By: ABP Desam | Updated at : 07 Feb 2022 07:41 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: Pixabay
కోవిడ్-19 కేసులు క్రమేనా తగ్గుతున్నాయి. అయితే, మలేరియా, డెంగ్యూ సీజన్ త్వరలోనే రానుంది. కాబట్టి.. మీరు దోమలకు అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. ఇందుకు మీరు దోమలను తరిమే మందులు, దోమ తెరలతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమ కాటు నుంచి బయటపడటం చాలా కష్టం. ఏదో ఒక మూల నుంచి వచ్చి అవి మనపై దాడి చేస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని రంగుల దుస్తులను ధరిస్తే దోమలు దరిచేరవట. అవేంటో చూసేయండి మరి.
దోమలు కొందరిని మాత్రమే కుడతాయని, వారి రక్తం తియ్యటి వాసన, రుచిని కలిగి ఉండటమే ఇందుకు కారణమని అంటుంటారు. కానీ, ఇందులో ఎలాంటి నిజం లేదు. వాస్తవం ఏమిటంటే.. దోమలు నాలుగు రకాల ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. అవి తెలియకుండానే కొందరికి ఆకర్షితులవుతాయట. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని కొత్త పరిశోధన ప్రకారం.. దోమలు ముందుగా మన శ్వాసను గుర్తిస్తాయట. ఆ తర్వాత ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ వంటి నిర్దిష్ట రంగుల వైపుకు ఎగురుతాయి. కాబట్టి దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయా రంగుల దుస్తులను ధరించకపోవడమే ఉత్తమం. ముఖ్యం ఎర్ర రంగు దుస్తులు అస్సలు వద్దు.
దోమలు ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు వంటి రంగులను విస్మరిస్తాయని పరిశోధనలో పేర్కొన్నారు. మీ చర్మం రంగు లేదా స్కిన్ టోన్‌కు దోమలు ఆకర్షితులవుతున్నాయా లేదా అనే దానితో దీనికి సంబంధం ఉండదు. ఆయా రంగులకు ఆకర్షితమై రక్తాన్ని పీల్చేందుకు వస్తాయి. అలాగే, మన శ్వాస కూడా దోమలను ఆకర్షిస్తాయి. జీవశాస్త్రం ప్రొఫెసర్ జెఫ్రీ రిఫెల్ తెలిపిన వివరాల ప్రకారం.. మన శ్వాస నుంచి CO2 వంటి నిర్దిష్ట సమ్మేళనాలను అవి ముందుగా పసిగడతాయి. ఆ తర్వాత వాసన, నిర్దిష్ట రంగులను దోమల కళ్లు స్కాన్ చేస్తాయి. అప్పుడు వాటికి నచ్చిన రంగు కనబడితే.. అటుగా ప్రయాణిస్తాయి.
‘నేచర్ కమ్యూనికేషన్స్’లో ఫిబ్రవరి 4న ప్రచురించిన సమాచారంలో దోమలు వాసన, దృశ్య సూచనలకు ఎలా స్పందిస్తాయనేది వివరించారు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన బయాలజీ ప్రొఫెసర్ జెఫ్రీ రిఫెల్ మాట్లాడుతూ.. మూడు రకాల సంకేతాలు దోమలను ఆకర్షిస్తాయని తెలిపారు. వ్యక్తి శ్వాస, చెమట, శరీర ఉష్ణోగ్రతలకు దోమలు ఆకర్షితమవుతాయన్నారు. అయితే, తాజా స్టడీలో నాలుగో సంకేతాన్ని కూడా చేర్చారు. ఎర్ర రంగుకు దోమలు అట్రాక్ట్ అవుతాయని వెల్లడించారు. ఇందుకు ఆయా వ్యక్తి స్కిన్ టోన్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. నలుపు, తెలుపు, గోదుమ.. ఇలా ఏ రంగులో ఉన్న వ్యక్తులనైనా సరే దోమలు కాటేస్తాయని తెలిపారు. కాబట్టి.. వీలైనంత వరకు రెడ్ కలర్ దుస్తులను ధరించకపోవడమే ఉత్తమం.
Also Read: రోజూ స్నానం చేయడం లేదా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్: స్టడీ
ఈ పరిశోధన కోసం యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందం ఆడ ఎల్లో ఫీవర్ దోమల ప్రవర్తనపై నిగా పెట్టారు. ఈ సందర్భంగా పరిశోధకులు కొన్ని గదుల్లో (చాంబర్స్‌లో) కొన్ని రకాల వాసనలు, CO2(కార్బన్ డై ఆక్సైడ్) స్ప్రే చేశారు. వాటికి సమీపంలో వివిధ రంగుల చుక్కలను పెట్టారు. మరోవైపు మనిషి చేతి బొమ్మలను కూడా పెట్టారు. అనంతరం వాటిలోకి దోమలను వదిలారు. అవి వాసన గ్రహించి ఆయా చాంబర్లలోకి ప్రవేశించాయి. దోమలు ఆకుపచ్చ, నీలం లేదా ఊదా రంగులో ఉంటే చుక్కను విస్మరించాయి. కానీ ఎరుపు, నారింజ, నలుపు, నీలం రంగు చుక్కల వైపుకు ఎక్కువగా కదిలాయి.
Also Read: సైలెంట్‌గా ఉండేవారు అంత డేంజరా? ఈ కారణాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు!
Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు
Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ
Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి
Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్