News
News
X

Anya’s Tutorial Web Series Review - 'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?

OTT Review - Anya’s Tutorial Web Series: 'బాహుబలి' నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్'. తెలుగు, తమిళ భాషల్లో ఆహా ఓటీటీలో విడుదలైంది.

FOLLOW US: 

వెబ్ సిరీస్ రివ్యూ: అన్యాస్ ట్యుటోరియల్  
రేటింగ్: 2/5
నటీనటులు: నివేదితా సతీష్, రెజీనా, ప్రమోదిని పమ్మి, సమీర్ మల్ల, సాయి కామాక్షి భాస్కర్ల, బేబీ నందిత, బేబీ దివ్య తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : సౌమ్య శర్మ
మాటలు: సౌమ్య శర్మ, పల్లవి గంగిరెడ్డి 
సినిమాటోగ్రఫీ: విజయ్ కె చక్రవర్తి 
సంగీతం: అర్రోల్ కోరెల్లి  
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని 
దర్శకత్వం: పల్లవి గంగిరెడ్డి
విడుదల తేదీ: జూలై  1, 2022
ఎపిసోడ్స్: 7
ఓటీటీ వేదిక: ఆహా 

రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' (Anya's Tutorial Web Series). ఇదొక హారర్ థ్రిల్లర్. టీజర్ ప్రభాస్, ట్రైలర్ రాజమౌళి విడుదల చేయడంతో వీక్షకుల దృష్టి పడింది. ప్రచార చిత్రాలు  సైతం ఆసక్తికరంగా ఉన్నాయి. మరి, సిరీస్ ఎలా ఉంది?

కథ (Anya's Tutorial Web Series Story): అన్యా అలియాస్ లావణ్య (నివేదితా సతీష్) సోషల్ మీడియాలో పెద్ద ఇన్‌ఫ్లూయన్స‌ర్‌ కావాలని కలలు కంటుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగుతుంది. ఆమె తప్ప ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవరూ ఉండరు. అయినా ధైర్యంగా, ఒంటరిగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'అన్యాస్ ట్యుటోరియల్' పేరుతో అకౌంట్ రన్ చేస్తుంది. ఒక రోజు మేకప్ గురించి లైవ్ ఇస్తుండగా... ఆమె వెనుక దెయ్యం ఉన్నట్టు ఉందని ఫాలోయర్లు గమనిస్తారు. దాంతో సోషల్ మీడియాలో లావణ్య పాపులర్ అవుతుంది. అన్యాస్ ట్యుటోరియల్ పేజీ ఫాలోయర్లు పెరుగుతారు. కొంత మంది తమ ప్రొడక్ట్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేయమని డబ్బులు కూడా ఇస్తారు. అయితే... లావణ్య చేసేదంతా ట్రాష్ అని ఆమె అక్క మధు (రెజీనా) కొట్టి పారేస్తోంది. దెయ్యాలు, భూతాలు లేవని చిన్నతనం నుంచి లావణ్యతో పాటు తనకు తెలుసు అని చెబుతుంది. మధు చేసిన ఒక పని వల్ల అన్యాస్ ట్యుటోరియల్ పేజీ ఫాలోయర్లు తగ్గుతారు. ఆ తర్వాత మరో లైవ్ చేసిన లావణ్య, చిన్నతనంలో అక్క తనతో ఎలా ప్రవర్తించినదీ చెబుతుంది. అక్కతో ఉండటం కంటే దెయ్యంతో ఉండటం మేలని అంటుంది. మరోవైపు అన్యాస్ ట్యుటోరియల్ పేజీలో లైవ్ వీడియోస్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఫేమ్ కోసం ఇటువంటి పనులు చేసే వాళ్ళను అరెస్ట్ చేసి పేజీని బ్యాన్ చేయాలని కొంత మంది తల్లిదండ్రులు కోరతారు. ప్రభుత్వం ఏం చేసింది? లావణ్య వీడియోస్ ఎలాంటి ప్రభావం చూపించాయి? అక్క మధుతో ఆమెకు ఉన్న గొడవలు ఏంటి? నిజంగా లావణ్య అద్దెకు దిగిన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? లేవా? చిన్నతనంలో స్మశానం పక్కన ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Anya's Tutorial Review): ఊరి చివర ఒక అపార్ట్‌మెంట్‌... ఎవరూ లేని చోట ఒక అమ్మాయి, దెయ్యాలు, సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వడం... పర్ఫెక్ట్ న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్‌కు కావాల్సిన కాన్సెప్ట్ 'అన్యాస్ ట్యుటోరియల్'కు కుదిరింది.  దానికి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తోడు అయ్యారు. సిరీస్ ప్రారంభం కూడా బావుంది. అయితే... కథను ఎంతసేపటికీ ముందు తీసుకు వెళ్ళకుండా లాక్ చేయడంతో చూసిన సన్నివేశాలు మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 

సాధారణంగా హారర్ ఫిల్మ్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ సింగిల్ లొకేషన్స్‌లో ఉంటాయి. నటీనటుల చుట్టూ వాతావరణం భయంకరంగా ఉందని ప్రేక్షకులు ఫీలైనప్పుడు, భయపడినప్పుడు హారర్ వర్కవుట్ అవుతుంది. 'అన్యాస్ ట్యుటోరియల్'లో ఆ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లేవని కాదు. అయితే... ఎక్కువ లేదు. చిన్న చిన్న థ్రిల్స్ ఇస్తూ ముందుకు కదులుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ తప్ప ఎంగేజ్ చేసే సీన్స్ తక్కువ. హారర్ వరకూ ఒకే. కానీ, మధ్యలో కథ క‌న్‌ఫ్యూజ్‌ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్, ఆర్ట్ డైరెక్షన్ మాత్రం టాప్ క్లాస్. కథ విషయంలో 'అన్యాస్ ట్యుటోరియల్' డిజప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభమైనప్పుడు మొదలైన ప్రశ్నలకు ఆఖరి ఎపిసోడ్‌లో కూడా సమాధానాలు లభించవు. బహుశా... సెకండ్ సీజన్ కోసం అర్థాంతరంగా ముగించారేమో? అనిపిస్తుంది. కథలో కొత్త పాత్రలు వస్తాయి. కొందరు కనిపించకుండా పోతారు. అలా ఎందుకు జరిగింది? అనేది ఏడు ఎపిసోడ్స్ చూసినా క్లారిటీ ఉండదు. కథకు ఒక ముగింపు ఉండదు. నివేదితా సతీష్ బాల్యంలో ఏం జరిగిందనేది కూడా స్పష్టంగా చూపించలేదు. 

నటీనటులు ఎలా చేశారు?: రెజీనా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఎక్కువగా డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తారు. అయితే... ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువ. నెగెటివ్ షేడ్స్ చూపించే సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పలికించారు. రెజీనా కంటే నివేదితా సతీష్ ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపిస్తారు. నటిగానూ ఆకట్టుకుంటారు. నివేదితా సతీష్ కళ్ళలో అమాయకత్వం ఆమె పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. సీన్‌కు తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ ఇచ్చారు. ఆమె నటన వల్ల చాలా సన్నివేశాలను అలా చూస్తూ ఉండిపోతాం. లావణ్య చిన్నప్పటి పాత్రలో కనిపించిన చిన్నారి కూడా బాగా చేసింది. నటీనటుల నుంచి చక్కటి అభినయం తీసుకోవడంలో పల్లవి గంగిరెడ్డి సక్సెస్ అయ్యారు. మిగతా పాత్రలు కొన్ని ఉన్నప్పటికీ... వీక్షకుల దృష్టిలో రిజిస్టర్ కావడం కష్టం. 

Also Read : 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే: నటీనటుల అద్భుత అభినయం, ఉన్నత నిర్మాణ విలువలు, సంగీతం ఆకట్టుకుంటాయి. కథ డిజప్పాయింట్ చేసినా... మేకింగ్, టేకింగ్ టాప్ క్లాస్ కావడంతో కొంత వరకు ఎంగేజ్ చేస్తుంది. మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. నివేదితా సతీష్ దేహంలో దెయ్యం ఆవహించిన తర్వాత సన్నివేశాలు థ్రిల్స్ ఇస్తాయి. చివరకు, కథ ఏంటనేది చెబితే బావుండేది. కథలో క్లారిటీ లేకపోవడంతో ఏం చూశామనేది క్లారిటీ లేకుండా పోయింది. సగం సగం వండి వార్చిన సిరీస్ ఇది. 

Also Read : 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published at : 01 Jul 2022 01:20 PM (IST) Tags: ABPDesamReview Anya’s Tutorial Web Series Review Anya’s Tutorial Web Series Review In Telugu Anya’s Tutorial Review In Telugu Anya’s Tutorial Telugu Review

సంబంధిత కథనాలు

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్