Acne: పండుగలు వచ్చేస్తున్నాయ్, మొటిమలు త్వరగా మానిపోవాలంటే ఇవిగో చిట్కాలు
దసరా, బతుకమ్మ పండగలు వచ్చేస్తున్నాయి. ఆరోజు అందంగా మెరిసిపోవాలని ఏ అమ్మాయిలు కోరుకోరూ?
![Acne: పండుగలు వచ్చేస్తున్నాయ్, మొటిమలు త్వరగా మానిపోవాలంటే ఇవిగో చిట్కాలు There are some tips to get rid of pimples quickly Acne: పండుగలు వచ్చేస్తున్నాయ్, మొటిమలు త్వరగా మానిపోవాలంటే ఇవిగో చిట్కాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/eb51aad7c0ebad44f6bde608022e889e1663656216655248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పండగ సీజన్ వచ్చిందంటే అందంగా కనిపించాలని అమ్మాయిలంతా అనుకుంటారు. కానీ మొటిమలు వారి అందాన్ని తగ్గిస్తాయి. పండుగ సమయాల్లో ముఖంపై మొటిమలు వేధిస్తుంటే వాటిని త్వరగా పోగొట్టే చిట్కాలు తెలుసుకోవాల్సిందే. చర్మ సంరక్షణను సహజ పద్ధతిలో చేయడం వల్ల సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. మొటిమలకు రకరకాల క్రీములు రాయడం వల్ల ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి సహజమైన పద్ధతిలో వాటిని త్వరగా పోయేలా చేయండి. కొన్ని సహజ మార్గాలు ఇవిగో.
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, టానిన్‌లు బ్యాక్టిరియాతో పాటూ ఇన్‌ఫ్లమ్మేషన్ తోనూ పోరాడతాయి. కాబట్టి గ్రీన్ ప్యాకెట్లోని పొడిని మొటిమలపై పెట్టడం వల్ల అవి త్వరగా మానిపోయే అవాకాశం ఉంది.
కలబంద
చర్మ సమస్యలను పరిష్కరించడంలో కలబంద ముందుంటుంది. దీన్ని చాలా కాస్మోటిక్స్ లో ఉపయోగిస్తారు. ఇది ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టిరియాతో పోరాడుతుంది. దీనిలో లూపియోల్, సాలిసిలిక్ ఆమ్లం, ఫినాల్స్ ఉంటాయి. ఇవి మొటిమల్లోని బ్యాక్టిరియాను తొలగించి త్వరగా తగ్గిపోయేలా చేస్తాయి. కలబంద జెల్ ను మొటిమలపై రాసుకుంటూ ఉండాలి.
విచ్ హాజెల్
విచ్ హాజెల్ అనేది ఒక మొక్క పేరు. ఆ మొక్క నుంచి తీసిన నూనె, టోనర్, వైప్స్ వంటివి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని వాడడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పేరుకు తగ్గట్టే మంతమేసినట్టు మొటిమలను త్వరగా మాయం చేస్తాయి. మొటిమల వల్ల కలిగే దురద, మంటలను తగ్గిస్తాయి. టోనర్ ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
టీ ట్రీ ఆయిల్
మొటిమలను తగ్గించే అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఇదీ ఒకటి. ఈ నూనెకు మొటిమలను కలిగించే బ్యాక్టిరియాను నిరోధించే సామర్థ్యం ఉంది. ఈ ఆయిల్ రాయడం వల్ల చాల త్వరగా మొటిమలు తగ్గుతాయి. ఆన్ లైన్ మార్కెట్ల్ ఇది అందుబాటులో ఉంది.
Also read: మనదేశంలో ర్యాంప్‌వాక్ చేసే మోడల్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా? ఆ విషయంలో అమ్మాయిలే టాప్
Also read: డయాబెటిక్ రోగులు ఈ అలవాట్లు వదిలేయాల్సిందే, లేకుంటే అవి క్యాన్సర్ కారకాలుగా మారవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)