సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి
సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారికి కొన్ని రకాల ఆహారాలు మేలు చేస్తాయి.
పెళ్లయిన ప్రతి జంట పిల్లల కోసం కలలు కంటుంది. కానీ ఎంతోమంది సంతానోత్పత్తి సమస్యల వల్ల తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. అలాంటివారికి వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, చక్కటి జీవన శైలిని అనుసరించమని చెబుతున్నారు. సంతానోత్పత్తికి, సమతుల్య ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎవరైతే సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తారో వారికి ఎలాంటి సంతానోత్పత్తి సమస్యలు రావు. సమతుల్య ఆహారం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు నిండుగా అందుతాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే స్త్రీలలో అండాల నాణ్యతను పెంచుతాయి. మగవారిలో స్పెర్మ్ నాణ్యతను, సంఖ్యను కూడా పెంచుతాయి. అందుకే సమతుల ఆహారం తీసుకోమని సూచిస్తారు వైద్యులు. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ సి, కో ఎంజైమ్ క్యూ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయల్లో ఫోలిక్ యాసిడ్ నిండుగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ రెండు కూడా అండోత్సర్గానికి సహాయపడే పోషకాలు. గర్భధారణ సమయంలో గర్భస్రావం కాకుండా కాపాడతాయి. అలాగే స్పెర్మ్ నాణ్యతను పెంచడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి మీ ఆహారంలో పాలకూర, బ్రకోలి, కాలే, మెంతాకు వంటివి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని రోజూ తింటే ఇంకా మేలు.
నట్స్
డ్రై ఫ్రూట్స్, నట్స్ రోజుకో గుప్పెడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్ లో ఉండే సెలీనియం మహిళల అండాల్లో క్రోమోజోముల నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఫలితంగా సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అండాలు ఏర్పడటానికి సహకరిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వంటివి అండాలను చేరకుండా అడ్డుకుంటాయి. సంతానోత్పత్తిని పెంచడానికి డ్రై ఫ్రూట్స్, నట్స్ సహాయపడతాయి.
టమోటాలు
టమోటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది పురుషుల స్పెర్మ్ కౌంటును 70 శాతం వరకు పెంచుతుంది. వీర్యకణాలు వేగంగా చలించేలా చేస్తుంది. వీర్యకణాలు ఎంత వేగంగా ఈదగలిగితే, అండాలు అంత వేగంగా చేరుకోగలుగుతాయి. అప్పుడు అండం ఫలదీకరణం జరిగితే సంతానం కలిగే అవకాశం ఉంటుంది.
బ్రకోలి
ఇది కూడా ఫోలిక్ యాసిడ్ కు గొప్ప మూలం. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న భార్యాభర్తలకు ఇది ఒక సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుంది.
అవకాడోలు
అవకాడో పండ్లలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. ఇది మగవారికి ఎంతో మంచిది. వీర్యకణాల చలన శీలతను పెంచి ఫలదీకరణ అవకాశాలను పెంచుతుంది. వీర్యంలో అబార్షన్‌కు కారణమయ్యే జన్యుపరమైన లోపాలను ఇది తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ E డిఎన్ఎ లోపాలను కూడా సరిచేస్తుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడికాయ గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది పురుషులు, స్త్రీలలో ఆరోగ్యకరమైన అండాలు వీర్యం అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. గర్భధారణ సమయంలో తన విభజన జరిగేలా సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలతో పాటు బఠానీలు, ఓట్స్ కూడా తినడం వల్ల మేలు జరుగుతుంది.
Also read: ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.