News
News
X

Coronavirus: గొంతు నొప్పిగా ఉందా? జలుబు అనుకుంటే పొరబడినట్లే - ఎందుకో తెలుసా?

గొంతు నొప్పిగా ఉందా? అయితే, మీరు తప్పకుండా జాగ్రత్తపడాలి. అది జలుబు అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు.

FOLLOW US: 
 
కరోనా మహమ్మారి దేశాన్ని వీడలేదు. రోజుకు కనీసం ఐదు వేలకి పైగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా తన వేరియంట్లు మార్చుకుంటున్నట్టే తన లక్షణాలు కూడా మార్చుకుంటూ వస్తుంది. ఇంతక ముందు కరోనా లక్షణాలు అంటే సాధరణ జ్వరం, జలుబు, రుచి, వాసన కోల్పోవడం ఉండేది. కానీ ఇప్పుడు వాటిని అధిగమించే లక్షణం మరొకటి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలో కేసులు పెరుగుతున్నప్పటికి వారిలో ఉన్న లక్షణాలు వైద్యులని గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ఇప్పుడు ఇదే అత్యంత ప్రధానమైన లక్షణం

సాధారణంగా వాతావరణంలో చల్లని మార్పులు సంభవించగానే గొంతు నొప్పి రావడం జరుగుతుంది. ఇది జాలువు వచ్చే ముందు సంకేతంగా అందరూ భావిస్తుంటారు. కానీ ఇప్పుడు గొంతు నొప్పి రావడం కూడా ప్రమాడకరమే. ఎందుకంటే కోవిడ్ లక్షణాల్లో ఇది ఒకటిగా చెరిపోయింది. కోవిడ్ గొంతు నొప్పితో మూడింట రెండు వంతుల మంది వ్యక్తుల్లో దీన్ని గుర్తించారు. చాలా మంది వృద్ధులు గొంతు నొప్పి అనగానే జలుబు వల్ల అనుకుంటున్నారు కానీ అది కోవిడ్ వల్ల అని పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా మారుతోందని వెల్లడించారు.

వ్యాక్సిన్లు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణగా వచ్చిన రోగనిరోధక శక్తి చుట్టూ ఈ వైరస్ అభివృద్ధి చెందుతుందని కనుగొన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లలో లక్షణాలు కూడా మార్పులు చెందుతున్నటు తెలిపారు. పీసీఆర్ టెస్టింగ్, సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే వేరియంట్లు గురించగలుగుతున్నారు కానీ అసలు వాటి వ్యాపి ఎలా ఉంటుందనే విషయంపై దృష్టి సారించడం లేదని యూకే కి చెందిన నిపుణులు అంటున్నారు.

రానున్న కాలంలో మరింత జాగ్రత్త అవసరం

వచ్చేది చలికాలం. ప్రజలు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. వాటిలో కోవిడ్ కూడా ఉండే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే గొంతు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేయించుకుని రోగ నిర్ధారణ ద్వారా చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఇదే కాదు మరో కొత్త లక్షణం కూడా భయాందోళనలకి గురి చేస్తుంది. అదే నిద్రలేమి. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. కరోనా సోకిన వారిలో నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది.

News Reels

భారత్ జాగ్రత్తగా ఉండాలి

యూకేలో ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని అంటూ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ తేలికపాటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ అది అత్యంత హాని కలిగించేదిగా ఉండకుండా జాగ్రతలు పాటించాలి. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా ముఖానికి మాస్క్ లు ధరించకుండా తిరగడం ప్రమాదకరం అని అంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ముందస్తు రక్షణ చర్యలు పాటించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం

కోవిడ్ కొత్త లక్షణం గొంతు నొప్పితో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే జాగ్రత్త తీసుకోవాలి. జ్వరం, అలసట, దగ్గు, ఒళ్ళు నొప్పులు, ముక్కు కారటం, కీళ్ల నొప్పి, జీర్ణాశయాంతర సమస్యలే కాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి,రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం కూడా ప్రమాదకరమైన లక్షణాలే.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం

Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది 

Published at : 04 Oct 2022 06:52 PM (IST) Tags: Fever Covid-19 COVID 19: Covid Symptoms Covid-19 New Symptom Sore Throat Throat Pain

సంబంధిత కథనాలు

Electric Shock: కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, వెంటనే ఇలా చేయాలి

Electric Shock: కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, వెంటనే ఇలా చేయాలి

ఓ మై గాడ్, ఆహారంలో దంతం - విమాన పాసింజర్‌కు చేదు అనుభవం, ఇలా జరిగితే కేసు వేయొచ్చు!

ఓ మై గాడ్, ఆహారంలో దంతం - విమాన పాసింజర్‌కు చేదు అనుభవం, ఇలా జరిగితే కేసు వేయొచ్చు!

South Koreans: సౌత్ కొరియన్ల వయసు తగ్గిపోతుందట, ఏమైనా మేజిక్ చేస్తున్నారా ఏంటి?

South Koreans: సౌత్ కొరియన్ల వయసు తగ్గిపోతుందట, ఏమైనా మేజిక్ చేస్తున్నారా ఏంటి?

ప్రమాదంలో మగజాతి - భూమిపై అంతరించిపోతున్న పురుషులు? - కారణాలివేనట!

ప్రమాదంలో మగజాతి - భూమిపై అంతరించిపోతున్న పురుషులు? - కారణాలివేనట!

Diabetes: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనట్టే

Diabetes: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనట్టే

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు