అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

రాగి పిండితో పుల్కాలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందరూ ఈ పిండితో చేసిన వంటకాలు తినవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు రోజూ రాగి పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగి పిండితో పుల్కాలు చేసుకొని తింటే మరీ మంచిది. ఇవి పొట్ట నిండిన భావనను అందిస్తాయి. శక్తిని అందిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి. వీటిని చేయడం కూడా చాలా తేలిక.  

కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - ఒక కప్పు 
గోధుమపిండి - పావు కప్పు 
నీళ్లు - ఒక కప్పు 
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ ఇలా
1. ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పును వేయాలి. 
2. అందులో రాగి పిండిని, గోధుమ పిండిని కలిపి వేయాలి. 
3. ఉండలు కట్టకుండా గరిటతో బాగా కలపాలి. ఇప్పుడు ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉంచాలి. 
4. ఆ మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. 
5. పావుగంట సేపు ఉడికిస్తే మిశ్రమం గట్టిపడుతుంది. తర్వాత స్టవ్ కట్టేయాలి. 
6. ఇప్పుడు కళాయిపై మూతను పెట్టాలి. రాగి పిండి గోరువెచ్చగా అయ్యాక చేత్తోనే బాగా నలపాలి. 
7. కొద్దిగా అవసరమైతే నీటిని చల్లుకోవచ్చు లేదా చపాతీ పిండిని కలుపుకోవచ్చు. 
8. ఆ ముద్ద గట్టిగా అయ్యాక చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. 
9. ఆ ఉండను చేత్తోనే చపాతీలా ఒత్తుకొని కాల్చుకోవాలి.
10. నూనె అవసరం లేకుండా ఇవి చక్కగా కాలుతాయి. 
11. వీటి రుచి కూడా అదిరిపోయేలా ఉంటుంది. 
12. చికెన్ , మటన్ కూరలతో ఈ రాగి పుల్కాలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. 

రాగులు తినడం వల్ల ఆరోగ్యకపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాగి పిండి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో పొటాషియం, కాల్షియం కూడా శరీరానికి అందుతాయి. ఎదిగే పిల్లలకు రాగితో చేసిన వంటకాలు తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. వారికి ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో అమైనో ఆమ్లం ట్రిఫ్టోఫాన్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి అధిక బరువును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా శరీరం నుంచి బయటికి పోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మేలు. దీనిలో ఇనుము అధికంగా ఉంటుంది. రక్త హీనత సమస్య నుంచి బయటపడవచ్చు. 

Also read: సీనియర్ ఎన్టీఆర్‌కు ఇడ్లీలంటే ఎంత ఇష్టమో, ఆయన మెనూలో ఉండే ఆహారాలు ఇవే

Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget