అన్వేషించండి

Valentine Day: పెళ్లయిన తర్వాత మాజీ లవర్ పలకరిస్తే... అది స్నేహమా? ప్రమాదమా?

Valentine Day: రాహుల్‌కు మాజీ లవర్ ఫోన్ చేసింది. అంతే అతని జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేని స్థితి ఏర్పడింది. కానీ...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సోషల్ మీడియా వల్ల పాత పరిచయాలు, ప్రేమలు మళ్ళీ మొదలవుతున్నాయి.
  • శారీరక సంబంధం లేకపోయినా, భావోద్వేగాలను పంచుకోవడం ఎమోషనల్ అఫైర్.
  • మెదడులోని డొపమైన్ విడుదలై, పాత జ్ఞాపకాలు వ్యసనంలా మారతాయి.
  • నిజమైన ప్రేమ కాదు, ఇది రసాయనిక ప్రతిచర్య, జ్ఞాపకాల మిశ్రమం.

Valentine Day: డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ ఎక్కడ ఉన్నా ఇట్టే దగ్గరయిపోతున్నారు. ఎప్పుడో  ఏళ్ల క్రితం వదిలేసిన పరిచయాలు ఒక్క హాయ్‌తో మళ్లీ మొదలవుతున్నాయి. అయితే ఇలా మొదలైన మాటలు కేవలం పలకరింపులతోనే ఆగిపోవడం లేదు. ముఖ్యంగా పెళ్లయిన వారి జీవితాల్లో పాత ప్రేమికులు,లేదా క్రష్‌లు తిరిగి వచ్చినప్పుడు అది కొత్త రకమైన మానసిక సంఘర్షణకు దారి తీస్తోంది. దీనినే సైకాలజిస్ట్‌లు ఎమోషన్‌ అఫైర్ లేదా నోస్టాల్జిక్ బాండింగ్ అంటున్నారు. 

రాహుల్ అనుభవం మీకు గుణపాఠం కావచ్చు 

రాహుల్ ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లైంది. పిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతుంది. కాలేజీ రోజుల్లో అతనికి ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. అది ఇద్దరికీ తెలిసినా, ఎప్పుడూ మాటల్లో బయటపడలేదు. ఎటువంటి ప్రపోజల్స్ లేవు. తిరస్కారాలు లేవు. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు. 

కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుంచి ఫోన్ వచ్చింది. మొదట కుశల ప్రశ్నలతో మొదలై వీరి పరిచయం మెల్లగా రోజూ మాట్లాడుకునే స్థాయికి చేరాయి. ఇద్దరూ వారి వారి జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. రాహుల్ మాట్లాడకపోతే ఆమెకు ఏదో వెలితిగా అనిపించేది. రాహుల్ పరిస్థితి కూడా అంతే. ఒక రోజు మాట్లాడుకోకపోతే మనసులో ఏదో తెలియని అశాంతి. ఇక్కడ శారీరక సంబంధం లేదు, కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి. మరి దీనిని ఏమనాలి?

ఎమోషనల్ అఫేర్ అంటే ఏంటీ?

చాలా మంది తమ భాగస్వామిని మోసం చేయడం అంటే కేవలం శారీరకంగా మరొకరితో దగ్గరవ్వడమే అనుకుంటారు. కానీ ఎమోషనల్ అఫేర్ అంతకంటే ప్రమాదకరమైంది. శారీరక సంబంధం లేకపోయినా, మనసులో ఒక వ్యక్తిపై విపరీతమైన అభిమానం పెంచుకోవడం, తన భాగస్వామితో పంచుకోవాల్సిన రహస్యాలు, భావోద్వేగాలు మరొకరితో పంచుకోవడాన్ని ఎమోషనల్ అఫేర్ అంటారు. 

ఎక్కువగా నోస్టాల్జిక్ బాండింగ్‌లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న వ్యక్తితో కంటే, గతంలో మనకు దక్కని ఆ అవకాశం మీద ప్రేమను పెంచుకోవడం అన్నమాట. రాహుల్ కేసులో కూడా అదే జరిగింది. వారు నిజానికి ప్రస్తుత వ్యక్తుల్ని ప్రేమించడం లేదు. తమ యవ్వనాన్ని, ఆనాటి కలలను చెప్పని మాటలను ప్రేమిస్తున్నారు. 

ఇది ఎందుకు జరుగుతుంది? సైకాలజీ ఏం చెబుతుంది?

మనుషుల మెదడు చాలా వింతగా పని చేస్తుంది. మనసులో ఏదైనా పని పూర్తి కాకపోతే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఆనాడు ప్రపోజ్ చేయకపోవడం వల్లనో, లేదా క్లియర్‌గా ఎండ్  కాకపోవడం వల్లనో మెదడు ఆ కథను ఇంకా ఒక అవకాశం ఉందని అనే ఫోల్డర్‌లో భద్రపరుస్తుంది. కొత్తగా ఎవరితోనైనా రహస్యంగా మాట్లాడటం వల్ల మెదడులో డొపమిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది ఒక రకమైన కిక్కును , ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఆ వ్యక్తితో మాట్లాడటం ఒక వ్యసనంలా మారుతుంది. ఇంటికి వెళ్తే భార్య లేదా భర్తతో పిల్లల స్కూల్‌ ఫీజులు, పవర్ బిల్లులు, ఇంటి పనులు వంటి రియాల్టీ కనిపిస్తుంది. కానీ పాత ప్రేమతో మాట్లాడితే కేవలం నవ్వులు, జ్ఞాపకాలు, కాలేజీ ముచ్చట్లు మాత్రమే ఉంటాయి. ఈ ఫాంటసీ ప్రపంచం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. 

మేం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అనేది భ్రమ

ఇలాంటి బంధాల్లో ఉన్న వారు తరచుగా చెప్పుకునే మాట మేం కేవలం స్నేహితులం మాత్రమే, మా మధ్య ఎలాంటి సంబంధం లేదు' అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు సదరు వ్యక్తితో చేసే చాటింగ్ లేదా కాల్స్ గురించి మీ భాగస్వామికి తెలుసా? ఆ ఫోన్ కాల్‌ను స్పీకర్‌లో పెట్టి మీ భార్య లేదా భర్త ముందు మాట్లాడగలరా? అలా చేయలేకపోతున్నారంటే అక్కడ ఎమోషనల్ అఫేర్ మొదలైనట్టే లెక్క.

దీని వల్ల కలిగే నష్టాలేంటీ?

ఇది కేవలం ఒక స్నేహంగా తీసిపారేయలేం. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనసు ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్న భాగస్వామితో గడిపే సమయం తగ్గిపోతుంది. భావోద్వేగాలు సరిగా ఉండవు. ఇది మీ భార్యాభర్తల మధ్య గ్యాప్ పెంచుతుంది. నేను తప్పు చేస్తున్నానా అనే అనుమానం మొదలవుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ రోజైనా చాట్స్, లేదా కాల్‌ లాగ్స్ బయటపడితే , ఒక్కసారిగా నమ్మకం విచ్చిన్నమవుతుంది. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య వచ్చే మార్పులను పిల్లలు త్వరగా గమనిస్తారు. ఇది వారిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. 

లిమరెన్స్ అనేది ప్రేమ కాదు

సైకాలజీ ప్రకారం ఈ స్థితిని లిమరెన్స్ అంటారు. ఆ వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం రిప్లై ఇవ్వకపోతే విలవిలలాడిపోవడం, ఒక రోజు మాట్లాడకపోతే జీవితం శూన్యం అనిపించడం దీని లక్షణాలు. ఇది నిజమైన ప్రేమ కాదు. కేవలం రసాయనిక రియాక్షన్, పాత జ్ఞాపకాల మిశ్రమం మాత్రమే. 

పరిష్కారం ఏంటీ ?

జీవితంలో పాత జ్ఞాపకాలు పలకరించడం సహజం. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తామన్నదే ముఖ్యం. మీరు ఎందుకు ఆ వ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో మీ ప్రస్తుత బంధంలో ఏదైనా లోపించిందా అని మీకు మీరు చెక్ చేసుకోవాలి. అవసరమైన వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు. రోజూ మాట్లాడటం మానేయాలి. ఏ విషయాన్ని భాగస్వామికి తెలియకుండా దాచకూడదు. మీ పార్టనర్‌తో గడపడానికి సమయం కేటాయించాలి. మీ జీవితంలో ఏదైనా వెలితి ఉంటే వారితో చర్చించాలి. పాత ప్రేమతో ఇలాంటివి చర్చించకపోవడమే మంచిది. సమస్య చేయిదాటిపోతుందంటే మ్యారేజీ కౌన్సిలర్‌ను కలవడం మంచిది. 

రాహుల్ కథలో ఇంకా పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ రిస్క్ మొదలైంది. కొన్ని ప్రేమ కథలు జ్ఞాపకాలుగా ఉంటేనే అందం. మీ మాజీ లవర్‌ కాల్ చేసినప్పుడు ఎత్తే ముందు ఒకసారి ఆలోచించాలి.

Frequently Asked Questions

ఎమోషనల్ అఫేర్ అంటే ఏమిటి?

శారీరక సంబంధం లేకుండా, మనసులో ఒకరిపై విపరీతమైన అభిమానం పెంచుకోవడం, భాగస్వామితో పంచుకోవాల్సిన భావోద్వేగాలను మరొకరితో పంచుకోవడాన్ని ఎమోషనల్ అఫేర్ అంటారు.

ఎమోషనల్ అఫేర్ ఎందుకు జరుగుతుంది?

మెదడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పాత జ్ఞాపకాలు, కొత్త పరిచయాల వల్ల విడుదలయ్యే డొపమిన్ వంటి రసాయనాలు దీనికి కారణం.

మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పడం సరైనదేనా?

మీరు చేసే సంభాషణల గురించి మీ భాగస్వామికి తెలియకపోయినా, వారితో కలిసి మాట్లాడలేకపోయినా అది ఎమోషనల్ అఫేర్ అయ్యే అవకాశం ఉంది.

ఎమోషనల్ అఫేర్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

ఇది భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచుతుంది, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది మరియు నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది.

ఎమోషనల్ అఫేర్ ను ఎలా అధిగమించాలి?

మీ ప్రస్తుత బంధంలో లోపాలను గుర్తించి, భాగస్వామితో చర్చించాలి, వ్యక్తిగత విషయాలను దాచకుండా ఉండాలి మరియు అవసరమైతే కౌన్సెలర్ సహాయం తీసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget