Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?
OTT Review - Taapsee's Blurr Movie : తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'బ్లర్'. జీ5 ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాతో తాప్సీ నిర్మాతగా మారారు. నటిగా, నిర్మాతగా ఆమె హిట్ కొట్టారా? లేదా?
అజయ్ బెహల్
తాప్సీ పన్ను, గుల్షన్ దేవయ్య, కృతికా దేశాయ్ ఖాన్, సుమిత్ నిఝవాన్ తదితరులు
సినిమా రివ్యూ : బ్లర్
రేటింగ్ : 3/5
నటీనటులు : తాప్సీ పన్ను, గుల్షన్ దేవయ్య, కృతికా దేశాయ్ ఖాన్, సుమిత్ నిఝవాన్ తదితరులు
ఛాయాగ్రహణం : సుధీర్ కె. చౌదరి
నేపథ్య సంగీతం : కేతన్ సోడా
నిర్మాతలు : విశాల్ రాణా, తాప్సీ పన్ను, టోనీ డిసౌజా, ప్రదీప్ శర్మ, మానవ్ దుర్గ, ప్రంజల్ ఖాందాడియా
దర్శకత్వం : అజయ్ బెహల్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022
ఓటీటీ వేదిక : జీ 5
హిందీలో తాప్సీ పన్ను (Taapsee Pannu), ఆమె సినిమాలకు అభిమానులు ఉన్నారు. 'బేబీ', 'పింక్' నుంచి కథల ఎంపికలో తాప్సీ వైవిధ్యం చూపిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేశానుకోండి. అయితే, ఎక్కువగా కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాప్సీ నటించిన తాజా సినిమా 'బ్లర్' (Blurr Movie). ఈ రోజు 'జీ 5' (Zee5 OTT Original Movie) లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? (Blurr Review)
కథ (Blurr Movie Story) : గౌతమి (తాప్సీ) అంధురాలు. ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు ఇంటిలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా పడి ఉంటుంది. ఆమెది ఆత్మహత్య పోలీసుల విచారణలో తెలుస్తుంది. అయితే, అది ఆత్మహత్య కాదని... ఎవరో హత్య చేశారని గౌతమి ట్విన్ సిస్టర్ గాయత్రి సందేహం వ్యక్తం చేస్తుంది. ఆమె మాటను భర్త నీల్ (గుల్షన్ దేవయ్య), పోలీసులు నమ్మరు. ఆత్మహత్యే అని కొట్టిపారేస్తారు. దాంతో సోదరికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది గాయత్రి. అయితే, ఆమెను ఎవరో నీడలా వెంటాడటం స్టార్ట్ చేశారు. ఆ నీడ ఎవరు? గాయత్రి జీవితం ప్రమాదంలో పడటానికి కారణం ఎవరు? ఆమెకు డీజనరేటివ్ ఐ డిజార్డర్ (నెమ్మదిగా చూపు కోల్పోవడానికి) కారణం ఎవరు? నిజంగా గౌతమిది ఆత్మహత్యా? హత్యా? గాయత్రి చేసిన విచారణలో ఏం తేలింది? - ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Blurr Movie Telugu Review) : 'బ్లర్' కథను రెండు లైన్లలో చెప్పవచ్చు. అంత సింపుల్ స్టోరీ. కానీ, దర్శకుడు అజయ్ అలా డైరెక్టుగా చెప్పలేదు. ట్విస్టులు, థ్రిల్స్‌తో రెండు గంటలు చెప్పారు. మరి, ఆయన చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉందా? లేదా? అనే విషయంలోకి వెళితే...
తర్వాత ఏం జరుగుతుంది? తాప్సీని వెంటాడుతున్నది ఎవరు? తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథను ముందుకు నడిపారు. స్క్రీన్ ప్లేలో మేజిక్ మూమెంట్స్ లేవు. కానీ, ఎంగేజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా తాప్సీ నటన చాలా సన్నివేశాలను నిలబెట్టింది. దానికి టీమ్ వర్క్ కారణం అని చెప్పాలి. దర్శకుడికి సినిమాటోగ్రాఫర్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. రాత్రివేళలో ఎక్కువ సన్నివేశాలు తీయడం, హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్, కలర్ థీమ్ సినిమాకు అవసరమైన మూడ్ క్రియేట్ చేశాయి. నేపథ్య సంగీతం బావుంది.
కొన్ని సీన్స్ రిపీట్ చేసినట్లు ఉండటం, రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మటులో సాగడం మైనస్. కంటికి కనిపించని శత్రువు కోసం తాప్సీ సాగించే వేట ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి విలన్ ఎవరో రివీల్ అయిన తర్వాత అంత ఆసక్తి ఉండదు. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా ఊహించవచ్చు. విలన్ ఎందుకు తాప్సీని టార్గెట్ చేశాడనేది మరింత ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది.
నటీనటులు ఎలా చేశారు? : సినిమా స్టార్టింగులో తాప్సీ అంధురాలిగా కనిపించే సీన్ షాక్ ఇస్తుంది. ఆమెను అలా చూడగానే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. గౌతమి మరణం తర్వాత గాయత్రిగా తాప్సీ కనిపించలేదు. క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అంత చక్కగా నటించారు. తాప్సీ మినహా మిగతా ఆర్టిస్టులు ఎవరికీ సరైన స్క్రీన్ స్పేస్ గానీ, యాక్టింగ్ స్కోప్ గానీ దక్కలేదు. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Also Read : ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'బ్లర్' కథను డైరెక్టుగా చెబితే... 'ఓస్! ఇంతేనా?' అని ఎవరైనా కామెంట్ చేసే ప్రమాదం ఉంది. విలన్ ఎవరనేది రివీల్ చేసే వరకు ఈ కథ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసింది. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అనేలా ఉంటుంది. ఆ తర్వాత మర్డర్ మిస్టరీకి ఎండ్ కార్డ్ పడి, డ్రామా మొదలైంది. సినిమా స్లో అయ్యింది. తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. తాప్సీ మరోసారి మంచి పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంటారు. నిడివి రెండు గంటలు కావడం సినిమాకు ప్లస్ పాయింట్.
Also Read : 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?