అన్వేషించండి

తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు

చాలామంది అజీర్తి సమస్యలను చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఒక్కోసారి అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.

జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఆధునిక కాలంలో పెరిగిపోతున్నాయి. చాలామంది తిన్నాక ఆహారం అరగక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యను చాలా తేలికగా తీసుకుంటున్నారు ఎంతోమంది. కానీ ఇలా అజీర్తి సమస్యలు పెద్ద పేగు క్యాన్సర్‌కు కారణం కావచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనం తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో సరిగ్గా జీర్ణమైనప్పుడే అది శక్తి రూపంలోకి మారుతుంది. శరీరంలోని వివిధ అవయవాలకు ఆ శక్తి  అందుతుంది. ఆహారం జీర్ణం కాకపోతే శరీర అవయవాలకు శక్తి అందక నీరసపడతాయి. అందుకే జీర్ణ క్రియ చాలా ముఖ్యమైనది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు రక్తంలోకి చేరి గుండె వంటి ప్రధాన అవయవాలను కాపాడతాయి. రక్తం నుంచే పోషకాలు శరీరంలోని ఇతర అవయవాలకు చేరుతాయి. ఎప్పుడైతే అజీర్తి సమస్యలు వచ్చాయో శక్తి, పోషకాలు రెండూ అవయవాలకు అందవు. అందుకే జీర్ణ సమస్యలను తేలిగ్గా తీసుకోకూడదు. ఎక్కువ  రోజులపాటు అజీర్తి సమస్య ఉంటే వెంటనే వైద్యులను కలవడం చాలా ముఖ్యం.

అజీర్తి సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులకు సంకేతం కావచ్చు. అందుకే జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. అజీర్తి... పెద్ద పేగు క్యాన్సర్ వల్ల కలిగితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొట్ట కింద నొప్పిగా ఉంటుంది. మల విసర్జన సమయంలో నొప్పి వస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. బరువు తగ్గిపోతారు. తీవ్రమైన అలసట వస్తుంది. విరేచనాలు అధికంగా అవుతాయి. పొట్ట బిగబట్టినట్టు అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మందులు చికిత్స తీసుకోవాలి.

అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే వ్యాయామం అధికంగా చేయాలి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. అధిక మసాలాలు, కారం దట్టించిన ఆహారాన్ని తినకపోవడమే మంచిది. తేలికపాటి పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటే ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. రాత్రి భోజనాన్ని ఎనిమిది గంటల్లోపే పూర్తి చేయాలి. నిద్రపోవడానికి, భోజనం తినడానికి మధ్య కనీసం గంటన్నర నుంచి రెండు గంటల గ్యాప్ ఉండడం చాలా ముఖ్యం. ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. యోగా, వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తిన్న వెంటనే నిద్రపోకూడదు. నిద్రపోతే జీర్ణ వ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. భోజనం చేశాక కనీసం గంట పాటూ మెలకువగానే ఉండాలి. 

Also read: గుండెలో వేసిన స్టంట్‌లు పూడుకుపోయే ముప్పు ఉందా? పూడుకుపోతే ఏం చేస్తారు?

Also read: కోడిగుడ్లు అధికంగా తింటే వచ్చే సమస్యలు ఇవే, అందుకే రోజుకు ఎన్ని తినాలంటే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pineapple Juice : సమ్మర్లో బాడీ కూల్‌గా ఉండాలా? పైనాపిల్ జ్యూస్ బెస్ట్ సొల్యూషన్, మరెన్నో లాభాలు
సమ్మర్లో బాడీ కూల్‌గా ఉండాలా? పైనాపిల్ జ్యూస్ బెస్ట్ సొల్యూషన్, మరెన్నో లాభాలు
Neem Face Pack : వేప ఫేస్ ప్యాక్‌తో గ్లోయింగ్ స్కిన్.. మొటిమలు, ఆయిల్ స్కిన్‌ కూడా దూరం, ఇలా ట్రై చేయండి
వేప ఫేస్ ప్యాక్‌తో గ్లోయింగ్ స్కిన్.. మొటిమలు, ఆయిల్ స్కిన్‌ కూడా దూరం, ఇలా ట్రై చేయండి
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Hidden Heart Risks : గుండెపోటు రిస్క్ పెంచేస్తోన్న ప్రధాన కారకం.. కొలెస్ట్రాల్ కాదంటోన్న నిపుణులు, జాగ్రత్త సుమీ
గుండెపోటు రిస్క్ పెంచేస్తోన్న ప్రధాన కారకం.. కొలెస్ట్రాల్ కాదంటోన్న నిపుణులు, జాగ్రత్త సుమీ

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Embed widget