అన్వేషించండి

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Sleeping on the Floor : మెత్తని పరుపుపై పడుకుంటే.. ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటారు కానీ.. గట్టి నేల మీద పడుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా?

Health Benefits of Sleeping on a Floor : మెత్తదిండు కన్నా ఉత్త చాప మేలు అని ఓ సినిమాలో వేటూరి గారు ఓ ఉద్దేశంతో రాశారో కానీ.. నేలపై చాప వేసుకుని పడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పరుపుపై పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది.. ఈ పరుపు వాడితే మీకు నడుమునొప్పి తగ్గుతుంది అనే ప్రకటనలు కూడా మీరు ఎన్నో విని పరుపులు కొనే ఉంటారు. అవి మీకు కొంతమేరకు హాయినిస్తాయి. అయితే ఈ పరుపులు కన్నా.. నేలపై పడుకుంటే ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

నేలపై పడుకోవడం కష్టంగానే ఉన్నా సరే మీ ఆరోగ్యం కోసం కింద పడుకోండి అంటున్నారు నిపుణులు. పూర్వీకులు అంతా నేలపై పడుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉండేవారని చెప్తున్నారు. పరుపులనేవి తర్వాతి కాలంలో మానవ సౌకర్యార్థం వచ్చాయి తప్పా వాటి కంటే నేలపై పడుకోవడంలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మీకు నిద్ర సమస్యలుంటే.. మీ స్లీపింగ్ స్టైల్​ని మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. 

వెన్నునొప్పికి చెక్

మీకు స్ట్రెస్ లేదా ఇతర కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుందా? అయితే ఈ సమస్యకు చెక్​ పెట్టాలనుకుంటే మీరు నేలపై పడుకోండి. నిద్ర భంగిమల్లో మార్పుల వల్ల కూడా నడుమునొప్పి వచ్చే అవకాశముంది. అయితే నేల మీద పడుకోవడం వల్ల మీ నిద్ర భంగిమ కరెక్ట్​గా ఉంటుంది. అంతేకాకుండా.. మీ హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్​కు ఉపశమనం లభించి.. మీకు నడుము నొప్పి తగ్గుతుంది. 

కరెక్ట్ పోస్టర్ 

చాలా మంది నిటారుగా కాకుండా.. వంగి కూర్చోంటారు. ఇలాంటి పోస్టర్​ మీకు నడుము నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారుతుంది. ఈ సమస్య మీలో ఉంటే నేలపై పడుకోండి. ఇది మీ మెడ, తలను సరైన అమరికలోకి తీసుకువస్తుంది. తద్వార మీ భంగిమ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మెరుగైన నిద్ర కోసం

పనిలో ఒత్తిడి.. ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిద్ర సమస్య వల్ల చేసే పనిపై శ్రద్ధ పెట్టలేము.. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అయితే మీరు నేలమీద పడుకోవడం వల్ల మీరు మెరుగైన నిద్ర పొందవచ్చు. మొదట్లో ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించినా.. తర్వాతి రోజుల్లో మీరే ఛేంజ్ చూస్తారు. 

వేడి తగ్గుతుంది..

చలికాలంలో వేడిగా ఉంటే మంచిదే కానీ.. శరీరంలో వేడి ఎక్కువైతే.. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాతవరణం వేడిగా ఉండడం వేరు.. శరీరంలో వేడి ఉండడం వేరు. ఈ సమస్యలో మీరు పరుపై పడుకుంటే.. దాని నుంచి వచ్చే వేడి కూడా మీకు ఇంకా చిరాకు, ఇబ్బందిని కలిగిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల శరీరం ఉష్ణోగ్రతలు నార్మల్ అవుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. పరుపు మీద పడుకోవడం తప్పేమి కాదు కానీ.. నేలపై పడుకోవడం వల్ల మీరు మరిన్ని లాభాలు పొందవచ్చు. 

Also Read : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget