Communication Skills : కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి.. గేమ్ ఛేంజింగ్ రూల్స్
Tips to Improve Communication Skills : మీ సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ 5 ప్రత్యేక పద్ధతులను ఫాలో అవ్వండి. ఇవి మీ కాన్ఫిడెన్స్ పెంచడంతో పాటు మంచి కమ్యూనికేషన్ని బిల్డ్ చేస్తాయి.

Best Communication Skills : ఎంత ప్రతిభ ఉన్నా.. మంచి కమ్యూనికేషన్ స్కిల్ లేకుంటే అదంతా వృథానే. ఎందుకంటే మీరు ఎవరితో.. ఎక్కడ మాట్లాడినా.. మీ ఫీలింగ్స్ వ్యక్త పరిచినా.. కొత్తవారితో కనెక్ట్ అయినా.. మీరు మాట్లాడే విధానం బాగుండాలి. ఇదే మీపై ఇతరులకు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకుంటే మీరు చెప్పేది అవతలి వారికి అర్థం కాదు.. సరిగ్గా మ్యాటర్ కన్వే అవ్వదు.. కాబట్టి అవతలివారు మీరు చెప్పేవాటిని వినేందుకు సిద్ధంగా ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టాలి. ఎవరైతే బాగా కమ్యూనికేట్ చేస్తారో.. వారు ఎప్పటికీ ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటారు.
మీరు కమ్యూనికేషన్ చేయడంలో వీక్‌గా ఉండి.. మీ స్కిల్స్‌ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంటే ఈ ఐదు టిప్స్ ఫాలో అయిపోండి. వీటిని మీరు రోజువారీ జీవితంలో ట్రై చేస్తే కొన్ని రోజుల్లో మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోగలుగుతారు.
3-సెకండ్ రూల్
మీరు మంచిగా కమ్యూనికేట్ చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ ఆత్రంలో అవతలివారు తమ మాటను ముగించకముందే అత్యుత్సాహంతో మధ్యలో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మీరు ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు.. ఓ మూడు సెకన్లు ఆగి.. అప్పుడు దానిని ప్రారంభించండి. మీ రియాక్షన్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఇలా ఆగడం వల్ల మీ ఆలోచనలు ప్రాసెస్ అయి.. సరైన పదాలు కూడా వస్తాయి. దీనివల్ల మీరు మరింత మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారు.
రికార్డ్ చేసుకోండి..
మిమ్మల్ని కమ్యూనికేషన్‌లో స్ట్రాంగ్ చేసుకోవడానికిి ఉత్తమమైన మార్గాలలో రికార్డ్ చేసుకోవడం ఒకటి. మీకు నచ్చిన ఏదైనా అంశాన్ని ఎంచుకొని.. దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసుకోండి. దానిని చూస్తూ మీ స్వరం, భంగిమ, చేతి సంజ్ఞలు ఎలా ఉన్నాయో.. మీ పాయింట్లు ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నారో చెక్ చేసుకోండి. మొదట్లో ఇలా చేయడం ఇబ్బందిగా ఉన్నా.. చాలా ప్రభావవంతంగా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా దీనిని చేయడం వల్ల స్టేజ్ భయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు వినడానికి, చూడటానికి అలవాటు పడతారు. ఈ టెక్నిక్ మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
మైక్రో స్టోరీ టెల్లింగ్
వాస్తవాలు ముఖ్యమైనవి అయినప్పటికీ.. గుర్తుండిపోయేవి మాత్రం కథలే. మీ టార్గెట్‌ను చెప్పడానికి బదులుగా.. మీరు దానిని ఎలా ఎదుర్కొన్నారో ఒక స్టోరీ రూపంలో చెప్తే బాగుంటుంది. మరీ సాగదీస్తూ కాకుండా.. తక్కువ సమయంలో అంటే నిమిషంలోపు ముగించగలిగేలా చెప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. దీనినే మైక్రో-స్టోరీటెల్లింగ్ అంటారు. ఇలా చెప్పే విషయాలు ఎక్కువకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి. దీనిని క్రమం తప్పకుండా సాధన చేస్తే.. సాధారణ సంభాషణ కూడా సజీవంగా మారుతుంది.
వినడం నేర్చుకోవాలి..
కమ్యూనికేషన్‌లో మాట్లాడటం ఎంత ముఖ్యమో.. వినడం కూడా అంతే ముఖ్యం. అవతలి వ్యక్తి చెప్పేది మీ పూర్తి శ్రద్ధతో వినడం మంచి పద్ధతి. అలాగే మధ్యలో వారిని ఆపకూడదు. వారు ఏమి చెబుతున్నారో విని.. దానికి స్పందిస్తే బాగుంటుంది. ఈ అలవాటు మీపై నమ్మకాన్ని పెంచుతుంది. సంభాషణలో నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒకరు మాట్లాడేప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టి.. వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడంపై దృష్టి సారిస్తే మంచిది. దీనివల్ల మీరు వినే నైపుణ్యం పెరుగుతుంది.
మిర్రర్ ప్రాక్టీస్
మీ నోరు మాట్లాడటానికి ముందే మీ శరీరం మాట్లాడుతుంది. కాబట్టి మీ చేతి భంగిమ, కదలిక, కళ్లు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాయో తెలుసుకోండి. దీని కోసం మిర్రర్ టెక్నిక్ బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి, మీ భంగిమను సర్దుబాటు చేస్తూ నెమ్మదిగా మాట్లాడటం సాధన చేయండి. భుజాలు తెరిచి.. చిన్న చిరునవ్వు ముకంపై ఉండేలా చూసుకోండి. కంటి ఫోకస్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఇది శరీరానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
కమ్యూనికేషన్ అనేది మీరు నిర్మించగల ఒక నైపుణ్యం. ఈ ఐదు టెక్నిక్స్ మీకు దానిని బిల్డ్ చేసుకోవడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు వీటిని రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే.. ఎలాంటి ఇబ్బంది కమ్యూనికేట్ చేయగలుగుతారు.






















