White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!
తెల్ల అన్నం తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బరువు తగ్గడం కోసం వైట్ రైస్ ఉత్తమ ఎంపిక.
పూర్వం వరి అన్నం అంటే గొప్ప వాళ్ళు మాత్రమే తినే వాళ్ళు. రాగి సంకటి, జొన్న సంకటి వీటిని ఆ కాలంలో పేదవాళ్ళు ఆహారంగా తీసుకునే వాళ్ళు. తెల్ల బియ్యంతో అన్నం వండుకున్నారంటే అది గొప్ప పండుగ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది. పేదవాళ్ళు తెల్ల అన్నం తింటుంటే డబ్బున్న వాళ్ళు రోగాలు తగ్గించుకునేందుకు రాగి సంకటి, జొన్న రొట్టెల మీద పడుతున్నారు. శతాబ్దాలుగా వైట్ రైస్ ప్రధాన ఆహారంగా మారిపోయింది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫోలేట్, విటమిన్ బి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ పోషక పదార్ధాల కారణంగా ఇది సంవత్సరాలుగా వైట్ రైస్ వల్ల ప్రయోజనాలేవీ లేవని కొందరు నమ్ముతున్నారు. అయితే వైట్ రైస్ గతంలో చెప్పినంత అనారోగ్యకరమైనది కాదని ఇటీవల పరిశోధనలు సూచిస్తున్నాయి.
తెల్ల అన్నంలో పోషకాలు లేవని అనుకుంటారు. కానీ నిజానికి ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియానికి మంచి మూలం. ఇవి ఆరోగ్యకరమైన కణాల పనితీరు, రక్తపోటు నియంత్రణ, గుండె జబ్బుల నివారణకు ముఖ్యమైనవి. ఇందులో కొవ్వు, సోడియం కూడా తక్కువగా ఉంటుంది. ఊబకాయం, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే వైట్ రైస్ ఇప్పటికీ శుద్ది చేసిన కార్బోహైడ్రేట్. శుద్ది చేయని తృణధాన్యాలలో లభించే ఫైబర్, పోషకాలు ఇందులో లేవు. అందుకే వైట్ రైస్ ని మితంగా తీసుకోవడం మంచిది. కూరగాయలు, లీన్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు నిండిన వాటితో కలిపి తీసుకోవాలి. వైట్ రైస్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
శక్తిని అందిస్తుంది
వైట్ రైస్ తినడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చే ప్రాథమిక వనరు.
గ్లూటెన్ రహితం
వైట్ రైస్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. గ్లూటెన్ అసహనం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు.
సులభంగా జీర్ణం అవుతుంది
వైట్ రైస్ జీర్ణం చేయడం సులభం. జీర్ణ సమస్యలు ఉన్నవారిని ఉత్తమ ఎంపిక. జలుబు, దగ్గు ఇతర కాలానుగుణ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు చప్పగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటువంటి సమయంలో వైట్ రైస్ బెస్ట్ ఎంపిక.
రక్తపోటు తగ్గిస్తుంది
తెల్ల అన్నం తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.
యాంటీ ఆక్సిడెంట్లు
వైట్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు, డీఎన్ఏ, ప్రోటీన్ కి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గుతారు
వైట్ రైస్ తింటే బరువు పెరుగుతారని అంటారు. కానీ నిజానికి దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి.
రోగనిరోధక శక్తి
విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ
వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
కేలరీలు తక్కువ
ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్ లో కెలరీలు తక్కువ. ఒక కప్పు వండిన రైస్ లో కేవలం 200 కేలరీలు మాత్రమే ఉంటాయి. బ్రౌన్ రైస్ లో దాదాపు 215 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి వైట్ రైస్ మంచి ఎంపిక.
తెల్ల బియ్యం అనుకున్నంత అనారోగ్యకరమైనది ఏమి కాదు. మితంగా తీసుకుంటే ఇది పోషకాలు నిండిన ఆహారమే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు