Viral Video: కాబోయే భార్యను అలా చూసి ఆనందం పట్టలేకపోయిన వరుడు, వీడియో వైరల్
కాబోయే భార్య అప్సరసలా ఎదురొస్తే ఏ వరుడి మనసైనా అదుపు తప్పాల్సిందే, అదే జరిగిందిక్కడ.
పెళ్లంటేనే ఆనందం. జీవితంలో కొత్త ప్రారంభం. జీవిత భాగస్వామి అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరూ. అలాంటిది కాబోయే భార్య కళ్లు చెదిరే అందంతో ఎదురొస్తే ఆ ఆనందం వరుడి కళ్లల్లో మాములుగా కనిపించదు, ఇదిగో కింద ఇచ్చిన వీడియోలో చూస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆ వీడియోలో కనిపిస్తున్న జంట పేరు రిషి, సౌమ్య వర్మ. ఇద్దరికి పెళ్లి సెటిలైంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అన్నీ సిద్ధం చేశారు. పెద్ద హోటల్ లో వివాహం. పెళ్లికి మెహెందీ వేడుక నిర్వహించారు. ఆ వేడుకకు సౌమ్యను బ్యూటిషియన్స్ చాలా అందంగా అలంకరించారు. క్రీమ్ కలర్ గౌనులో, ట్రెండీ హెయిర్ స్టైల్ లో అదిరిపోయేలా ఆమెను సిద్ధం చేశారు. తనకు కాబోయే భార్యను వేడుక వద్దకు తీసుకెళ్లేందుకు వచ్చాడు రిషి. నలుపు బ్లేజర్ లో వచ్చిన ఆయన వధువును చూసి వావ్ అంటూ అలా ఉండిపోయాడు. ఆయన ముఖంలో ఆమె ఎంత అందంగా ఉందో అన్న భావన ఇట్టే కనిపించేసింది. ఆమె రెండు చేతులు తీసుకుని పదే పదే ముద్దులు పెట్టాడు. ఈ తతంగం ఎవరో వీడియో తీశారు. ఇన్ స్టాలో వెడ్డింగ్ ఫెయిర్స్ అనే ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. నెటిజన్లు అతని రియాక్షన్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు పెట్టారు.
View this post on Instagram
కొన్ని రోజుల క్రితం ఇలాంటి పెళ్లి వీడియోనే వైరల్ అయ్యింది. అందులో పెళ్లి కూతరు చక్కగా బ్రైడల్ గెటప్ లో రెడీ అయితే, పెళ్లి కొడుకు మాత్రం సాదా సీదా జీన్స్, టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. పెళ్లి రోజు అతను అలా రావడం విమర్శకులకు గురైంది. అతడిని చూసి పెళ్లి కూతురి ముఖంలో ఆనందం ఆవిరవ్వడం కూడా వీడియోలో కనిపించింది.