(Source: ECI/ABP News/ABP Majha)
Quitting Coffee Benefits : కాఫీ మానేస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. తాజా అధ్యయన ఫలితాలు చూశారా?
Caffeine Withdrawal : కాఫీ మీకు ఫేవరెట్ డ్రింక్ కావొచ్చు. కానీ.. దానిని మీరు ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది అంటుంది తాజా అధ్యయనం. పూర్తిగా మానలేకపోయినా కనీసం వినియోగం తగ్గించమంటున్నారు.
New Study on Coffee : కాఫీని చాలామంది ఇష్టపడతారు. ఉదయం లేచిన వెంటనే కాఫీ పడకపోతే తమ ప్రపంచం ఆగిపోతుంది అన్నట్లు మాట్లాడుతారు. మరికొందరు అయితే కాఫీ అడిక్ట్స్ ఉంటారు. వారు అయితే మాకు ఇప్పుడు కాఫీ లేకపోతే బతకలేము అన్నట్లు స్ట్రెస్ ఫీల్ అయితారు. కాఫీ తాగిన తర్వాత రిలాక్స్ అయ్యామని చెప్తారు. అయితే కాఫీని తాగడం కాదు మానేస్తే చాలా మంచిది అంటుంది తాజా అధ్యయనం. ఇది మీ మెదడు, జీర్ణ, దంత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తారు.
కాఫీకి గుడ్‌బాయ్ చెప్పడం చాలా కష్టం కానీ.. మీ దంతాలు, మెదడు, కడుపు మీకు థ్యాంక్స్ చెప్తాయి అంటుంది రీసెంట్ అధ్యయనం. యూరోపియన్ రివ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్సెస్‌లో దీని గురించి ప్రచురించారు. చాలా మంది కాఫీతో ప్రేమలో ఉన్నారని దీనివల్ల పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని దానిలో రాసుకొచ్చారు. కాఫీని పూర్తిగా మానేయలేని స్థితిలో మీరు ఉంటే.. దానిని తగ్గించుకునేందుకు అయినా ట్రై చేయమంటున్నారు. సుమారు నాలుగు కప్పుల కాఫీ లేదా రెండు ఎనర్జీ షాట్స్ డ్రింక్స్ తీసుకుంటే అది భారీ కెఫిన్ వినియోగంగా చెప్తున్నారు. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి అంటున్నారు. కాఫీ మానేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చుద్దాం.
నిద్ర నాణ్యత
కాఫీ మానేయడం వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో నిద్ర నాణ్యత ఒకటి. కెఫిన్‌ను కంట్రోల్ చేస్తే మీ నిద్ర నాణ్యత మెరుగవుతుంది. మీకు నిద్ర సమస్యలుంటే కెఫిన్ దానిని బాగా తీవ్రం చేస్తుంది. స్లీప్ మెడిసిన్ రివ్యూస్‌లో కెఫిన్ వాడకం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తలనొప్పి, వికారం, భయాందోళనల వంటి సంకేతాలు నిద్రకు దూరం చేస్తున్నాయని తెలిపారు. కాబట్టి కెఫిన్‌ను వదులుకుంటే మెరుగైన విశ్రాంతిని పొందవచ్చు.
తలనొప్పి
రోజువారీ లేదా దీర్ఘకాలిక తలనొప్పికి కెఫిన్ ప్రధానంగా దోహదపడుతుంది. ముఖ్యంగా ఇది మైగ్రేన్‌ను ఇది బాగా ప్రేరేపిస్తుంది. ఇది ఏకాగ్రతను దూరం చేసి.. తలనొప్పిని తీవ్రం చేస్తుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది అనుకునేవారిది భ్రమ అని.. అది తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది కానీ.. దీర్ఘకాలికంగా ఇబ్బంది కలిగిస్తుందంటున్నారు. మీరు కెఫిన్‌ను తగ్గిస్తే తలనొప్పి తగ్గే అవకాశం మెండుగా ఉంటుంది అంటున్నారు.
మానసిక ఆరోగ్యం కోసం
కెఫీన్ మీ శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది ఆందోళన, తీవ్ర భయాందోళన రుగ్మతలను పెంచుతుంది. కెఫిన్ వణుకు, వేగవంతమైన హృదయ స్పందన రేటు, భయాన్ని కలిగిస్తున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. యాంగ్జైటీ సమస్యలున్నవారు దీనికి ఎంత దూరముంటే అంత మంచిది అంటున్నారు.
మెరుగైన జీర్ణవ్యవస్థ
కెఫిన్ ప్రభావం గట్‌పై చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. కాఫీని మానేయాలి అంటున్నారు. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా.. తర్వాత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెప్తున్నారు. ఈ సమస్యతో మీరు కాఫీ మానేస్తే.. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి అంటున్నారు.
దంతాల ఆరోగ్యం
కెఫిన్ మీ నోటిని పొడిబారేలా చేసి.. దంత సమస్యలను ప్రేరేపిస్తుందని పరిశోధకులు తెలిపారు. తేమలేని, లాలాజలం లేకపోతే నోటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాలాజలం దంత క్షయాన్ని నిరోధించే ఖనిజాలు కలిగి ఉంటుంది. కెఫిన్ వల్ల దంత క్షయం సమస్య తీవ్రమవుతుంది. పైగా కెఫిన్ దంతాలపై ఉండే సహజమైన ఎనామెల్‌ను పోగొడుతుంది. తద్వార మీ దంతాల రంగు మారిపోతుంది.
కాబట్టి పెద్దలే కాదు.. పిల్లలను కూడా ఈ కాఫీ అడిక్షన్ నుంచి దూరం చేయమంటున్నారు. లేదంటే ఇది కూడా ఓ డ్రగ్ మాదిరి వ్యసనంగా మారుతుంది అంటున్నారు నిపుణులు.
Also Read : ఈ టిప్స్ ఫాలో అయితే కేవలం 5 నిమిషాల్లోనే మీ ఒత్తిడి తగ్గించుకోవచ్చు