Immunity Drinks: ఇదే సరైన టైమ్.. ఈ 5 జ్యూస్‌లు ఇమ్యునిటీ పెంచుతాయి, డోన్ట్ మిస్!
ఒక వైపు చలికాలం.. మరో వైపు కోవిడ్-19 ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న నేపథ్యంలో.. ఈ జ్యూస్‌లు తప్పకుండా తీసుకోడానికి ప్రయత్నించండి.
కోవిడ్-19(Covid-19) కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలిసిందే. పైగా ఇది చలికాలం కావడంతో వైరస్‌లు, బ్యాక్టీరియాలకు పండుగ సమయం. కాబట్టి.. ఇలాంటి సమయంలోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆహారంతోపాటు కొన్ని ముఖ్యమైన రసాలను శరీరానికి అందించాలి. వేసవిలో పండ్ల రసాలు(జ్యూస్‌లు) తాగాలంటే అనేక పండ్లు అందుబాటులో ఉంటాయి. అవి శరీరానికి చలువ చేస్తాయి. అయితే, శీతాకాలంలో చాలామంది జ్యూస్‌లకు దూరంగా ఉంటారు. అది తగిన సీజన్ కాదని భావిస్తారు. కానీ, ఈ కాలంలో కూడా జ్యూస్‌లు తప్పకుండా తీసుకోవాలి. అవి మీరు ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన ఇమ్యునిటీ, ఫిట్‌నెస్‌ను అందిస్తాయి. మరి జ్యూస్‌లు ఏమిటో చూసేద్దామా!
టమోటా రసం లేదా సూప్: చలికాలంలో టమోటా రసం తీసుకోవడం మంచిది. టమోటాలో ఫైబర్, విటమిన్ B9 పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్-సి కూడా ఉంటుంది. టమోటా జ్యూస్ వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. మలబద్ధకం సమస్యలను పరిష్కరిస్తుంది. చలికాలంలో బరువు పెరిగిపోతామని కలత చెందేవారికి టమోటా జ్యూస్ మంచి మందు. చలికాలంలో వేడి వేడి టమోటా జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది.
స్ట్రాబెర్రీ జ్యూస్: స్ట్రాబెర్రీలు శీతాకాలంలో అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. అలాగే కివీ జ్యూస్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి మిమ్మల్ని కాపాడతాయి.
క్యారెట్-అల్లం: చలికాలంలో క్యారెట్, అల్లం రసం తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. అల్లం వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. బీట్‌రూట్, క్యారెట్, అల్లం కలిపిన జ్యూస్‌ను వ్యాయామానికి ముందు, ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు. ఈ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్-ఎ, విటమిన్-సి ఉంటాయి. ఈ జ్యూస్‌లు రక్తహీనత సమస్యను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్- ఆరేంజ్: క్యారెట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ జ్యూస్‌లో ఆరెంజ్ లేదా గ్రీన్ యాపిల్‌ను కలిపి జ్యూస్‌లా తీసుకోవచ్చు. దీని వల్ల క్యారెట్ జ్యూస్ రుచిగా కూడా ఉంటుంది. ఈ జ్యూస్‌లో విటమిన్-సి, విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కంటి చూపు సమస్యలను సైతం ఇది అడ్డుకుంటుంది. ఈ జ్యూస్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
Also Read: కోవిడ్ వ్యాక్సిన్ - బూస్టర్ డోస్‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. సిట్రస్ పండ్ల రసాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జలుబు బారిన పడకుండా చేస్తాయి. నారింజ, మోసంబి, ద్రాక్ష జ్యూస్‌లను ఈ సీజన్లో తీసుకోవడం మంచిది. అయితే, మీరు వాటిని చల్లగా తీసుకోకపోవడం మంచిది.
గమనిక: కొన్ని పండ్లు, జ్యూస్‌లు అలర్జీలు.. సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిస్తాయి. కాబట్టి.. మీరు వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా, సూచనలు తీసుకోగలరు. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి