History of Christmas Day : క్రిస్మస్ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Back Story of Christmas Day : మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వచ్చేస్తుంది. అయితే డిసెంబర్ 25వ తేదీనే ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారో మీకు తెలుసా?
Why is 25 December celebrated as Christmas : క్రిస్టియన్స్ దేవుని కుమారునిగా భావించే యేసు క్రీస్తు జన్మించిన రోజుకు గుర్తుగా క్రిస్మస్ చేసుకుంటారు. దాదాపు అన్ని దేశాల్లో క్రిస్మస్ను డిసెంబర్ 25వ తేదీనే జరుపుకుంటారు. కానీ మీకు తెలుసా? యేసు క్రీస్తు డిసెంబర్ 25వ తేదీన పుట్టారని తెలిపే సాక్ష్యం ఒక్కటి కూడా లేదు. బైబిల్లో కూడా దీని గురించిన ప్రస్తావన లేదు. అయినా సరే డిసెంబర్ 25నే ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారు?
రోమన్ సంప్రదాయమా?
మొదటి క్రిస్టియన్ రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ కాలంలో క్రిస్మస్ను డిసెంబర్ 25వ తేదీన చేసుకోవడం ప్రారంభించారు. కానీ ఆ సమయంలో ఇది అధికారిక రోమన్ పండుగ కాదు. అయినప్పటికీ అందరూ డిసెంబర్ 25న చేసుకోవడం ప్రారంభించారు. అయితే క్రిస్మస్ అదే రోజు జరుపుకోవడానికి కొన్ని విభిన్న సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జీసస్ తల్లి అయిన మేరి చాలా ప్రత్యేకమైనది. కన్య అయిన మేరి కడుపున జీసస్ పుడతారని చెప్పిన రోజు మార్చి 25న అని.. దాని తర్వాత తొమ్మిది నెలలకు డిసెంబర్ 25 వస్తుందని ఇలా చేసుకుంటారని చెప్తారు.
యూదుల క్యాలెండర్ ఏమి చెప్తోంది..
యూదుల క్యాలెండర్ చంద్రుడిపై ఆధారపడి ఉండేది. గ్రెగోరియన్ క్యాలెండర్ వంటి స్థిరమైన క్యాలెండర్లలోని తేదీలతో పోలిస్తే క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. పైగా కీస్తు పుట్టిన సమయంలో చలి ఎక్కువగా ఉన్నట్లు అప్పటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అందుకే శీతాకాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే శీతాకాలంలో ప్రారంభంలో తినడానికి, తాగడానికి అనువైన సమయం కూడా ఇదే. కాబట్టి పండుగను చేసుకునేందుకు అనువైన సమయంగా దీనిని పరిగణిస్తారు.
న్యూ ఇయర్‌కి ముందే..
క్రైస్తవులు యేసు ప్రపంచానికి వెలుగు అని నమ్ముతారు. కాబట్టి తొలి క్రైస్తవులు యేసు జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇదే సరైన సమయమని భావించారు. న్యూ ఇయర్‌కి ముందే క్రీస్తు జననం జరిగినట్లు భావిస్తారు. కాబట్టి డిసెంబర్లోనే ఈ పండుగను చేసుకుంటారు. అయితే రోమన్ పండుగలు నుంచి డిసెంబర్‌ని 25ని క్రైస్తవులు తీసుకున్నారని కూడా ఓ రూమర్ ఉంది. ఏది ఏమైనప్పటికీ.. సెక్స్టస్ జూలియస్ ఆఫికానస్ నుంచి.. మార్చి 25 వరకు ప్రారంభ క్రైస్తవులకు సంబంధించిన రికార్డులున్నాయి. దాని ప్రకారం సోల్ ఇన్విక్టస్కి చాలా సంవత్సరాల ముందే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు.
బాప్టిజం రోజు క్రిస్మస్?
ప్రారంభంలో క్రిస్మస్ను జవరి 6న కూడా జరుపుకునేవారు. అయితే క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని కాకుండా బాప్టిజం తీసుకున్న రోజును క్రిస్మస్‌గా చేసుకునేవారు. గర్భధారణ గణనపై కాకుండా.. బాప్టిజం క్రీస్తు జననం కంటే పవిత్రమైనదని భావిస్తూ దీనిని నిర్వహించేవారని చరిత్ర చెప్తుంది. అయితే యూదుల పండుగ అయిన హనుక్కాను కూడా డిసెంబర్ 25నే చేసుకునేవారు. యేసు యూదుడు కాబట్టి.. క్రిస్మస్ను డిసెంబర్ 25 వ తేదీన చేసుకోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
6వ శతాబ్దంలో క్రైస్తవ మతాన్ని పరిచయం చేస్తూ.. పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు చేసేవారు. అక్కడ రోమన్ క్యాలెండర్‌ను ఉపయోగించి డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకోవడం ప్రారంభించారు. అప్పుటినుంచి బ్రిటన్, పశ్చిమ యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ జరుపుకోవడం ప్రారంభించారు.
Also Read : క్రిస్మస్ టూర్‌కి వెళ్లాలనుకుంటే.. లాంగ్ వీకెండ్లో ఇక్కడికెళ్లిపోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.