By: ABP Desam | Updated at : 23 Feb 2023 10:29 AM (IST)
Edited By: Soundarya
Representational Image/Pixabay
శరీరంలోని వ్యర్థాలు, అదనపు నీరు మూత్రం ద్వారానే బయటకి వెళ్తుంది. అనేక వ్యాధుల రోగ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే మూత్రం రంగు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్తుంది అనే విషయం మీకు తెలుసా? ముదురు పసుపు రంగులో ఉంటే మీరు డీహైడ్రేట్ అవుతున్నారని అర్థం. ఎర్రటి మూత్రం క్యాన్సర్ ని సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారం నుంచి కొన్ని రోగాలకు తీసుకునే మందుల వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది. శరీరంలో ఉత్పత్తి చేయబడే యురోబిలిన్ వర్ణద్రవ్యం కారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.
ప్రెగ్నెంట్ అయ్యారో లేదో తెలిపేది మూత్ర పరీక్ష ద్వారానే. ఇదే కాదు మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో కూడా ఇదే చెప్పేస్తుంది. వైద్యులే కాదు మనం కూడా మూత్రపిండాల పనితీరు ఎలా ఉందో యూరిన్ ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపు రంగులో యూరిన్ వస్తే శరీరంలో నీటి శాతం తగ్గిపోయిందని డీహైడ్రేట్ కి గురవుతున్నారని సంకేతం. కాలేయ వ్యాధి లేదా కామెర్లు ఉన్న రోగుల్లో కూడా యూరిన్ పసుపు రంగులో ఉంటుంది.
లేత పసుపు రంగులో యూరిన్ ఉంటే మీ మూత్రపిండాలకు ఎటువంటి ఢోకా లేదని అర్థం. వాటి పనితీరు సక్రమంగా ఉందని సూచిస్తుంది. నీలం, ఎల్లో వంటి కలర్స్ లో ఉన్న యాంటీ బయాటిక్స్ మందులు వేసుకుంటే మాత్రం వాటి కలర్ మారిపోతుంది. ఒక వేళ యూరిన్ చెడు వాసన వస్తే ఇన్ఫెక్షన్ చేరిందని అర్థం చేసుకోవచ్చు. కొన్ని సార్లు అంతర్గత రక్తస్రావం కారణంగా మూత్రం ఎరుపు రంగులోకి మారితే కిడ్నీలో రాళ్ళు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థంఅని నిపుణులు చెబుతున్నారు. మీ యూరిన్ ఎరుపు లేదా ముదురు గోధుమ రంగులోకి మారితే అసలు విస్మరించొద్దు. ఎందుకంటే ఎరుపు రంగు మూత్రాశయం లేదా మూత్రపిండాల క్యాన్సర్ కి మొదటి సంకేతం.
ఫావా బీన్స్, కొన్ని యాంటీ బయాటిక్స్, తీవ్రమైన డీహైడ్రేషన్, రాబ్డోమియోలిసిస్, కొన్ని ఆహారాలు, కఠినమైన వ్యాయామాలు కూడా మీ యూరిన్ రంగు మార్చేస్తాయి. ఇక బ్రౌన్ కలర్ లో కనిపిస్తే చర్మం, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన వ్యాధికి ఇది సంకేతం కావచ్చు. బ్లూ బెర్రీస్, బీట్ రూట్, రిఫాంపిసిన్ వంటి వాటి పింక్ కలర్ లో మూత్రం వస్తుంది. ఇక ఎర్రటి మూత్రం మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్లు, మలబద్ధక సమస్యతో బాధపడుతున్న మహిళల్లో అరుదుగా ఇలా కనిపిస్తుంది. ఆల్కాప్టోటోరియా అనే రుగ్మత వల్ల యూరిన్ నలుపు రంగులో వస్తుంది. ఇక మిల్క్ వైట్ కలర్ లో వస్తే అరుదైన చిలూరియా వ్యాధికి సంకేతం కావొచ్చు.
⦿ మూత్రం నురుగుగా ఉంటే ప్రోటీన్స్ పోతున్నట్టు సూచన
⦿ తక్కువగా యూరిన్ వస్తే శరీరం నిర్జలీకరణానికి గురైందని అర్థం
⦿ ఎక్కువగా మూత్రవిసర్జనకి వెళ్తుంటే మధుమేహం కారణం
అందుకే మూత్ర విసర్జన చేసిన తర్వాత దాని రంగు చూసుకోవడం అలవాటు చేసుకోమని వైద్యులు సూచిస్తున్నారు. రంగు మారితే వెంటనే వైద్యులను సంప్రదించి రోగనిర్థారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ పిల్లల స్టడీ రూమ్ ఈ దిక్కున ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయ్!
Beauty Care: చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే ఈ ఆహారాలు రోజూ తీసుకోవాల్సిందే
కేరళలోని ఈ ప్రత్యేక వేడుకలో పురుషులంతా మహిళల్లా తయారవుతారు
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
World Idly Day: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?
నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు