By: ABP Desam | Updated at : 01 Jun 2023 08:00 AM (IST)
Representational image/pixabay
కొన్ని కీటకాలు రక్తం పీల్చే సమయంలో చర్మం కింద గుడ్లు పెట్టేస్తాయి. ఇలాంటి కీటకాలు కరవడం కొంచెం ఆందోళనకరమైన విషయం. ఇది ప్రాణాంతక అంటువ్యాధులకు కారణం కావచ్చు. గ్లౌసెస్టర్ షైర్ విశ్వవిద్యాలయంలో ఎకోలజిస్ట్, కన్సర్వేషన్ సైంటిస్ట్, ఎటమాలజిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ ఆడమ్ హర్ట్ కొన్ని విషయాలను వివరించారు. చాలా జీవులు మన శరీరాన్ని నివాసయోగ్యాలుగా భావిస్తయట. మరి కొన్ని వాటి సంతతిని పెంచుకునేందుకు అనువైనవిగా చూస్తాయి. ఇలాంటి జీవులలో మన శరీరానికిక హాని కలిగించే వాటిని పరాన్నజీవులు అని అంటారు.
మన శరీరంలోపల లేదా, మన శరీరం మీద గుడ్లు పెట్టడం గురించి వింటే చాలా భయానకంగా ఉన్నప్పటికీ ఇదే వాస్తవం. అలాంటి కొన్ని పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం.
మానవ శరీరం మీద నివసించే అత్యంత సాధారణ పరాన్నజీవులలో పేను ఒకటి. ఇవి జుట్టులో నివసించే జీవి ఇది. రక్తాన్ని పీలుస్తుంది. జుట్టు మీద గుడ్లు పెడుతుంది. కొన్ని సార్లు చర్మం కింద కూడా గుడ్లు పెడతాయి. పేను ప్రత్యక్షంగా ఒకరి తల నుంచి మరొకరి తలలోకి చేరడం ద్వారా వ్యాపిస్తుంది. పేను వల్ల ముఖ్యంగా చాలా అసౌకర్యంగా ఉంటుంది. చాలా తక్కువ సందర్బాల్లో టైఫస్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది.
దీనిని బద్దె పురుగు అంటారు. ఇవి చర్మం లోపలికి వెల్ళిపోతాయి. ఇవి ఫ్లాట్ గా రిబ్బన్ మాదిరిగా ఉండే సూక్ష్మ జీవి. అయితే ఇవి 23 అడుగుల వరకు కూడా పొడవు పెరగగలవు. జీర్ణవ్యవస్థ మీద దాడి చేసి అక్కడ చేరినపుడు పది వేల వరకు కూడా గుడ్లు పెట్టగలవు. పొదిగే సమయంలో ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు వరకు శరీరం అంతా వ్యాపిస్తాయి. లక్షణాలు పెద్దగా కనిపించవు కానీ మలంలో పురుగులు కనిపిస్తాయి.
చికిత్స టేప్ వార్మ్ కు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటి వాడకంతో ఇవి చనిపోతాయి. మలం ద్వారా విసర్జించబడుతాయి. తరచుగా చేతులు కడుక్కోవడం, చెప్పులు లేకుండా మట్టిలో నడవకూడదు. సంక్రమణ ప్రమాదం ఉందన్న అనుమానం ఉన్న చోట నీళ్లు తాగకపోవడమే మంచిది. సరిగ్గా వండని మాంసాహారం తీసుకోవద్దు.
లోవా లోవా, లేదా రౌండ్ వార్మ్ గర్రపు ఈగల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఈగలు కుట్టినపుడు లార్వా శరీరంలోకి ప్రవేశించి చర్మం కింద ఐదు నెలల పాటు పెరుగుతాయి. వేల కొద్ది గుడ్లు పెడతాయి. ఇవి శరీరం అంతా తిరుగుతాయి. చర్మం కింద, కనుగుడ్డు మీద పురుగులు కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఈ స్థితిని లోయాసిస్ అంటారు. ఇది తీవ్రమైతే మెదడు వాపు, కోమా, మరణానికి కారణం కూడా కావచ్చు.
కళ్లలో పురుగులను సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఇతర సమస్యలకు మందులతో చికిత్స అందిస్తారు.
ఇదొక పరన్నజీవి. బ్లాక్ ఫ్లైస్ ద్వారా వ్యాపిస్తుంది. వేగంగా ప్రవహించే నీటి ప్రవాహాల దగ్గర కనిపిస్తుంది. గుడ్లు పెట్టడానికి ముందు రక్త ప్రవాహంలో 6-12నెలల పాటు సబ్ క్యుటేనియస్ కణజాలాల్లో గడుపుతాయి. ఓంకోసెర్పియాసిస్ అనే చర్మ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.
యాంటి పరాసిటిక్ మందులు దీనికి చికిత్సగా ఉపయోగిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త
Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?
Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి
Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
/body>