అన్వేషించండి

Telugu Food Channels: తెలుగులో పాపులరైన ఫుడ్ ఛానల్స్ ఇవే..

లాక్‌డౌన్ టైమ్ యూట్యూబర్లకు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇంట్లో ఉంటూనే మంచి కంటెంట్ ఇస్తూ మనల్ని ఎంటర్‌టైన్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో వంట ఛానల్స్ చేసిన సహాయం అంతా ఇంతా కాదు.

లాక్‌డౌన్ టైమ్ యూట్యూబర్లకు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇంట్లో ఉంటూనే మంచి కంటెంట్ ఇస్తూ మనల్ని ఎంటర్‌టైన్ చేశారు. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంట ఛానల్స్ గురించి. లాక్‌డౌన్ సమయంలో ఇవి చేసిన సహాయం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ వల్ల చాలా మంది గరిటలు పట్టడం మొదలెట్టారు. వీటిని చూస్తూనే చాలా మంది వంటలు నేర్చుకున్నారు. మరి మన తెలుగులో మంచి వంటలు, స్వీట్లు, వెరైటీ రెసిపీలతో మన ఇంటి మనుషుల్లా మారిన ఓ ముగ్గురు యూట్యూబర్ల గురించి తెలుసుకుందామా? 
హలో ఫుడీస్... (Vismai Food)

ఈ ఒక్క మాటతోనే యూట్యూబ్‌లో ట్రెండ్ సృష్టించింది విస్మయి ఫుడ్ ఛానల్. పరుచూరి తేజ అనే వ్యక్తి 2018 ఆగస్టులో ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 26.4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తేజ హలో ఫుడీస్ అంటూ తన వీడియోలను ప్రారంభిస్తారు. ఇతర ఛానళ్లతో పోలిస్తే విస్మయి ఫుడ్ వీడియోల నిడివి తక్కువగా ఉంటుంది.

Telugu Food Channels: తెలుగులో పాపులరైన ఫుడ్ ఛానల్స్ ఇవే..

మొదట్లో 1 నుంచి 2 నిమిషాలలోపు వీడియోలను పోస్ట్ చేసేవారు. క్రమంగా నిడివి పెరుగుతూ వచ్చింది. తేజ వాయిస్, రుచికరమైన వంటలు, వీడియోల నిడివి తక్కువగా ఉండటం, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ చానల్‌కు అదనపు ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఫుడ్ లవర్స్‌ అయితే ఇదో ఐఫీస్ట్ లాంటిదని అంటారు. విస్మయి ఫుడ్ ఛానల్‌కు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఛానల్‌లో రవ్వ లడ్డు, వెజ్ మంచూరియా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, మైసూర్ పాక్ వీడియోలకు మంచి వ్యూస్ ఉన్నాయి. 
శ్రావణీస్ కిచెన్ (shravani's kitchen)
శ్రావణి అనే గృహిణి ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల వంటకాలతో పాటు మహారాష్ట్ర, నార్త్ ఇండియన్ ఫుడ్ వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఛానల్‌లో 800కు పైగా వీడియోలు ఉన్నాయి. వీటన్నిటిలో పానీపూరి తయారీ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చాయని శ్రావణి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Telugu Food Channels: తెలుగులో పాపులరైన ఫుడ్ ఛానల్స్ ఇవే..

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రావణి కుకింగ్ పై ఉన్న మక్కువతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. శ్రావణి ముంబైలో పెరగడంతో మహారాష్ట్ర వంటకాలపై అవగాహన ఉంది. వీటిని కూడా ఆమె తన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తారు. శ్రావణి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు
అమ్మ చేతి వంట (Amma Chethi Vanta)
ఆవుల భార్గవి ఈ ఛానల్‌ను ప్రారంభించారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన భార్గవి బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశారు. తల్లి సూచనతో 2017 మే 31న భార్గవి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మొదట్లో వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వచ్చేవి కావని..  సబ్‌స్కైబర్స్‌ కూడా చాలా తక్కువగా వచ్చేవారని తెలిపారు. వివిధ టెక్ ఛానల్స్ ద్వారా అన్ని విషయాలు నేర్చుకుని ప్రొఫెషనల్ యూట్యూబర్‌గా ఎదిగారు.

Telugu Food Channels: తెలుగులో పాపులరైన ఫుడ్ ఛానల్స్ ఇవే..

ప్రస్తుతం ఆమె ఛానల్‌ను 19.5 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ చానల్ బాగా క్లిక్ అవడంతో 'మనలో మన మాట' అనే మరో చానల్‌ను కూడా ప్రారంభించారు. భార్గవి భర్త డాక్టర్. కరోనా సమయంలో ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు ఆమె తన భర్తతో కలిపి కొన్ని వీడియోలు పోస్టు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget