వాదనలో గెలిచేందుకు టాప్ టెన్ మానిప్యులేటివ్ ట్రిక్స్ ఇవే, వాడి చూడండి మీరే విజేత
ఇద్దరి మధ్య వాదన అయ్యేప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. అలా గెలవడానికి ఎక్కువమంది వాడే మానిప్యులేటివ్ ట్రిక్స్ ఇవేనట.
ఈ స్టోరీ చదువుతూనే మానిప్యులేషన్ తప్పు కదా? అనే మొదటి ఆలోచన మీ మనసులో వచ్చి ఉండొచ్చు. తప్పే కానీ నేరం కాదు. మేము ఇక్కడ మానిప్యులేషన్ చేయమని చెప్పడం లేదు, ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న మానిప్యులేటివ్ ట్రిక్స్‌ను మీ ముందు ఉంచుతున్నాం. వీటి ద్వారా చిన్న చిన్న వాదనల్లో మీరు విజేతగా నిలవచ్చు. ఈ ట్రిక్స్ అన్నీ ఫన్నీగా, ఎదుటివారిని తికమక పెట్టేగా ఉంటాయి కానీ మోసం చేసేలా ఉండవు. మీకు ఇష్టముంటే వాడుకుంటారు, నచ్చకపోతే మీ దారిలో మీరే వెళతారు.
1. వాదన జరుగుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేస్తే మీకే లాభం. ఎవరైనా మీతో వాదిస్తున్నారనుకోండి, ఆ సమయంలో సంబంధం లేని ప్రశ్న అడగాలి. ‘మీకు ఇసుక కావాలా’ అని అడిగితే, ఎదుటి వ్యక్తి తికమక పడి వాదనలో పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు కాస్త మెల్లగా మాట్లాడడం మొదలుపెడతారు. ఇది ఫన్నీగా ఉంటుంది కానీ కచ్చితంగా వర్కవుట్ అవుతుంది.
2. ఎవరితోనైనా వాదన జరుగుతున్నప్పుడు వారి కళ్లల్లోకి నేరుగా చూస్తే ఆ వాదన మరింతగా ముదిరిపోతుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తి నుదుటిని కళ్లార్పకుండా చూడండి. ఎదుటివారికి ఏమీ అర్థం కాదు. ఆ సమయంలో వారు త్వరగా అబద్ధాలు కూడా చెప్పలేరు.
3. ఎవరైనా మీతో గట్టిగా వాదించేందుకు సిద్ధమయ్యారని అనిపిస్తే మీరు వారితో వాదించకండి. ఆ వ్యక్తి ఏం చెప్పినా సైలెంట్‌గా విని, అన్నింటికీ ఓకే అని చెప్పండి. ఇది తెలివైన పద్ధతి.
4. మీమీద ఒక వ్యక్తి అరుస్తున్నప్పుడు అతన్ని మెప్పించేలా ఏదో ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. అరుస్తున్న వ్యక్తి మంత్రం వేసినట్టు తిట్టడం ఆపేస్తారు.
5. కొంతమంది తమ వాదన తప్పు అని తెలిసినా వాదిస్తూనే ఉంటారు. అలాంటి వారితో వాదించుకుండా తెలివిగా మాట్లాడాలి. ‘అవును, నాకు తెలుసు మీరు చాలా తెలివైన వారు, అందుకే ఇలా అర్థం చేసుకోగలిగారు’ అని అనండి. ఎదుటివారు ఒక్కనిమిషం ఆగి తాము ఏం మాట్లాడుతున్నామో రివ్యూ చేసుకునే స్థితికి వెళతారు.
6. ఏదైనా వాదనలో మీరు నెగ్గాలంటే అది అన్నీ ఎమోషన్స్ కలిసిన ఒక స్టోరీలా ఉండాలి. మీ వాదనలోనే ఎమోషన్ చూపించాలి, నిజాలు చెప్పాలి, సానుభూతి కలిగేలా మాట్లాడాలి. ఇలా చేస్తే ఎదుటి వారు తమ వాదనను కొనసాగించాలనుకోరు.
7. ఎవరైనా చాలా ఇబ్బందికరంగా వాదించడం మొదలుపెడితే మీరు సమాధానం ఇవ్వకుండా ఉండిపోవాలి. మీ నిశ్శబ్ధంగా కూర్చునే ఉండండి. ఎంతగా రెచ్చగొట్టినా మాట్లాడకండి. చివరికి వారే విపరీతమైన కోపంతో తమ తప్పులు తామే బయటపెట్టుకునే అవకాశం ఉంది.
8. వాదన మరీ పెరుగుతోంది అనిపించినా, అతడిని వెంటనే కూల్ చేయాలి అనుకున్నా ఆ వ్యక్తిని వెంటనే హగ్ చేసుకోండి. ప్రేమ పూర్వకమైన కౌగిలింతను కోపాన్ని తగ్గించేస్తుంది. ఎదుటి వ్యక్తి ఏం చేయాలో తెలియక నిశ్శబ్ధంగా ఉండిపోవచ్చు.
9. మీ స్నేహితుడితోనో, బంధువుతోనో గట్టి వాదన అవుతోంది అనుకోండి, వారితో మీరు పంచుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేయండి. ‘ఇప్పుడెందుకీ వాదన, అప్పుడు మనం చేసిన పని మర్చిపోయావా? నేను నీకు సాయం కూడా చేశాను’ అంటూ పాత విషయాలు ఎత్తితే అతడికి కూడా పాత స్నేహం, ప్రేమ గుర్తొచ్చి వాదన అక్కడితో తగ్గవచ్చు.
10. మీకేనా తెలివితేటలు ఉంటాయి? ఎదుటివారు కూడా మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. పైన చెప్పిన పాయింట్లలో ఏదో ఒకటి ఉపయోగించి మిమ్మల్ని మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు మీరు వారి మానిప్యులేషన్ కు గురికాకుండా ఉండాలి. వారి కంట్రోల్‌లోకి మీరు వెళ్లకుండా ఉండాలి. ఆ తెలివితో మీరు వ్యవహరించాల్సి ఉంటుంది.
Also read: మీ ఆడబిడ్డని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే, వీటిని కచ్చితంగా తినిపించాలి
Also read: ఈ ఆకులు రోజూ నమిలితే కంటి చూపు సూపర్, భవిష్యత్తులో సైట్ వచ్చే అవకాశమే ఉండదు