Christmas Decor Tips : క్రిస్మస్కి మీ ఇంటిని సింపుల్ టిప్స్‌తో ఇలా ట్రెండీగా మార్చేయండి
Christmas 2023 : పండుగల సమయంలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటాము. చలికాలంలో వచ్చే క్రిస్మస్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆ సమయంలో మీ ఇంటిని ఇలా అందంగా తీర్చిదిద్దేయండి.
Christmas Decoration Ideas : పండుగలకు ఇంటిని సిద్ధం చేసుకోవడం కామనే. కానీ.. దాని ట్రెండీగా.. మరింత అందంగా తీర్చిదిద్దడానికి కొంచెం కళాపోషణ కావాలి. అయితే మీ ఇంటిని ఎలా అందంగా, ట్రెండీగా మార్చాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ మీరు ఫాలో అవ్వగలిగే కొన్ని ట్రెండీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటు.. మీ ఇంటిని త్వరగా, అందంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. పండుగ మరికొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఇంటి సెటప్‌ను మార్చేందుకు ఇదే సరైన సమయం. ఇంకెందుకు ఆలస్యం.. ఇంటిని ఎలా మారిస్తే బాగుంటుందో మీరు ఓ లుక్కేయండి.
అలంకరణలో ఇవి మస్ట్
మనం ఎలాంటి అలంకరణ చేసినా.. అది రెండు ప్రయోజనాలు ఇచ్చేదై ఉండాలి. అంటే కేవలం చూడడానికే మంచిగా కాకుండా.. దానితో ఇంకేదో ప్రయోజనం కలిగించేదైనా ఉండాలి. ఉదాహరణకు మీ ఇంట్లో ఓ సెల్ఫ్ని క్రిస్మస్ ట్రీగా ఊహించుకుని.. దానిలో మీరు ఫ్రెండ్స్‌కి ఇచ్చే గిఫ్ట్స్ పెట్టి.. దానికి లైటింగ్స్ సెట్ చేయవచ్చు. అప్పుడు చూసేందుకు బాగుండడంతో పాటు.. గిఫ్ట్స్ ఎక్కడపెట్టామో అని వెతుక్కోనవసరం లేకుండా ఉంటుంది.
పుస్తకాల అరలకు దండలు వేయడం, కుర్చీ కాళ్ల చుట్టూ ఫెయిరీ లైట్లు పెట్టడం లేదా క్యాబినెట్ హ్యాండిల్స్‌కు వాటిని వేలాడదీయవచ్చు. ఇవి మీలోని క్రియేటివిటీకి పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిన్న పనులు మీ ఇంటికి చాలా లుక్‌ని ఇస్తాయి. అంతేకాకుండా మీరు ఏమి డెకరేట్ చేయకపోయినా ఇంటిని చాలా అందంగా చూపిస్తాయి.
ఫర్నీచర్ కోసం..
మీ లివింగ్ రూమ్‌లో సాధారణ కుర్చీలకు బదులుగా సౌకర్యవంతమైన ఫ్లోర్ కుషన్లు, కాఫీ టేబుల్స్‌గా పాతకాలపు ట్రంక్స్ లేదా సైడ్ టేబుల్స్‌ను పేర్చవచ్చు. వాటిని గిఫ్ట్స్ మాదిరి ప్యాక్ చేసి సపోర్ట్‌గా వాడుకోవచ్చు. ఇది మీ డెకర్‌కు వ్యక్తిగత టచ్ ఇస్తుంది. అంతేకాకుండా ఫ్యాషన్, ఉపయోగకరమైన అంశాలు రెండింటినీ ప్రభావితం చేస్తాయి. మీరు ఆ ప్లేస్‌ని మొకమల్ క్లాత్స్తో నింపేయవచ్చు. ఇది స్మూత్, వెచ్చని ఫీలింగ్ ఇస్తుంది.
మొక్కలతో..
ఇంట్లో ఎక్కువ స్పేస్ ఉంటే మీరు మొక్కలను మీ డెకరేటింగ్ వస్తువులుగా మార్చేయవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌ని ఇంట్లోకి పెట్టవచ్చు. క్రిస్మస్ సమయంలో మొక్కలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. క్రిస్మస్ ట్రీ మాదిరిగా మొక్కలను మార్చేయవచ్చు. ఇది మీ ఇంటికి అదనపు లుక్‌ని గ్యారెంటీ ఇస్తుంది. ఆ మొక్కలుకు మీరు చిన్నచిన్న లైట్స్ డెకరేట్ చేస్తే.. మీరు మరే ఇతర వస్తువులు కొనాల్సిన అవసరం ఉండదు. వాటికి సున్నితమైన ఆభరణాలు, చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా హ్యాంగ్ చేయవచ్చు. ఇది మీ క్రిస్మస్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
సువాసనలతో..
సువాసనలతో నిండి ఫాబ్రిక్స్ మీ మూడ్‌ని మరింత రెట్టింపు చేస్తాయి. మంచి సువాసనగల సుగంధ ద్రవ్యాలతో నిండిన చిన్న చిన్న సంచులు మీరు ఇంట్లో హ్యాంగ్ చేయవచ్చు. లేదంటే సువాసనలు కలిగిన క్యాండిల్స్‌ను మీరు వెలిగించవచ్చు. ఇవి ఇంటికి అదనపు అందాన్ని జోడిస్తాయి. లావెండర్, వెనిలా వంటి సువాసనలతో కూడిన క్యాండిల్స్, డిఫ్యూజర్స్లు మార్కెట్లలో అందుంబాటులోనే ఉంటాయి. వీటిని మీరు ట్రై చేయవచ్చు.
Also Read : క్రిస్మస్ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?