అన్వేషించండి

World Vegan Day: ఆరోగ్యం కోసం వీగన్లుగా మారాలనుకుంటున్నారా? అయితే మీరు తినాల్సినవి ఇవే

World Vegan Day: వీగన్లగా మారుతున్న వారి సంఖ్య కొంచెం కొంచెంగా పెరుగుతోంది.

World Vegan Day: మొన్నటి వరకు శాకాహారం, మాంసాహారం... అనే రెండు వర్గాలే ఉండేవి. ఇప్పుడు మధ్యలో వీగనిజం కూడా వచ్చింది. సంపూర్ణ ఆరోగ్యం వీగన్లుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వీగనిజం పాటించడం అంత సులువు కాదు. కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. వీగనిజం పుట్టుక ఇప్పటిది కాదు, కానీ ఈ మధ్యనే ఎక్కువ మంది పాటించడం ప్రారంభించడం వల్ల ఎక్కువగా ఈ పేరు వినిపిస్తోంది. 

వీగనిజం ఎప్పుడ మొదలైంది?
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది డోనాల్డ్ వాట్సన్. ఆయన 1944లో వీగన్ సొసైటీని స్థాపించాడు. మాంసం తినడం నివారించాలన్న కారణంగా దీన్ని మొదలుపెట్టాడు. కానీ మొదట్లో దీన్ని చాలా తక్కువ మందే అనుసరించడం మొదలుపెట్టారు. 2010 నుంచి మాత్రం ఎక్కువమంది వీగన్లుగా మారసాగారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు వీగన్లుగా మారేందుకు ఇష్టం చూపించడంతో దీనికి మంచి పేరు వచ్చింది. వీగన్ అనే పదాన్ని తొలిసారిగా వాడింది కూడా డోనాల్డ్ వాట్సనే. నిజానికి 1806లోనే డాక్టర్ విలియం లాండే అనే వ్యక్తి కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్నే తీసుకోవడం ప్రారంభించాడు. కానీ మిగతా వారికి ఆయన ప్రచారం చేయలేదు. వీగనిజం అనే పదం కూడా పుట్టలేదు.  

ఎంత మంది?
ప్రపంచంలో గణాంకాల ప్రకారం వీగన్లుగా మారిన వారి సంఖ్య ఏడో కోట్ల నుంచి ఎనిమిది కోట్ల మంది దాకా ఉన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న జనాభాలో ఒక శాతం మంది కన్నా తక్కువన్నమాట. కానీ వీరి సంఖ్య కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తోంది. ఈ డైట్ పాటించాలంటే పాలు, పెరుగు కూడా తినకూడదు. అందుకే వీగన్లను తక్కువ మంది పాటిస్తున్నారు. జంతువుల నుంచి వచ్చే ఈ ఆహారాన్ని కూడా వీరు తినరు, తాగరు. 

ఏం తినాలి?
మొక్కలు, చెట్ల నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, బఠానీలు, బీన్స్, కాయ ధాన్యాలు, పప్పులు, గింజలు, బియ్యం వంటివి తినాలి. కూరగాయల నుంచి తీసిన నూనెలనే వాడాలి. ఇక ఆవు, గేదె పాలు తాగకూడదు కాబట్టి సోయా, కొబ్బరిపాలు, బాదం పాలపై ఆధారపడాలి. చివరికి తేనె కూడా తినకూడదు. ఎందుకంటే తేనెను తయారుచేసేవి కూడా జీవులే కదా అందుకు. 

లోపాలు...
వీగన్ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు కొన్నిరకాల ఆహార లోపాలను చెబుతున్నారు వైద్యులు. శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయో లేదో సందేహమేనని అంటున్నారు. ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, బీ కాంప్లెక్స్‌లు, ఖనిజాలు వంటివి పుష్కలంగా ఉన్న ఆహారాలను కచ్చితంగా తినాలి. లేకపోతే శరీరంలోని చాలా వ్యవస్థలపై ప్రభావం కనిపిస్తుంది. వీగనిజం పాటించే వారిలో సరైన పోషకాలు అందకపోతే మెదడు, థైరాయిడ్ సమస్యలు రావచ్చని చెబుతున్నారు. కాల్షియం లోపం, అయోడిన్ లోపం వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. 

Also read: ప్రపంచంలో భయపెట్టే బొమ్మ ఇదే - దీని గురించి తెలిస్తే బొమ్మలు కొనడానికే భయపడతారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget