అన్వేషించండి

ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి

ఎప్పుడూ తినే పండ్లే కాదు, అప్పుడప్పుడు ఈ బ్లాక్ బెర్రీలను కూడా తింటూ ఉండాలి.

బ్లాక్ బెర్రీ పండ్లను మనం చాలా తక్కువగా తింటాం కానీ విదేశాల్లో మాత్రం వీటిని అధికంగా తింటారు. అక్కడ ఇవి ఎక్కువగా పండుతాయి. బ్లాక్ బెర్రీలను తినడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. బ్లాక్ బెర్రీలలో ఆంథోసినిన్స్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. వీటివల్లే బ్లాక్ బెర్రీలకు ఆ ముదురు రంగు వస్తుంది. వీటి వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. దీనిలో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.

ఈ పండ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే క్యాన్సర్ ముప్పును తగ్గించే శక్తి దీనికి ఉంది. ఈ బ్లాక్ బెర్రీలను తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణుపులు పెరగకుండా అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అలాగే క్యాన్సర్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి  వ్యాప్తి చెందకుండా ఇవి అడ్డుకుంటాయని పరిశోధన కర్తలు చెబుతున్నారు. కాబట్టి బ్లాక్ బెర్రీలను అప్పుడప్పుడు తినాల్సిన అవసరం ఉంది. మెదడు ఆరోగ్యానికి కూడా బ్లాక్ బెర్రీలు చాలా ముఖ్యం. దీనిలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. మెదడు పనితీరుకు మాంగనీస్ అవసరం. మాంగనీస్ లోపిస్తే మెదడు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెదడు కోసం కూడా బ్లాక్ బెర్రీలను తినాల్సిందే. 

ఈ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు బ్లాక్ బెర్రీలను తరుచూ తింటూ ఉండాలి. పొట్టలో ఉండే అల్సర్లను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. అల్సర్ల వల్ల కలిగే మంటను దాదాపు 88% ఈ బ్లాక్ బెర్రీలు తగ్గిస్తాయని ఒక అధ్యయనం నిరూపించింది. నోటి ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను పోగొడతాయి. అలాగే దంత ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. బ్లాక్ బెర్రీలను ఎవరికీ పడకపోవడం అనేది ఉండదు. వీటివల్ల అలర్జీలు రావడం అరుదుగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్లాక్ బెర్రీలను తినవచ్చు.

ఈ పండ్లలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరం. అంటువ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటాయి. చర్మ సౌందర్యానికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తింటూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 

Also read: వారాలు గడుస్తున్నా జలుబు తగ్గడం లేదా? అయితే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉన్నట్టే

Also read: తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget