అన్వేషించండి

Sperm Count: సెల్‌ఫోన్‌తో సంతాన సమస్యలు - అబ్బాయిలూ మీరు ఈ రిస్క్ చేస్తున్నారా?

మీరు సెల్ ఫోన్ వాడుతున్నారా? దాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నారు? జేబులు పెట్టుకుంటుంటే మాత్రం.. ఈ అధ్యయనం గురించి తెలుసుకోవాలి.

రోజుల్లో ఫోన్ లేకుండా ఏ పనులు జరగడం లేదు. ఒకప్పుడు కేవలం కమ్యునికేషన్‌కు మాత్రమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ ఇప్పుడు. వినోదం నుంచి ఉపాధి వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. దీంతో ఎవరూ ఫోన్లు వదల్లేని పరిస్థితి. చెప్పాలంటే.. నేటి తరం టీవీ కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రీల్స్, షార్ట్స్ అంటూ టైంపాస్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరూ రెండేసి ఫోన్లతో బిజీ బిజీగా మారిపోయారు. ఈ ఫోన్ల వల్ల కంటి చూపు నుంచి బ్రెయిన్ వరకు ప్రతి పార్ట్‌కు నష్టం తప్పదంటూ కొన్ని అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. తాజాగా మరో అధ్యయనం.. ఏకంగా మగతనానికే లింకు పెట్టింది. ఫోన్ల వల్ల పురుషుల వీర్యంలోని స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుందని.. ఫలితంగా వారిలో సంతాన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ అప్రమత్తం చేసింది.

ఫోన్ అతిగా వాడేవారికి.. తక్కువ వాడేవారికి ఇదీ తేడా

స్వీస్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో.. రోజుకు 20 సార్లు కంటే ఎక్కువ ఫోన్ ఉపయోగించే పురుషులకు, వారంలో ఒకటి లేదా అంతకంటే తక్కువ వాడేవారికి మధ్య స్పెర్మ్ కౌంట్‌లో తేడాను తెలుసుకున్నారు. తక్కువగా ఫోన్లు ఉపయోగించేవారితో పోల్చితే.. 20 సార్లు కంటే ఎక్కువగా ఫోన్ ఉపయోగించేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నట్లు గమనించారు. మొబైల్ ఫోన్లు విడుదల చేసే మైక్రోవేవ్స్ ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 

జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సెర్జ్ నెఫ్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మొబైల్ ఫోన్‌ నుంచి విడుదలయ్యే మైక్రోవేవ్‌లే కారణమా? అవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అవి వృషణాల ఉష్ణోగ్రతను పెంచి.. స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమయ్యే హార్మోన్లను నియంత్రిస్తున్నాయా అనే విషయాలను ఇంకా తెలుసుకోవలసి ఉంది’’ అని చెప్పారు. 

ఈ జాగ్రత్తలతో భవిష్యత్తును కాపాడుకోండి

ఇప్పటికే కాలుష్యం, ఆహారపు అలవాట్లు.. ఇతరాత్ర కారణాల వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. చాలామంది పిల్లల కోసం కష్టపడుతున్నారు. లక్షలు వెచ్చించి మరీ ఐవీఎఫ్ విధానాల్లో పిల్లలను కంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టడీని పురుషులు సీరియస్‌గా తీసుకోవడం ఎంతైనా అవసరం. 

సాధారణంగా పురుషులు తమ మొబైల్ ఫోన్లను ప్యాంట్ కింది జేబుల్లో పెట్టుకుంటారు. దానివల్ల బ్యాటరీ నుంచి ఉత్పత్తయ్యే వేడి కూడా మర్మాంగాలకు తగలవచ్చు. అలాగే మొబైల్ సిగ్నల్స్ రిలీజ్ చేసే శక్తి కూడా ఆ చుట్టుపక్కలే ఉంటుంది. కాబట్టి, అబ్బాయిలూ.. ఈ సారి నుంచి ఫోన్లను కింది జేబుల్లో కాకుండా ఏదైనా బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే, దాని వాడకాన్ని తగ్గించడం కూడా అత్యుత్తమం. 

ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికి పడిపోయిన స్పెర్మ్ కౌంట్?

ఒకప్పుడు మన తాతలు, వారి తాతలు.. దడ దడా పిల్లలను పుట్టించేసేవారు. కానీ, ఈతరం మాత్రం ఒకరిని కనేందుకే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందా అని శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు జరిపితే.. ప్లాస్టిక్ వినియోగం, ఊబకాయం, కాలుష్యం, వ్యాయమం లేకపోవడం, ఆహారపు అలవాట్లే దోషులని తేలింది. కానీ, కచ్చితమైన కారణాన్ని తెలుసుకోలేకపోయారు. మరో దారుణమైన విషయం ఏమిటంటే..  గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ 50 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. తాజా అధ్యయనంలో 2005 నుంచి 2018 సంవత్సరాల మధ్య 18 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు గల 2,886 మంది యువకులపై ఈ పరిశోధనలు జరిపారు. ఈ ఐదేళ్లలో కూడా తీస్తే.. మరిన్ని ఆధారాలు లభిస్తాయి. ఎందుకంటే.. ఈ ఐదేళ్లలో మొబైల్ వాడకం రెండింతలు పెరిగింది. కాబట్టి, అబ్బాయిలు.. ఎందుకైన మంచిది.. జర భద్రం. 

Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget