News
News
X

No Electricity House: ఈ ఇంటికి కనీసం కరెంటే లేదు.. అయినా ఇన్ని కోట్ల ధర ఏంటి బాబోయ్

కొత్తగా ఇళ్లు కొనాలి అనుకునేవారు. ఇంటికి కరెంట్ ఉందా? నీటి సదుపాయం ఉందా అని చూసుకుంటారు. కానీ ఓ ఇంటికి మాత్రం కరెంట్ లేదు.. ఏం లేదు.. అయినా ధర కోట్లలో చెబుతున్నాడు ఓనర్. ఎందుకంత స్పెషల్.

FOLLOW US: 

ఆ ఇంటికి ఇంటర్నెట్.. లేదు.. స్విచ్ ఆన్ చేద్దామనుకున్నా.. కరెంట్ లేదు. అయినా ధర మాత్రం కోట్లలో. ఎందుకు అలా తెలుసా. ఆ ఇల్లు ఉండే ప్రదేశం అలాంటిదన్నమాట. అసలు అక్కడ ఉంటే.. అంతకుమించిన రిలాక్సేషన్ ఇంకోటి ఉండదు అన్నట్టు ఉంటుంది. అలాంటి సుందరమైన ప్రదేశం అది. ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఎంతో ప్రశాంతంగా జీవించొచ్చు. 

హే.. అలాంటి హోమ్.. ఈ కాలంలో ఎక్కడిది అనుకుంటున్నారా? ఉందండి. ఎక్కడో తెలుసా.. యునైటెడ్ కింగ్ డమ్ లో. కొంతమంది ఈ ఇంటిని ఆఫ్ గ్రిడ్ హౌస్ అని పిలుస్తారు... మరికొంతమందేమో.. డెవాన్ సుముద్రపు కాటేజ్ అంటారు. ఈ కాటేజ్‌కు విద్యుత్‌ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్‌ దరిదాపుల్లో లేదు. అయినా.. దాదాపు రూ.5.56 కోట్లకు అమ్మకానికి పెట్టాడు దాని ఓనర్.

బ్లూ సీ కి సమీపంలోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉండటమే దీని స్పెషాలిటీ. ఈ కాటేజ్‌ నేషనల్‌ ట్రస్ట్‌ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్‌పైన ఉన్న రిమోట్‌ గేట్‌అవేలో ఉన్నది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని ఆస్వాదించుకోవాలనుకునే వారికి ఈ కాటేజ్‌ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారంట. అక్కడికి వెళ్లాలంటే కారు ఉండాల్సిందే.  

ఈ కాటేజ్‌లో రెండు పెద్ద బెడ్‌ రూంలు ఉన్నాయి. పైన ఒక గడ్డితో చేసిన గది ఉన్నది. ఇందులో లాంజ్‌, డైనింగ్‌ రూం, ఫ్రంట్‌ అండ్ బ్యాక్‌ వరండా, రెండు గెస్ట్‌ బెడ్‌రూంలు, పవర్‌రూం, వంట గదులు ఉన్నాయి. ఈ కాటేజ్‌ను 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
కరెంటు లేకుండా మరి ఇంట్లో చలి వాతావరణం నుంచి వేడి కావాలంటే... 2 మల్టీ ఫ్యూయల్ బర్నర్లు ఉన్నాయి.

కిచెన్‌లో గ్యాస్ కుక్కర్, ల్యాంప్స్ ఉన్నాయి. ఎల్ పీజీ గ్యాస్ సప్లై ఉంది. ఇంటి పైన వర్షపు నీటిని మంచి నీరుగా మార్చే వ్యవస్థ ఉంది.  దాని ద్వారా నీరు సంపాదించుకోవచ్చు. సముద్రం దగ్గరకు కారులో వెళ్లొచ్చని ఇంటి ఓనర్ మిషెల్లే స్టీవెన్స్ తెలిపారు. అయితే కార్ పార్కింగ్ ప్లేస్ ఇంటికి దూరంగా ఉంది. అక్కడ పార్క్ చేసి ఇంటికి నడుస్తూ వెళ్లడానికి పావుగంట పడుతుందట. అయితే కొనడానికి ముందుకొచ్చిన వారు.. ఈ విషయాలు చూసి ఆలోచిస్తున్నారని పేర్కొన్నాడు.

Also Read: Old Coins: రండి బాబు రండి.. ఈ 5, 10 రూపాయల కాయిన్స్ ఉంటే రూ.10 లక్షలు మీవే

Published at : 06 Sep 2021 01:41 PM (IST) Tags: Uk houses UK expensive house on sale house with no electricity house with no internet house with no frestwater Viral house house in UK

సంబంధిత కథనాలు

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

టాప్ స్టోరీస్

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీపీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీపీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !