Microwave: వీటిని మైక్రోవేవ్ అవెన్లో వేడి చేయకూడదు, అయినా చేసేస్తున్నాం
మైక్రోవేవ్ అవెన్ ఎక్కువగా వాడుతున్నారా? వాటిలో ఎలాంటి ఆహారం పెట్టకూడదో తెలుసా?
మైక్రోవేవ్ అవెన్ వాడకం పెరిగింది. అందులో బేకింగే కాదు నూడిల్స్ వంటి వంటలు వండేస్తున్నారు చాలా మంది. దీన్ని అధికంగా చల్లటి ఆహారాన్ని వేడి చేసేందుకు ఉపయోగిస్తారు. జీవితాన్ని సులభతరం చేసే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్‌లో ఇదీ ఒకటి. కానీ అధిక శాతం మందికి తెలియని విషయం దీనిలో కొన్ని రకాల ఆహారాలు వేడి చేయకూడదు. ఎలాంటి వాటిని వేడి చేయకూడదో, ఎందుకో తెలుసుకోండి.
కూరగాయలు
మైక్రోవేవ్‌లో కూరగాయలను వేడి చేసే అలవాటు ఉంటే మానుకోవాలి. ఎందుకంటే రేడియేషన్ రూపంలో అధిక వేడి కూరగాయల్లోని పోషకాలను నాశనం చేస్తుంది. పండ్లు, కూరగాయాల్లో అధిక వేడికి గురి అయితే వాటిని తిన్నా శరీరానికి అందే శక్తి తక్కువే. మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల పోషకాల సాంద్రత తగ్గుతుంది. అందువల్ల, కూరగాయలను ఆవిరిలో ఉడికించడం ఉత్తమం. అంటే స్టవ్ మీద పెట్టి నీళ్లు వేసి కూరలు, పులుసుల రూపంలో వండుకోవడం మంచిది.
ఉడికించిన గుడ్లు
ఉడికించిన గుడ్లు ఒక్కోసారి మిగిలిపోతాయి. వాటిని తిరిగి కొంతమంది మైక్రోవేవ్‌లో మళ్లీ వేడి చేస్తారు. గుడ్లను వాటి పెంకుతో పాటూ అలా మళ్లీ వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల గుడ్డు పేలిపోతుంది. దీని వల్ల అవెన్ పాడవుతుంది. పెంకులను తీసివేశాక వేడి చేయాలి.
నీళ్లు
నీళ్లను కూడా వేడిచేస్తున్నారా? చాలా తక్కువ సమయం నీళ్లను వేడి చేసే ఫర్వాలేదు. కానీ కొంతమంది అధిక ఉష్ణోగ్రత వచ్చే వరకు వేడి చేస్తారు. దీని వల్ల ఒక్కోసారి నీళ్లు పేలవచ్చు. అందుకే బాగా వేడిగా అయ్యేవరకు నీళ్లను అవెన్లో ఉంచకండి.
చిప్స్ లేదా వేఫర్లు
చిప్స్, వేఫర్లు మెత్తగా అయిపోయాక తిరిగి వాటిని కరకరలాడేలా చేయడానికి ఎప్పుడూ అవెన్లో పెట్టి వేడి చేయద్దు. వాటిని నేరుగా పెట్టి వేడి చేయడం వల్ల అవి మరింత అనారోగ్యకరంగా మారతాయి.
కోల్డ్ మీట్
ఐసుముక్కల్లా గడ్డ కట్టిన ఫ్రోజెన్ మీట్ ను అవెన్లో వేడి చేసేవాళ్లు ఎంతో మంది. ఇలా చేయడం వల్ల మాంసంలో బ్యాక్టిరియా అభివృద్ధి ప్రమాదాన్ని పెంచుతుంది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ ఫుడ్ సైన్స్ డిపార్ట్‌మెంట్ చేసిన అధ్యయనం ప్రకారం కోల్డ్ కట్‌లు, గడ్డ కట్టిన మాంసాన్ని వేడి చేయడానికి సురక్షితమైన మార్గం రాత్రిపూట ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేయడం.
నూనె
నూనె లేదా నూనెతో నిండిన ఆహారాన్ని ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయద్దు. ఇలా వేడి చేయడం వల్ల ఆహారంతో పాటూ నూనెలోని పోషకాలు కూడా నాశనం అవుతాయి. అలాగే మైక్రోవేవ్ లోపల నూనె సులభంగా వేడెక్కదు.మైక్రోవేవ్‌లో నూనెలను వేడి చేయడం మానుకోవడం మంచిది.
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఉదయాన చేయాల్సిన పనులు ఇవే
Also read: రోజుకో గుడ్డు తింటే గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది, కొత్త అధ్యయన ఫలితం