనుల మధ్య ఘర్షణ, అదే సమయంలో మీరాతో పరిచయం. ఇష్టం లేని జీవితంతో అర్జున్ ఇబ్బంది పడటం.. అక్కడక్కడ కామెడీతో కొంత సాగదీతగా అనిపించినా, ఫర్వాలేదనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ లో వచ్చే సన్నీవేశాలు సినిమాకు ప్లస్ పాయింట్. సెకండ్ ఆఫ్ లో ఎక్కువ ఎమోషన్స్ పై దృష్టి పెట్టారు. అను తండ్రి అర్జున్ మధ్య ఓ సన్నివేశం ఆలోచింపజేస్తుంది. తర్వాత అనుకి వేరే వ్యక్తితో పెళ్లి, మీరా బర్త్ డే గిఫ్ట్ కోసం వెళ్లిన సమయంలో సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగం కలిగిస్తాయి. ఏదైనా ఊరికే వస్తే దాని విలువ తెలీదు, అది దూరమయ్యాకే దాని విలువ తెలుస్తుంది అనే మెసేజ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలున్న సినిమాలు చేయడం కొంచెం కష్టమే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కథ పక్కదారి పడుతుంది. అలాంటి పొరబాట్లు, గందరగోళం లేకుండా దర్శకుడు కథని నడిపించిన తీరు మెప్పిస్తుంది.

ఎవరెలాచేశారంటే: సినిమాలో విశ్వక్ సేన్ నటన జీవించాడని చెప్పవచ్చు. అర్జున్ పాత్రలో విస్వక్ ఒదిగిపోయాడు. ఇక అను పాత్రలో మిథిలా పాల్కర్‌, మీరా పాత్రలో ఆశా భట్‌ పరిధి మేరకు నటించారు. ఫ్రెండ్‌గా పాత్రలో కనిపించిన మణి క్యారెక్టర్ సరదాగా ఉంది. రాహుల్‌ రామకృష్ణ, మురళీ శర్మ వంటి మిగిలిన పాత్రలు ఉన్నంతలో మెప్పించారు. విక్టరీ వెంకటేష్ చేసిన దేవుడి పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. మోడ్రన్ దేవుడిగా వెంకటేష్‌ ఆకట్టుకున్నారు. రాహుల్ రామకృష్ణ పాత్ర కూడా బాగుంది. 

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే: స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా సినిమా పర్లేదనిపించింది. అనుకున్న మెసేజ్ ను దర్శకుడు బాగానే కన్వే చేశాడనే చెప్పాలి. ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. వెంకటేష్ పాత్ర సినిమాకి ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ పర్లేదనిపించాయి. అయితే డైలాగ్స్ ఇంకా బాగా రాసుకోవడానికి స్కోప్ ఉంది. దాన్ని దర్శకుడు వాడుకుంటే బాగుండేది. కామెడీ పాళ్లు కూడా ఇంకా పెంచాల్సింది. అదొక్కటే మైనస్‌గా అనిపిస్తుంది. మొత్తంగా సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది.

Published at : 21 Oct 2022 04:20 PM (IST) Tags: Venkatesh Vishwak sen Ori Devuda Ori Devuda Movie Review Ori Devuda Movie Review In Telugu

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి