అన్వేషించండి

Refrigerator: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు త్వరగా చెడిపోతున్నాయా? అలా కాకూడదంటే ఇలా చేయండి

ఫ్రిజ్‌లో పెట్టినా సరే.. ఆహార పదార్థాలు, కూరగాయలు చెడిపోతూ ఉంటాయి. అందుకు కారణం టెంపరేచర్. అసలు ఫ్రిజ్ లో ఎంత టెంపరేచర్ ఉంచాలో తెలుసా?

పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ ఇలా అన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని తినడం అందరికీ ఉన్న అలవాటే. అయితే, కొన్ని ఆహార పదార్థాలు ఒకటి లేదా రెండు రోజుల తర్వాత వాటిని తినడానికి చూస్తే అవి చెడిపోయి కనిపిస్తాయి. ఇలా అందరి ఇళ్ళల్లో జరుగుతుంది. అందుకు కారణం ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత. ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ లేదా తక్కువగా ఉండే ఆహారం త్వరగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి.

అసలు రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?

వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రాం (WRAP) ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సగం కుటుంబాలు తమ రిఫ్రిజిరేటర్‌లను అవసరమైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ - 7 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచుతున్నాయి. అలా చేయడం వల్ల ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. WRAP ప్రకారం రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 0 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి.

మరీ వెచ్చగా ఉండకూడదు

వివిధ పరిశోధనల ప్రకారం ఫ్రిజ్ లో నిల్వ చేసే ఆహారాన్ని 5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకూడదు. కానీ చాలా మంది ఉష్ణోగ్రతని ఎక్కువగా సెట్ చేసి పెట్టుకుంటారు. ఇది ఆహార పదార్థం నిల్వ ఉంచేందుకు తగిన విధంగా ఉండదు. ఫ్రిజ్ ని డేంజర్ జోన్ లోకి తీసుకెళ్తుంది. ఆహారం త్వరగా చెడిపోతుంది. ఆ విషయం పదార్థాలు చెడిపోయేదాక మనకి కూడా తెలియదు.

మరీ చలి కూడా ఉండకూడదు

చల్లగా ఉన్న ఉష్ణోగ్రత సెట్ చేయడం వల్ల కూడా ఆహారం త్వరగా పాడైపోవడానికి దారితీస్తుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద వృద్ధి చెందే బ్యాక్టీరియా ఆహార పదార్థాల మీద చేరి అవి త్వరగా చెడిపోయేలా చేస్తాయి.

సీజన్లలో మారుస్తూ ఉండాలి

భారత్ వంటి దేశాల్లో సీజన్ కి అనుగుణంగా ఉష్ణోగ్రత మార్చుకుంటూ ఉండాలి. శీతాకాలం లేదా వేసవి కాలంలో ఒక్కోరకంగా టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. సీజన్ మారే టైమ్ లో ఉష్ణోగ్రత మార్చేటప్పుడు ఫ్రిజ్ ని తప్పనిసరిగా శుభ్రం చెయ్యాలి. లేదంటే అందులోని బ్యాక్టీరియా వాటికి వ్యాపిస్తుంది.

రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత కొలవడం ఎలా?

అందరూ ఫ్రిజ్ కొనుగోలు చేసేటప్పుడు టెంపరేచర్ సర్దుబాటు ఉందో లేదో సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మరిన్ని ఆధునిక ఫీచర్లతో ఫ్రిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రిఫ్రిజిరేటర్ల వినియోగాన్ని పరిమితం చేస్తున్నాయి. దాని వల్ల కరెంట్ కూడా ఆదా అవుతుంది. ఒక వేళ ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉందో మీ ఫ్రిజ్ చూపించకపోతే దాన్ని తెలుసుకునేందుకు మార్గం కూడా ఉంది. ఇది చెక్ చెయ్యడానికి మార్కెట్లో థర్మామీటర్ ఉంటుంది. దీన్ని ఫ్రిజ్ లో పెడితే 1-2 డిగ్రీలోపు రీడింగ్ ని అందిస్తుంది. అది ఫ్రిజ్ కి సరైన ఉష్ణోగ్రత. దీన్ని కొలిచేందుకు థర్మామీటర్ ని రిఫ్రిజిరేటర్ మధ్యలో ఉంచాలి. ఖచ్చితమైన రీడింగ్ కోసం ఫ్రిజ్ డోర్ వేసి కనీసం 6-7 గంటల పాటు వేచి ఉంచాలి. రీడింగ్ గమనించిన తర్వాత ఉష్ణోగ్రత సెట్ చేసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: చలికాలంలో మీ పిల్లలకి రోగనిరోధక శక్తి కావాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించాల్సిందే

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget