Excessive Sweating : చెమట ఎక్కువ పడుతుందా? అయితే ఆ ఆరోగ్య సమస్యే కారణం
Hyperhidrosis : ఎక్కువ కష్టపడినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, సమ్మర్లో చెమట వస్తుంటుంది. అయితే చెమట మోతాదుకు మించి ఎక్కువ వస్తుందంటే మీకు ఆ సమస్య ఉందని అర్థం.
Heavy Sweat : చెమట అనేది చర్మం నుంచి విడుదలయ్యే ఒకరకమైన స్రావం. ఇది స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. దీనిలో నీరు, వివిధ లవణాలు కలిసి ఉంటాయి. అయితే దీనిలో దుర్వాసన కలిగించే పదార్థాలు కూడా ఉంటాయి. వివిధ కారణాల వల్ల శరీరం నుంచి చెమట విడుదల అవుతుంది. ముఖ్యంగా సమ్మర్ దాదాపు అందరికీ చెమట వస్తుంది. ఎండలో బయటకు వెళ్లినా.. కాసేపు ఫ్యాన్, ఏసీ లేకపోయినా చెమట పట్టేస్తుంది. అయితే కొందరికి చెమట అధిక స్థాయిలో వస్తుంటుంది. ఇది ఓ అనారోగ్యానికి సంకేతం అంటున్నారు. అదే హైపర్ హైడ్రోసిస్.
హైపర్ హైడ్రోసిస్ ప్రాణాంతకమా?
హైపర్ హైడ్రోసిస్ అనేది అధిక చెమటను కలిగించే ఓ సమస్య. ఇది అధిక చెమటను కలిగించి.. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది శరీరంలోని ఒక ప్రాంతం లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీనినే సుడోరియా అనికూడా అంటారు. ఇది ప్రాణాంతకం కానప్పటికీ.. తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కలిగే ఇబ్బందులు మానసిక ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే ఈ సమస్య వల్ల కలిగే కారణాలు, లక్షణాలు, రోగ నిర్థారణ, చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హైపర్ హైడ్రోసిస్ కౌమారదశలో ప్రారంభమవుతుంది. ఇది పాదాలు, చేతులు, ముఖం, చంకను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతాల్లో చెమట చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ హైపర్ హైడ్రోసిస్ అనేది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య కొందరిలో పుట్టుకతో రావచ్చు. అది తర్వాత అభివృద్ది చెందుతుంది. యుక్తవయసులోనే ఈ సమస్య ప్రారంభమవుతుంది.
ఆరోగ్య సమస్యలతో..
ప్రైమరీ ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ రావడానికి పెద్దగా కారణాలు ఏమి ఉండవు. కానీ సెకండరీ హైపర్ హైడ్రోసిస్ స్థూలకాయం, మెనోపాజ్, కణితి, మెర్క్యూరీ పాయిజనింగ్, డయాబెటిస్ లేదా హైపర్ థైరాయిడిజం వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యలవల్ల ఎక్కువ చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ సమస్యతో మిలియన్ల మంది ఇబ్బంది పడుతున్నారు. హైపర్ హైడ్రోసిస్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ఇది అసౌకర్యం, ఆందోళ కలిగిస్తూ ఇబ్బందికరంగా మారుతుంది. వ్యక్తిగత సంబంధాలు, స్వీయ, భావోద్వేగ శ్రేయస్సును ఇది ప్రభావితం చేస్తుంది.
చర్మ సమస్యలు
ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వంటి చికాకును కలిగించే బ్యాక్టీరియాను చెమట కలిగిస్తుంది. వీటివల్ల చర్మ సమస్యలు దీనివల్ల పెరుగుతాయి. దుస్తులు చెమటతో తడిసిపోతాయి. శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. ఇది శారీరక సంబంధాలకు దూరం చేస్తుంది. కొన్నిసార్లు నిరాశకు గురిచేస్తుంది. బట్టలు తరచూ మార్చుకోవాల్సిన పరిస్థితి, న్యాపికిన్స్ వాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది.
ఈ సమస్యను మీరు గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. బ్లెడ్, యూరిన్, థైరాయిడ్ టెస్ట్లు చేసి వారు మీకు చికిత్సను అందిస్తారు. రోజువారీ కార్యకలాపాలు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు. డియోడ్రెంట్స్ చెమటను ఆపవు కానీ.. యాంటీ పెర్స్పిరెంట్స్ స్ప్రేలు చేస్తాయి. ఇది స్వేదగ్రంథులను కంట్రోల్ చేస్తుంది. ఆర్మ్పిట్ షీల్డ్స్ చెమట నుంచి దుస్తులను కాపాడుతాయి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుంటే మంచిది.
Also Read : పరగడుపునే ఇవి తాగితే.. మధుమేహం, బరువు కంట్రోల్లో ఉంటుందట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.