మన శరీరంలో బ్లడ్ ఎన్ని లీటర్స్ ఉంటుందో తెలుసా?

మనిషి శరీరంలో రక్తం కంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

ఓ వ్యక్తి శరీరంలో 35 నుంచి 40 లీటర్ల నీరు ఉంటుంది.

మరి శరీరంలో రక్తం ఎన్ని లీటర్లు ఉంటుందో తెలుసా?

రక్తంలో ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్ లేట్స్ ఉంటాయి.

ఓ వ్యక్తిలో కిలో శరీర బరువుకు దాదాపు 65 నుంచి 70ml రక్తం ఉంటుంది.

కాబట్టి ప్రతి మనిషి శరీరంలో దాదాపు 5 లీటర్ల రక్తం ఉంటుంది.

మగవారిలో సుమారు 5.5 లీటర్లు, స్త్రీలలో 4.5 లీటర్లు ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులను అడిగి తెలుసుకుంటే మంచిది. (Images Source : Getty)