అన్వేషించండి

High BP: అధిక రక్తపోటు ఉంటే కనిపించే నిశ్శబ్ద లక్షణాలు ఇవే

అధిక రక్తపోటు చూపించే కొన్ని రకాల లక్షణాలు ఇవి.

High BP: అధిక రక్తపోటు నిశ్శబ్దంగా శరీరంలో హానికరమైన మార్పులకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు అంటే 140/90 mm Hg కంటే ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటుగా నిర్ణయిస్తారు. ఈ సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతోంది. అధిక రక్తపోటుకు తగిన మందులు వాడకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్ల నుంచి 79 సంవత్సరాల లోపు వయసుగల వారిలో 128 కోట్ల మంది అధిక రక్తపోటును కలిగి ఉన్నారు. అధిక రక్తపోటు పూర్తిస్థాయిలో వచ్చేవరకు దాన్ని గుర్తించకపోవడం వల్ల ఇది హానికరంగా మారుతుంది.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం హైపర్ టెన్షన్‌తో ఉన్న పెద్దల్లో సగం కంటే తక్కువ మంది మాత్రమే ఈ సమస్య ఉన్న సంగతిని గుర్తించి చికిత్స చేయించుకుంటున్నారు. వారిలో 21 శాతం మంది మాత్రమే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటున్నారు, మిగతా వారంతా చాలా ప్రమాదంలో ఉన్నారు. 

నిశ్శబ్ధ లక్షణాలు ఇవే...
అధిక రక్తపోటు ఉన్నప్పుడు కనిపించే కొన్ని నిశ్శబ్ద లక్షణాలు ఉన్నాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. అధిక రక్తపోటు వల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. గుండెలయ అసాధారణంగా ఉన్నప్పుడు అది రక్తపోటుకు సంకేతంగా భావించాలి. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. 

తీవ్రమైన తలనొప్పి రావడం కూడా హైబీపీకి సంకేతమే. ఈ తలనొప్పిని సాధారణ తలనొప్పిగా భావించి తేలిగ్గా తీసుకుంటారు ఎంతోమంది.  తలనొప్పి వచ్చి, చెమట పట్టడం, గుండెదడ, ఆందోళనగా అనిపిస్తే అది అధిక రక్తపోటు వల్లనేమో అని అనుమానించాలి.

చెవుల్లో గుసగుసలాడే శబ్దం వినిపిస్తున్న కూడా రక్తపోటు నియంత్రణలో లేదని అర్థం. వైద్యపరంగా దీన్ని ‘టిన్నిటస్’ అంటారు.

తల తిరగడం, మైకం కమ్మడం వంటివి కూడా అధిక రక్తపోటులో భాగమే. అధిక రక్తపోటు ఎక్కువైతే మూర్చ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యక్తి బలహీనంగా మారి ఎక్కువసేపు నిలబడలేరు. నడవలేరు.

గందరగోళంగా అనిపిస్తున్నా కూడా అది అధిక రక్తపోటు సంకేతం గానే భావించాలి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా హైపర్ టెన్షన్ ఉంటే తర్వాత తరాల వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. 

అధిక రక్తపోటు ఉంటే ఉప్పుతో నిండిన ఆహారాలను తినడం తగ్గించుకోవాలి. ఊరగాయలు, అధిక ప్రాసెస్ చేసిన ఆహారం, క్యాన్డ్ ఫుడ్ తినడం తగ్గించాలి. లేకుండే రక్తపోటు అదుపులో ఉండదు.

Also read: ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేస్తే ఆ సమస్య ఎక్కువవుతుందా?

Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget