By: ABP Desam | Updated at : 07 Dec 2022 12:11 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
రకరకాల రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి అనేక రోగాలని నయం చేస్తాయి. చాలామంది ఆకుపచ్చ కూరగాయలు మాత్రమే పోషకాలు అందిస్తాయని అనుకుంటారు. కానీ ఇతర రంగుల్లోని కూరగాయలు తినడం కూడా అలవాటు చేసుకోవాలి. సాధారణ కూరగాయాలతో పాటు వివిధ రంగుల్లో లభించేవి కూడా వాటితో సమానంగా పోషకాలు అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్రకోలి అంటే ఆకుపచ్చ రంగులోని ఉంటుందని అనుకుంటారు. కానీ పర్పుల్ కలర్ లో కూడా లభిస్తుంది. ఇదే కాదు పర్పుల్ కలర్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్.. ఇలా రకరకాల కూరగాయలు ఉన్నాయి. నీలం, ఊదారంగు ఆహారాల్లో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. పర్పుల్ కలర్ కూరగాయల వచ్చే లాభాలు అనేకం.
పర్పుల్ బ్రకోలి: బ్రకోలి అత్యంత పోషకాలు నిండిన పదార్థం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇది క్యాన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ఇది తీసుకోవడం వల్ల పిండం పెరుగుదలకి సహాయపడుతుంది. అలాగే కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటాయి. ఎముకలు ధృడంగా ఉండేందుకు సహాయపడుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
పర్పుల్ బంగాళాదుంప: స్వీట్ పొటాటో పర్పుల్ తో పాటు మట్టి రంగులో కూడా కనిపిస్తుంది. ఈ కూరగాయలో అధిక మొత్తంలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ లభిస్తుంది. హానికరమైన వ్యాధికారక క్రిములకి వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియని సులభతరం చేస్తుంది.
పర్పుల్ క్యాలీఫ్లవర్: మనకి ఎక్కువగా తెల్లని క్యాలీఫ్లవర్ కనిపిస్తుంది. కానీ పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శక్తివంతమైన ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి. కేలరీలని బర్న్ చేసి బరువుని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఆంథోసైనిన్ వల్ల వాటికి ఊదా రంవగు వస్తుంది.
పర్పుల్ క్యారెట్: క్యారెట్ తీపి రుచి కలిగి ఉండి అందరికీ ఎంతో ఇష్టమైన కూరగాయగా మారింది. ఇందులోని బీటా కెరోటిన్ జీవక్రియ మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. మనకి సాధారణంగా కనిపించే క్యారెట్ తో సమానంగా పర్పుల్ కలర్ క్యారెట్ లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కళ్ళు, చర్మానికి మేలు చేస్తాయి.
బెర్రీలు : వివిధ రంగుల్లో లభించే బెర్రీల్లో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్ ఎ, ఇ, బీటా కెరోటిన్ మెండుగా ఉన్నాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి క్యాన్సర్ రోగులకి టాక్సిన్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే మినరల్స్ మెదడు ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు పిల్లలకి వీటిని తినిపించొచ్చు.
రేగు పండ్లు: రుచికరమైన రేగు పండ్లు కూడా ఆకర్షణీయమైన పర్పుల్ కలర్ లో లభిస్తాయి. మధుమేహ బాధితులకి ఇవి చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి. ఊబకాయం ఉన్న వాళ్ళు తినొచ్చు. కేలరీలు తగ్గించేందుకు సహకరిస్తుంది. ఇందులోని అధిక డైటరీ ఫైబర్ గుణం జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్స్ లేదా గుండె పోటు రాకుండా అడ్డుకుంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: థైరాయిడ్ వల్ల బరువు పెరిగిపోయారా? ఈ ఆహారంతో సమస్యలన్నీ పరార్!
Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్