అన్వేషించండి

Bone Strength: మహిళలూ మీ వయసు 30 దాటిందా? ఎముకలు బలహీనంగా మారకూడదంటే ఇవి పాటించండి

మహిళల్లో కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలు బలహీనపడిపోతాయి. ఆ సమస్యని అధిగమించాలంటే ఇవి తప్పక పాటించాలి.

ఎముకల బలంగా ఉండటం చాలా అవసరం. ఏ పని చెయ్యాలన్నా వాటి అవసరం లేకుండా సాధ్యపడదు. శరీరంలోని ఇతర భాగాల మీద చూపించే శ్రద్ద ఎముకల మీద కూడా  చూపించాలి. వాటికి అవసరమైన కాల్షియం అందించాలి. లేదంటే అవి పెళుసుగా మారిపోతాయి. చాలా మంది ఎముకల ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తారు. శరీర బరువు ఎముకల నిర్మాణంపైనే ఆధారపడి ఉంటుంది. ఎముకలు అరిగిపోయినా వాటికి దెబ్బలు తగిలినా దాని ప్రభావం శరీరం మొత్తం మీద చూపిస్తుంది. వయసు రీత్యా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అందుకే వివిధ రకాల ఆహారం తీసుకుంటే జీవినశైలిలో మార్పులు చేసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఎముకలు ధృడంగా మారతాయి. మరి కొన్నింటి వల్ల ఎముకలు బలహీన పడిపోతాయి. అవేంటో చూద్దామా..

ఎముకలకి నష్టం కలిగించేవి

☀ శీతల పానీయాల్లో చక్కెర, కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫాస్పోరిక్ యాసిడ్‌ ప్రిజర్వేటివ్‌గా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలకి నష్టం వాటిల్లుతుంది.

☀ జంతువుల ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల  కాల్షియం తగ్గుతుంది.

☀ టీ, కోకో, చాక్లెట్లు, కాఫీలోని కెఫీన్ కాల్షియం శోషణ తగ్గిస్తాయి.

☀ నికోటిన్ కాల్షియం శోషణని ప్రభావితం చేస్తుంది. అందుకే ధూమపానం, పొగాకు నమలడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతారు. ఇవి శరీరంలోనిన్ కాల్షియంని హరిస్తాయి.

☀ అధికంగా ఉప్పు, చక్కెర తీసుకోవడం కూడా కాల్షియాన్ని తగ్గిస్తుంది. దాని వల్ల ఎముకలు బలహీనపడతాయి.

☀ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి శారీరక శ్రమ చేసేటప్పుడు ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

☀ కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తరచుగా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.

ఎముకలు బలంగా లేకపోతే వచ్చే నష్టాలు

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది సరిగా అందకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి. ఎముకలు, దంతాల పెరుగుదలలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం అందకపోతే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రావచ్చు. మహిళల్లో 30 ఏళ్లు దాటిన వారిలో ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం సమస్య తరచూ గమనిస్తూనే ఉంటారు. ఎముకలు అరిగిపోయి కొద్దిసేపు నడిస్తేనే కాళ్ళు నొప్పులు రావడం జరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే ఎముకలు బలహీనంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఎముకలకి బలాన్ని ఇచ్చే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

కాల్షియం పొందే ఆహారం

పాలు, చేపలు, గుడ్లు, సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు, కొవ్వు రహిత ప్రోటీన్లు, నట్స్, పాలకూర, యాపిల్, బొప్పాయి వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత కాల్షియం అందుతుంది. అవసరం అయితే వైద్యుని సలహా మేరకు కాల్షియం సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: బ్రౌన్ షుగర్ Vs వైట్ షుగర్? ఆరోగ్యానికి ఏది మంచిది?

Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget