అన్వేషించండి

Non Alcoholic Beer : నాన్ ఆల్కహాలిక్ బీర్లు తెగ తాగేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే గుండె ఆగుద్ది

ఆల్కహాల్ కలిసిన బీర్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. మరి నాన్ ఆల్కహాలిక్ బీర్లు ఆరోగ్యానికి మంచివేనా?

మందుబాబులకు బీరు అనగానే జోష్ వచ్చేస్తుంది. సీజన్లతో సంబంధం లేకుండా సీసాలకు సీసాల బీర్లు ఖాళీ చేసేస్తుంటారు. అయితే బీరులో ఉండే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీరుకు దూరం అవుతున్నారు. కానీ దాని రుచిని ఆస్వాదించాలి అనుకునేవారు నాన్ ఆల్కహాల్ బీర్లకు షిఫ్ట్ అవుతున్నారు. మరి ఇలా చేయడం కరెక్టేనా? అసలు నాన్ ఆల్కహాల్ బీర్స్ అంటే ఏమిటి? వీటిని ఎలా తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచిగా కావా అనే విషయాలు తెలుసుకుందాం. 

ఈ మధ్యకాలంలో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. మద్యం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి బయటపడేందుకే యువత ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అటు మద్యం తయారీ కంపెనీలు సైతం నాన్ ఆల్కహాలిక్ బీర్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. వీటిని సాధారణ సూపర్ మార్కెట్లలో సైతం విక్రయిస్తున్నారు. దీని నుంచి సాంప్రదాయ బీరు రుచిలోనే ఉంటుంది. కానీ ఇందులో ఆల్కహాల్ శాతం సున్నా అవడం వల్ల మత్తు రాదు.. అయితే నాన్ ఆల్కహాలిక్  బీర్లను అధికంగా సేవించడం వల్ల కూడా దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు తాజా అధ్యయనంలో తేల్చారు. 

నాన్ ఆల్కహాలిక్ బీర్లలో ఆల్కహాల్ లేకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కలిగించే ఈ కొలి, సాల్మొనెల్ల వంటి బ్యాక్టీరియాలు ఈ నాన్ ఆల్కహాలిక్ బీర్లలో ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఫుడ్ పాయిజనింగ్ కలిగించే అవకాశం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. నాన్ ఆల్కహాలిక్ బీర్లలో ఉండే ఈ బ్యాక్టీరియా మూడు నెలల వరకు యాక్టివ్ గా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 

ఈ నాన్ ఆల్కహాలిక్ బీర్లకు బదులుగా పరిమిత మోతాదులో సాధారణ బీర్లను తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది అని అమెరికాలోని కార్నల్ వర్సిటీకి చెందిన డాక్టర్ చార్లెస్ చెబుతున్నారు. ఆల్కహాల్ బీర్లలో కన్నా కూడా నాన్ ఆల్కహాల్ బీర్లలోనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో తెగింది. ఈ నేపథ్యంలో నాన్ ఆల్కహాలిక్ బీర్లకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

ఒకవేళ మీరు పార్టీల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే.. సాధారణ ఆల్కహాల్ బీర్లనే పరిమిత మోతాదులో సేవిస్తే మంచిదని సైతం నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్కెట్లో ప్రస్తుతం నాన్ ఆల్కహాలిక్ బీర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది వీటి ఉత్పత్తి పెరుగుతోంది. అయితే నాన్ ఆల్కహాలిక్ బీర్లకు బదులుగా పార్టీల్లో  ఇతర నాన్ ఆల్కహాలిక్  డ్రింక్స్ కు పరిమితం అయితే మంచి దాని సైతం నిపుణులు చెబుతున్నారు.

Also Read : సెల్‌ఫోన్‌తో సంతాన సమస్యలు - అబ్బాయిలూ మీరు ఈ రిస్క్ చేస్తున్నారా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Floor Cleaning Tips: ఫ్లోర్‌ తుడుస్తున్నప్పుడు నీటిలో ఇవి కలిపితే ఇల్లంతా ధగధగ మెరుస్తుంది!
ఫ్లోర్‌ తుడుస్తున్నప్పుడు నీటిలో ఇవి కలిపితే ఇల్లంతా ధగధగ మెరుస్తుంది!
Chicken Pulao Recipe: చికెన్ పులావ్ సీక్రెట్ రెసిపీ తెలుసుకుంటే చికెన్ బిర్యానీని మర్చిపోతారు!
చికెన్ పులావ్ సీక్రెట్ రెసిపీ తెలుసుకుంటే చికెన్ బిర్యానీని మర్చిపోతారు!
How To Cut Bhindi: బెండకాయను ఎలా కట్ చేయాలి? సరిగ్గా కోయకుంటే టేస్ట్‌ పోతుంది!
బెండకాయను ఎలా కట్ చేయాలి? సరిగ్గా కోయకుంటే టేస్ట్‌ పోతుంది!
How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War Latest Updates: ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Dulquer Salmaan Pooja Hegde : దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Embed widget