Packs For Glowing Skin : ఈ సహజమైన ప్యాక్స్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Skin Care Tips : పార్లర్‌కి వెళ్లకుండా.. వేలకు వేలు డబ్బును ప్రొడెక్ట్స్‌కు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మీరు మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే ఈ ప్యాక్స్ ట్రై చేయవచ్చు.
Healthy Skin Care Routine : మెరిసే, అందమైన స్కిన్ కావాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం పార్లర్‌కు వెళ్తారు. కొన్ని మాయిశ్చరైజర్లు, క్రీమ్‌లు ఉపయోగిస్తారు. హెల్తీ స్కిన్, గ్లో కోసం ఉపయోగించే ఉత్పత్తులు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే మీరు ఎక్కువ ఖర్చులు పెట్టకుండా.. ఎలాంటి కెమికల్ ప్రొడెక్ట్స్ ఉపయోగించకుండా మంచి గ్లో పొందవచ్చు. ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో కూడా మీకు అందమైన, మెరిసే చర్మాన్ని అందిస్తాయి. పొడిబారడం, మొటిమలు వంటి సమస్యను దూరం చేస్తాయి. అయితే ఎలాంటి ప్యాక్స్ చర్మానికి ఎలాంటి ఉపయోగాలు అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపుతో..
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెరిసే చర్మాన్ని అందిస్తాయి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు, మొటిమలను తగ్గిస్తాయి. అంతేకాకుండా చర్మానికి మంచి తాజా లుక్ ఇస్తుంది. పాలల్లో ఒక చెంచా పసుపు కలిపి దానిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. లేదా పసుపును చెంచా తేనె, పాలతో కలిపి కూడా ప్యాక్‌గా ఉపయోగిస్తే మీరు మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
శనగపిండి
చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తేనే మీరు మెరిసే చర్మాన్ని పొందగలరు. కాబట్టి మీరు మృతకణాలను తొలగించుకోవడానికి శనగపిండిని ఉపయోగించుకోవచ్చు. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది మిమ్మల్ని మెరిసేలా చేస్తుంది. మీరు సబ్బుకు బదులుగా శనగపిండితో చేసిన ప్యాక్‌ని ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో ఒక టీస్పూన్ బటర్ వేసి పేస్ట్ తయారు చేసి మాస్క్‌గా ఉపయోగించవచ్చు.
కలబందతో
మృదువైన, మెరిసే చర్మం కోసం చాలామంది కలబందను ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. చర్మ సమస్యలను దూరం చేయడంలో ఇది బాగా పని చేస్తుంది. దీనిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మీకు మెరిసే చర్మాన్ని అందిచడమే కాకుండా మొటిమలు, ముడతలను దూరం చేస్తాయి. స్కిన్‌ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. కలబంద గుజ్జును తీసి దానిని మీరు నేరుగా ముఖానికి అప్లై చేయవచ్చు. దీనిని 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేస్తే.. మీరు మెరుస్తున్న, బిగుతుగా ఉండే చర్మాన్ని అందిస్తుంది.
తేనె
తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మానికి కూడా ఇది అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. పొడిబారిన చర్మానికి తేనె మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మచ్చలేని ఛాయను అందిస్తుంది. పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. కలబంద, తేనె, నిమ్మరసం కలిపి.. ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.
కొబ్బరి నూనె
కొబ్బరినూనె కేవలం జుట్టుకే కాదు.. చర్మ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇది మీకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఇది మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి.. పొడి చర్మం, ఇతర చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వాపు, మొటిమలు తగ్గిస్తుంది. ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్, క్లెన్సర్, సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్లో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు కలిపి మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయవచ్చు. ఇది మీకు మంచి మెరుపును అందిస్తుంది.
మీ చర్మం టాన్ అయిపోవడం, నిర్జీవంగా ఉండడం, డెడ్ స్కిన్స్, పింపుల్స్‌ని దూరం చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని మీరు కచ్చితంగా ట్రై చేయవచ్చు. ఇవి మీకు సహజంగా, చర్మానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్రయోజనాలు అందిస్తాయి.
Also Read : అందంగా పెంచుకున్న గోళ్లు విరిగిపోతున్నాయా? అయితే ఈ టిప్స్, ట్రిక్స్ ఫాలో అయిపోండి..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.