అన్వేషించండి

Type 2 Diabetes: మధుమేహం రోగులకు కొత్త ముప్పు - 3 రకాల క్యాన్సర్లతో ప్రమాదం తప్పదట, బ్రిటన్ పరిశోధకులు వెల్లడి

టైప్2 డయాబెటిస్ పేషెంట్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. చెక్కెర వ్యాధిగ్రస్తుల్లో రొమ్ము, పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది.

Type 2 Diabetes: డయాబెటిస్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజాగా బ్రిటన్ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. టైప్‌-2 డయాబెటిస్‌ తో బాధపడుతున్న వారిలో క్యాన్సర్‌ ముప్పు అధికంగా పొంచి ఉన్నదని తేలింది. అంతేకాదు, అడ్వాన్స్‌డ్‌ దశలో ఉన్న వారిలోనే ఈ క్యాన్సర్‌ నిర్ధారణ అవుతున్నదని యూకే పరిశోధకులు తెలిపారు. వీరిలో ఎక్కువగా రొమ్ము, పేగు, ప్యాంక్రియాటిక్ లాంటి క్యాన్సర్లు సోకుతున్నాయని గుర్తించారు. టైప్‌-2 డయాబెటిస్‌ రోగుల్లో ఈ క్యాన్సర్లు అసలు కణితి నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం ప్రారంభమైన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతున్నదని తెలిపారు. 

డయాబెటిక్ పేషెంట్లలో క్యాన్సర్ కు కారణాలు ఏంటి?

జెనెటిక్ వేరియంట్లు, జెనెటిక్ సీక్వెన్స్ లలో తేడాలు, డయాబెటిస్ కలిసి క్యాన్సర్ కు కారణం అవుతున్నాయని యుకెకు చెందిన డాక్టర్ ఎలిజబెత్ రాబర్ట్‌సన్ వెల్లడించారు. వ్యక్తి ఆరోగ్యం మీద ఈ మూడు అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని తెలిపారు. "టైప్ 2 డయాబెటిస్ కారణంగా వ్యక్తులలో మూడు రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా రొమ్ము, కొలొరెక్టల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ సోకుతున్నట్లు గుర్తించాం. డయాబెటిస్ తో పాటు జన్యు పరమైన లోపాల కారణంగా క్యాన్సర్లు వ్యాప్తి చెందుతున్నాయి” అని వెల్లడించారు.

క్యాన్సర్ కారక జన్యువుల కోసం కొనసాగుతున్న పరిశోధన

యుకెలో ఐదు మిలియన్ల కంటే ఎక్కువ మంది డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గత 15 ఏళ్లలో డయాబెటిస్ కేసులు రెట్టింపు అవుతున్నట్లు తెలిపారు. వీరిలో 90 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించాయి. ఒబేసిటీ ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. బరువు తగ్గించుకునేందుకు తగినంత వ్యాయామం చేయకపోవడంతో పాటు జన్యు సమస్యల కారణంగా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నట్లు తెలిపారు.

అయితే, టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ ప్రమాదం మధ్య సంబంధానికి దోహదపడే జన్యుపరమైన కారకాలు ఇప్పటీ సరిగా గుర్తించలేదని తెలిపారు లండన్‌లోని డయాబెటిస్ UK ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్‌ లో ప్రొడ్యూస్ చేసిన తాజా అధ్యయనం, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కొంతమందికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో గుర్తించేందుకు జన్యువులపై పరిశోధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇందుకు టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులతో సహా 36 వేల మంది నుంచి DNA డేటాను సేకరించి పరిశీలించారు. ఇందులో ఒక డిఎన్ఎ వేరియంట్ రొమ్ము క్యాన్సర్, మరొక డిఎన్ఎ వేరియంట్ రొమ్ము, పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదానికి కారణం అవుతున్నట్లు గుర్తించారు. టైప్ 2 డయాబెటిస్ కారణంగానే ఈ క్యాన్సర్లు డెవలప్ అవుతున్నట్లు తెలిపారు.

త్వరలో క్యాన్సర్లకు కారణమయ్యే జన్యు కారకాల గుర్తింపు!

అయితే, త్వరలోనే డయాబెటిస్ ఉన్నవారిలో క్యాన్సర్లకు కారణమయ్యే జన్యు కారకాలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారకాలను గుర్తించే డయాబెటిక్ పేషెంట్లలో క్యాన్సర్ ముప్పును రూపుమాపే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆ దిశగా విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నట్లు తెలిపారు.  

Read Also: ఈవినింగ్ వర్కౌట్స్‌తో అకాల మరణానికి చెక్ పెట్టొచ్చా? ఆస్ట్రేలియన్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget