అన్వేషించండి

Blood Transfusion Mistake : రక్తం ఎక్కించేప్పుడు ఆ తప్పు చేస్తే మనిషి చనిపోతాడట.. సకాలంలో గుర్తిస్తే బెటర్, ఆలస్యమైతే అంతే

Mismatched Blood Effects :బ్లడ్ ఎక్కించేప్పుడు ఒక్క మిస్టేక్ చేస్తే మనిషి చనిపోతాడంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ తప్పు ఏంటి? ఎలాంటి రక్తం ఎక్కించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Wrong Blood Group Transfusion Complications : మనిషి రక్తం వారి ఆరోగ్యానికి, మనుగడకు అత్యంత ముఖ్యమైనది. అయితే అదే రక్తం వేరొకరిదైతే.. అది వారి శరీరానికి సరిపోకపోతే.. రెండు బ్లడ్ గ్రూప్స్ కలిస్తే ఏమి జరుగుతుంది? వివిధ సందర్భాల్లో, ప్రమాదాల్లో, సర్జరీలు చేసేందుకు ఒక రోగికి రక్తం అవసరమైతే.. వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు రక్తం ఎక్కించేందుకు చూస్తారు. ఇది చాలా సాధారణమైన వైద్య ప్రక్రియ. కానీ చాలా సున్నితమైనది కూడా. ఎందుకంటే రోగికి బ్లడ్​ గ్రూప్, ఎక్కించే బ్లడ్ గ్రూప్ వేరు అయితే.. అది వారికి ఎక్కిస్తే.. తర్వాత ఏమవుతుంది?

సాధారణంగా ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులలో రక్తం ఎక్కించే ముందు బ్లడ్ టైపింగ్ వంటి ప్రక్రియలు చేస్తారు. ఆ సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి.. లేబులింగ్‌లో తప్పు జరగడం లేదా అత్యవసర పరిస్థితుల్లో పరీక్షించకుండా రక్తం ఎక్కిస్తే.. అది ప్రాణాంతకం కావచ్చు. 

రక్తం మారితే

డాక్టర్ మోహిత్ చౌదరి మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి అతని రక్త సమూహానికి సరిపోని రక్తం ఎక్కిస్తే.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ రక్తాన్ని విదేశీ దాడిగా భావిస్తుంది. ఈ పరిస్థితిని వైద్య భాషలో అక్యూట్ హెమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూషన్ రియాక్షన్ (AHTR) అంటారు. ఈ సమయంలో శరీరం కొత్త రక్తాన్ని నాశనం చేసేందుకు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన రక్త కణాలు పగిలిపోయి.. శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

రక్తమార్పిడితో కనిపించే లక్షణాలు

  • తీవ్రమైన జ్వరం, వణుకు
  • ఛాతీ లేదా నడుము నొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • మూత్రం రంగు ఎరుపు లేదా ముదురు రంగులోకి మారడం
  • రక్తపోటు తగ్గడం
  • శరీరంలో వాపు లేదా అలెర్జీ వంటి లక్షణాలు

ఈ లక్షణాలు సకాలంలో గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లేదంటే పరిస్థితి విషమించి మూత్రపిండాల వైఫల్యమై.. షాక్, మరణానికి కూడా దారి తీస్తుంది.

అలా జరగకూడదంటే..

  • బ్లడ్ టెస్ట్ నివేదిక : రక్తం ఎక్కించే ముందు రోగి రక్త సమూహాన్ని కచ్చితంగా గుర్తించాలి.
  • క్రాస్-మ్యాచ్ చేయడం అవసరం : దాత, రోగి రక్తాన్ని కలిపి పరీక్షించడం తప్పనిసరి. బ్లడ్ ఎక్కించే ముందు కచ్చితంగా తెలుసుకోవాలి.
  • జాగ్రత్తగా ఉండాలి : ఏ రక్తం ఎక్కిస్తున్నారో రోగి బంధువులకు కచ్చితంగా చెప్పాలి.

తప్పు బ్లడ్ గ్రూప్ఎక్కించడం అనేది  చిన్న నిర్లక్ష్యమే అయినా ఫలితాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ పరిస్థితి కేవలం నిమిషాల్లోనే శరీరంలో ఇబ్బందులు కలిగింస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి రక్తం ఎక్కించుకునేప్పుడు జాగ్రత్తగా అలెర్ట్​గా ఉండాలి. పేషెంట్​ స్పృహలో వైద్యులను అడిగి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స్పృహలో లేకుంటే వారి బంధువులకు కచ్చితంగా చెప్పాలి. అలాగే వైద్యులు కూడా పేషెంట్ బ్లడ్, దాత బ్లడ్ గ్రూప్ ఒక్కటేనో కాదో చెక్ చేసుకోవడం వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget