అన్వేషించండి

ChatGPT with Lottery : ChatGPTతో లాటరీలో కోట్లు గెలిచింది.. తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకుని డబ్బు ఏమి చేసిందంటే

ChatGPT Lottery : సోషల్ మీడియాలో ట్రెండ్స్​ ఫాలో అవ్వడం కాకుండా ఓ యువతి ChatGPTని వాడి కోట్లు గెలుచుకుంది. ఆ తర్వాత డబ్బును ఏమి చేసిందో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. 

Woman Wins Lottery with ChatGPT : ChatGPTని చాలామంది ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. తమ పనిని సులభం చేసుకోవడం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు ఎన్నో అంశాలకోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే వర్జీనియాకు చెందిన ఓ మహిళ మాత్రం లాటరీ కోసం ChatGPTని ఉపయోగించింది. కేవలం వాడడమే కాదు కోటి రూపాయలకు పైగా గెలిచింది. అసలు ఆమె ఏమి చేసింది.. లాటరీలో వచ్చిన డబ్బును ఏమి చేసింది వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు (AI Lottery Story) చూసేద్దాం. 

ముందు స్కామ్ అనుకుందట..

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఎడ్వర్డ్స్ అనేమహిళ లాటరీ కొనాలనుకుందట. దానికోసం ChatGPTని ఉపయోగించి పవర్​ బాల్ లాటరీ నంబర్​ను సూచించమని అడిగిందట. చాట్​జీపిటీ ఇచ్చిన అదే నెంబర్​తో లాటరీ బుక్ చేసిందట ఎడ్వర్డ్స్. లాటరీ టికెట్ కొన్న రెండు రోజుల తర్వాత ఆమె లాటరీ గెలిచినట్లు మెసేజ్ వచ్చిందని.. దానిని క్లైయిమ్ చేసుకోమనే మెసేజ్ చూసి షాక్ అయినట్లు తెలిపింది. మొదట్లో ఇదేదో స్కామ్ అనుకొని భయపడిందట. కానీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నిజమేనని తెలుసుకుందట. దీంతో ఆమె లక్ష యాభైవేల డాలర్లు గెలుచుకుంది. అంటే 1.32 కోట్లు అనమాట. 

పెద్ద మొత్తంలో లాటరీ గెలిస్తే ఎవరైనా ఏమి చేస్తారు.. తమ అవసరాలు తీర్చుకుంటారు. అప్పులు ఉంటే తీర్చేసి.. తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడే ఎడ్వర్డ్స్ మరో దారిని ఎంచుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్​కి గురిచేసింది. 

డబ్బును ఏమి చేస్తుందంటే.. 

లాటరీ ద్వారా వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించాలని అనుకోవట్లేదట ఎడ్వర్డ్స్. ఈ మొత్తాన్ని ట్రస్ట్​కి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. దీనిని కేవలం లక్​గా భావిస్తానని.. అందుకే ఈ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చింది.   

ఈ నేపథ్యంలో వర్జినీయా మహిళ లాటరీ స్టోరీ వైరల్ అవుతుంది. కొందరు అయితే ChatGPTని ఇలా కూడా ఉపయోగిస్తారా అంటే.. వావ్ ఆమె లక్​కి ఏఐ కూడా హెల్ప్ చేసిందంటూ చెప్తున్నారు. మరికొందరు ఎలా అయితేనేమి.. తనకి వచ్చిన మొత్తం డబ్బును ఛారిటీలకోసం ఇచ్చేసిన దేవత అంటూ స్టోరిని వైరల్ చేస్తున్నారు. సరైన రీతిలో వాడుకుంటే ChatGPT కూడా మీకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది అనడానికి ఇదే నిదర్శనం. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget