అన్వేషించండి

DIY Masks for Lips : నల్లని పెదాలకు పింక్ గ్లోని అందించే సహజమైన DIY మాస్క్​లు ఇవే

Masks For Brightening Lips : పెదాలు టాన్​ అయిపోయాయా? అయితే మీరు ఈ DIYలను ట్రై చేయవచ్చు. ఇవి తక్షణమే పెదాలకు మంచి మెరుపును అందిస్తాయి. 

DIY Lip Masks : వివిధ కారణాలతో డార్క్​ అయిపోయిన మీ పెదాల సౌందర్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఇంట్లో కొన్ని DIY లిప్​ మాస్క్​లు తయారు చేసుకోవచ్చు. ఇవి మీకు మృదువైన, మెరిసే పెదాలను మీకు అందిస్తాయి. పైగా వీటిని సహజమైన పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. కెమికల్స్ ఉపయోగిస్తే మీ పెదాలు పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోవచ్చు. సహజమైన పదార్థాలతో ఈ సమస్య ఉండదు.

ఈ DIYలలో ఉపయోగించే సహజమైన పదార్థాలు మీ పెదాలను ఎక్స్​ఫోలియేట్ చేసి హైడ్రేట్ చేస్తాయి. అంతేకాకుండా డార్క్​నెస్​ను పోగొట్టి పెదాలకు మంచి పోషణను అందిస్తాయి. ఎండిపోయిన, పగిలిన పెదవులకు ఇవి చెక్​ పెడతాయి. అయితే ఇంట్లోనే ఉండే పదార్థాలతో లిప్​ మాస్క్​లు ఎలా తయారు చేయాలో ఏ కాంబినేషన్స్​ మీరు ట్రై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

అలోవెరాతో

మీరు మీ పెదాలకు మంచి గ్లో, పోషణ ఇవ్వాలనుకుంటే కలబంద, పంచదార లిప్​మాస్క్​ను ట్రై చేయవచ్చు. రెండు టీ స్పూన్ల అలోవెరా జెల్, ఒక టీస్పూన్ పంచదారను కలిపి పెదాలకు అప్లై చేయండి. ఈ స్ర్కబ్​తో పెదాలను బాగా మసాజ్ చేయండి. ఇది డైగా మారిన పెదాలను, టాన్​ అయిన పెదాలను ఎక్స్​ఫోలియేట్ చేస్తుంది. అంతేకాకుండా మంచి హైడ్రేషన్​ను అందిస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత 15 నిమిషాలు మాస్క్​ని అలానే ఉంచేయండి. అనంతరం వాష్ చేసుకుంటే మీరు ఫలితాలు చూస్తారు. మృదువైన, హైడ్రేటెడ్ పెదాలు పొదాల కోసం రెగ్యూలర్​గా దీనిని ఉపయోగించవచ్చు. 

కొబ్బరి నూనెతో

పెదాలపై ఉన్న టాన్​ పోగొట్టడానికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనె, పంచదారతో చేసిన స్క్రబ్ లిప్స్​పై ఉన్న మృతకణాలను పోగొడుతుంది. ఎఫెక్టివ్ ఎక్స్​ఫోలియేషన్ కోసం.. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ పంచదారతో కలపండి. కొబ్బరి నూనె ఆర్గానిక్ అయితే ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఈ మిశ్రమాన్ని పెదాలపై సున్నితంగా స్క్రబ్ చేయండి. తేలికగా తయారు చేసుకోగలిగే ఈ మాస్క్​ మీకు మృదువైన, టాన్ ఫ్రీ పెదాలను అందిస్తుంది. అంతేకాకుండా హైడ్రేట్ చేసి.. పెదాలకు మంచి రంగునిస్తుంది. 

స్ట్రాబెర్రీ​తో

మీ పెదాలు పింక్​ కలర్​లో పొడిబారకుండా హైడ్రెటెడ్​గా కనిపించాలంటే మీరు స్ట్రాబెర్రీ, తేనె, ఆలివ్ ఆయిల్​తో తయారు చేసిన మాస్క్​ను ట్రై చేయవచ్చు. ఈ లిప్ మాస్క్​ కోసం స్ట్రాబెర్రీని మెత్తగా గ్రైండ్ చేసి దానిలో ఓ టీస్పూన్ తేనె, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పెదాలకు అప్లై చేసి కడిగేయాలి. ఇది పెదాలకు మంచి పోషణను అందిస్తుంది. స్ట్రాబెర్రీలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెదాలపై టాన్​ను తొలగించి సహజమైన రంగును అందిస్తాయి.

నిమ్మరసంతో.. 

పెదాలను సహజంగా ఎక్స్​ఫోలియేట్ చేయడంలో నిమ్మరసం, తేనె, చక్కెర బాగా పనిచేస్తాయి. రెండు టీ స్పూన్ల తేనెలో ఓ టీ స్పూన్ పంచదార, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు మీ పెదాలపై ఈ మిశ్రమంతో సున్నితంగా మసాజ్ చేయండి. అనంతరం ఓ 5 నిముషాలు ఆ మాస్క్​ను అలాగే ఉండనివ్వండి. ఇది పెదాలపై ఉన్న మృతకణాలను తొలగించి.. సహజమైన రంగుతో మృదువైన పెదాలను మీకు అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సహజమైన లిప్ మాస్క్​లను ట్రై చేసి.. మెరిసే, అందమైన పెదాలను పొందేయండి.

Also Read : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget