News
News
X

Plan B Review: ‘ప్లాన్-బి’ రివ్యూ: శ్రీనివాస్ రెడ్డి.. మర్డర్ మిస్టరీ, ట్విస్టులే ట్విస్టులు!

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉంది?

FOLLOW US: 

శ్రీనివాస్ రెడ్డి కమెడియన్‌గానే కాదు.. తనకు సరిపడే కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా ఆకట్టుకున్నారు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్ము రా’, ‘జంబ లకిడి పంబ’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ‘ప్లాన్-బి’ సినిమాలో మరోసారి లీడ్ రోల్‌ పోషించారు. సస్పెన్స్ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా?  

కథ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని ప్రజలు సంతాన సమస్యలతో బాధపడతారు. పురుషులకు వీర్య కణాలు తగ్గిపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. దీంతో ఓ వైద్యుడు ఆ ఊరి సమస్యను పరిష్కరిస్తాడు. అతడి వైద్యం వల్ల ఆ గ్రామంలో అందరికీ సంతాన భాగ్యం కలుగుతుంది. కానీ, ఒక జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. భర్తకు వీర్య కణాల సంఖ్య బాగా తక్కువగా ఉండటంతో వైద్యుడు తన వీర్యం ద్వారా ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కలిగేలా చేస్తాడు. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) హత్యకు గురవుతాడు. విశ్వనాథ్ తండ్రి ఫోన్‌కు హత్య ఫొటోలు వెళ్తాయి. ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాశ్) ఈ కేసును చేధించేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో రిటైర్డ్ పోలీస్ అధికారి రాజేంద్ర (రాజేంద్ర) హత్యకు గురవుతాడు. హత్యకు ముందు కూతురు అవంతిక (డింపుల్)కు రూ.10 కోట్లు ఇస్తాడు. అయితే, ఆ డబ్బును ఎవరో దొంగిలిస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ టీచర్ రిషి (అభినవ్ సర్దార్) కూడా హత్యకు గురవ్వుతాడు. ఈ హత్యలు ఎవరు చేస్తారు? గౌతమ్ (సూర్య వశిష్ట) ఎవరు? ఈ హత్యలకు గౌతమ్‌కు సంబంధం ఏమిటీ? వైద్యుడికి, ఈ హత్యలకు సంబంధం ఏమిటనేది.. బిగ్ స్క్రీన్ మీదే చూడాలి.  

విశ్లేషణ: ఇటీవల భారీ చిత్రాలు, హీరోయిజాన్ని చూపించే చిత్రాలు కంటే.. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులను బాగా ఆదరిస్తున్నారు. అలాంటివారిని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. చిన్న చిత్రమే అని చిన్నచూపు చూస్తే మంచి థ్రిల్లర్‌ సినిమాను మిస్సయినట్లే. దర్శకుడు కె.వి.రాజమహి.. చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్, ట్విస్టులు.. కట్టిపడేస్తాయి. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. ఈ నేపథ్యంలో ప్రేక్షకుడు ఎక్కడా గందరగోళానికి గురికాకుండా పాయింట్ టు పాయింట్.. అన్నట్లుగా కథను చూపించారు. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్‌లు మిస్సయినా.. ఓవరాల్‌గా చూస్తే వాటిని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తిక్ అందించిన బీజీఎం బాగుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తేనే థ్రిల్‌గా ఉంటుంది. ఇక పాత్రల విషయానికి వస్తే.. శ్రీనివాస్ రెడ్డి తన నటనతో ఆకట్టుకున్నారు. లాయర్ విశ్వనాథ్ పాత్రలో జీవించారు. గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట తన పరిది మేరకు నటించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. విలన్ కునాల్‌ శర్మ తన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు మురళి శర్మ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు. పోలీసు అధికారి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులు తమ పాత్రకు న్యాయం చేశారు. 

‘ప్లాన్-బి’ ట్రైలర్:

Published at : 17 Sep 2021 10:52 AM (IST) Tags: Plan B Review Plan B Movie Review Plan B Plan B Movie Srinivas Reddy ప్లాన్ బి రివ్యూ

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు