Hair Loss: జుట్టు రాలిపోతోందా? అందుకు కారణం రోజూ మీరు తాగే ఈ పానీయాలే!
అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. దాని నుంచి బయటపడాలంటే ఈ పానీయాలు తీసుకోండి.
తల దువ్వుకునేటప్పుడు దువ్వెనకి గుప్పెడు జుట్టు కనిపించిందంటే ఏడుపు ఒక్కటే తక్కువగా ఉంటుంది. వామ్మో ఎంత జుట్టు ఊడిపోయిందని తెగ బాధపడిపోతారు. కానీ మనం చేసే పనుల వల్ల జుట్టు ఊడుతుందనే విషయం గ్రహించలేరు. తల నుంచి 50-100 వెంట్రుకలు రాలిపోవడం సహజం. అంతకంటే ఎక్కువగా రాలిపోతే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలి. పోషకాహార లోపాలు, హార్మోన్ల సమతుల్యత, వంశపారపర్య సమస్యల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాదు ప్రతిరోజూ మనం తీసుకునే కొన్ని సాధారణ పానియాల వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. అవేంటంటే..
కాఫీ
ఉదయం నిద్రలేవగానే చాలా మంది కాఫీ, టీ తీసుకుంటారు. ఇవి తీసుకోవడం వల్ల రిలాక్స్ గా అనిపిస్తుంది. శక్తి వస్తుంది. కానీ జుట్టుని మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాఫీలోని కెఫీన్ ఐరన్ స్థాయిలపై ఒత్తిడిని తీసుకొస్తుంది. దీని వల్ల జుట్టు రాలిపోతుంది. కాఫీలో 4.6 శాతం టానిన్ ఉంటుంది. టీలో 11.2 శాతం టానిన్ ఉంటుంది.
మద్యం
అతిగా మద్యం సేవించడం వల్ల శరీరంలోని కీలక పోషకాల లోపం ఏర్పడుతుంది. జింక్, రాగి లేదా ప్రోటీన్ లేకపోవడం వల్ల తీవ్రమైన జుట్టు రాలే సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బట్టతలకి కూడా కారణమవుతుంది. మద్యపానం చేసే చాలా మంది వ్యక్తులు సరైన ఆహారం తీసుకోరు. దీని వల్ల పోషకాలు అందవు. జీర్ణక్రియ సమయంలో శరీరం ఆహారాన్ని ప్రాసెస్ చేసే విధానాన్ని మద్యం అడ్డుకుంటుంది.
సోడాలు
సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకొనేవాళ్ళు అధికంగా జుట్టు రాలే సమస్యని ఎదుర్కుంటారు. ఈ పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగించే అదనపు చక్కెరని కలిగి ఉంటాయి. అందుకే కార్బొనేటెడ్ పానీయాలు జుట్టుకి చాలా హానికరం. ఇవి రక్తంలోని ఇన్సులిన్ తో కలిసి షుగర్ లెవల్స్ పెరిగేలా చేస్తుంది. దీని వల్ల రక్తప్రసరణకి ఆటంకం కలుగుతుంది. జుట్టు కుదుళ్ళకి పోషకాల సరఫరా తగ్గిపోవడం వల్ల వెంట్రుకలకు నష్టం వాటిల్లితుంది.
పాలు
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాల ఉత్పత్తులు ఎప్పుడు పోషకాహారంగా పరిగణించబడతాయి. కానీ పాలలో కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. ఇవి పెరిగితే జుట్టు రాలడానికి దారితీస్తుంది. సోరియాసిస్, చుండ్రు వంటి సమస్యలు ఉన్నట్లయితే పాల ఉత్పత్తులు తీసుకుంటే జుట్టు రాలే సమస్యని పెంచుతుంది.
జుట్టుని పెంచే ఆరోగ్యకరమైన పానీయాలు
ఉసిరి జ్యూస్: విటమిన్-C పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్ ఇది. మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సెల్ డ్యామేజ్‌ను నిరోధించి హెల్తీ హెయిర్ గ్రోత్ ని ప్రోత్సహిస్తుంది.
క్యారెట్ జ్యూస్: విటమిన్లు ఏ, బి, ఇ, యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్. జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. అంతే కాదు జుట్టు తెల్లబడటం కూడా నివారిస్తుంది.
అలోవెరా జ్యూస్: కలబంద చర్మంతో పాటు జుట్టుని కూడా ఫిట్ గా ఉంచుతుంది. ఇందులోని విటమిన్లు ఏ, సి, ఇ ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. బలమైన మెరిసే జుట్టుని పొందొచ్చు.
బచ్చలికూర రసం: బచ్చలికూరలో ఐరన్, బయోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు వెంట్రుకల కుదుళ్ళతో సహా కణజాలాలకి ఆక్సిజన్ సరఫరాని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇందులో ఫెర్రీటీం సమ్మేళనం ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలని ఇది ఇస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్