(Source: ECI/ABP News/ABP Majha)
Old Coins: రండి బాబు రండి.. ఈ 5, 10 రూపాయల కాయిన్స్ ఉంటే రూ.10 లక్షలు మీవే
పాత నోట్లు, కాయిన్లకు కాలం గడిచే కొద్ది డిమాండ్ పెరుగుతుంది. వాటిని యాంటిక్ పీస్ అంటారు. అయితే ఇప్పుడు మీ దగ్గర 5, 10 రూపాయల కాయిన్స్ ఉంటే 10 లక్షలు మీ జేబులో వేసుకోవచ్చు.
ఇంటి దగ్గరే డబ్బు సంపాదించడానికి.. కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఎవరిదగ్గరైనా పాత రూ.5, 10 కాయిన్స్ ఉంటే మీరు ఎంచక్కా 10 లక్షల రూపాయలు సంపాదించొచ్చు. అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా?
పాత కరెన్సీ నోటుతో వేల రూపాయలు సంపాదించే అవకాశం వస్తే అదో అదృష్టమే. ఇలాంటి వాటిని యాంటిక్ పీస్ అంటారు. ఇవి ఎంత పాతవైతే... అంతగా వాటి విలువ పెరుగుతుంది. కొంత మంది పాత వస్తువులు, కరెన్సీలను కలెక్ట్ చేస్తుంటారు. అలాంటి వారు వీటికి ఎక్కువ డబ్బు చెల్లించి కొంటారు.
మీరు పాత నాణేలు.. నోట్లు సేకరిస్తారా
మీకు పాత నాణేలు, నోట్లను సేకరించే అలవాటు ఉందా? అయితే, పాత నాణేలకు భారీ డిమాండ్ ఉంది. ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ లో పాత కాయిన్స్ ని వేలం వేస్తారు. అయితే మీ దగ్గర ఉన్న కాయిన్ తో మీరు లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంది.
పాత రూ .1, 2 కాయిన్స్, పాత రూ.1, 2, 5 పాత నోట్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ అరుదైన పాత నాణేలు, నోట్లను విక్రయించడం ద్వారా మీరు రూ. 10 లక్షల వరకు ఆన్ లైన్ లో సంపాదించవచ్చు.
మాతా వైష్ణో దేవి ఫోటో ఉన్న పాత రూ.5, రూ .10 కాయిన్స్ ఉంటే మీరు పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. ఈ ప్రత్యేక నాణేలు 2002లో జారీ చేశారు. ఈ ఫొటో ఒక పవిత్రమైన, అదృష్టవంతమైనదిగా చూస్తారు. ఈ కాయిన్స్ ని కొనేందుకు ఆన్ లైన్ లో రూ. 10 లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అంతేగాకుండా.. ఇలా కూడా సంపాదించొచ్చు
హెచ్ఎం పటేల్ సంతకంతో ఉన్న పాత రూ.1 నోటుతో కూడా మీరు డబ్బు సంపాదించొచ్చు. అయితే దీనికి సీరియల్ నంబర్ 123456 ఉండాలి.
మాజీ ఆర్‌బిఐ గవర్నర్ డి.సుబ్బారావు సంతకం ఉన్న రూ.100 నోట్లకి కూడా డిమాండ్ ఎక్కువే. అయితే 000 786 సీరియల్ నంబర్ ఉంటేనే డబ్బులు గెలుచుకోవచ్చు.
పాత వస్తువులను కొనుగోలు చేసే.. విక్రయించే వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. అరుదైన, పాత నాణేలను కొనుగోలు చేయవచ్చు.. అమ్మవచ్చు. అయితే మీరు చేయాల్సిందల్లా ఆ వెబ్ సైట్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. Quickr, Coinbazzar.com లాంటి వెబ్ సైట్లలో రిజిస్ట్రార్ కావాలి. అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి.
Also Read: Banned RS 500 Note: మీ దగ్గర పాత 500 రూపాయల నోటు ఉందా.. అయితే రూ.10 వేలు మీ సొంతం..!