అన్వేషించండి

Bonalu 2025 : తెలంగాణ బోనాలు 2025.. చరిత్ర, ముఖ్యమైన తేదీలు ఇవే

Telangana Bonalu : బోనాలు మొదలైపోయాయి. తెలంగాణలో అంగరంగ వైభవంగా చేసుకునే ఈ పండుగ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Telangana Bonalu 2025 : తెలంగాణ అంతటా బోనాలు ప్రారంభమయ్యాయి. 2025లో జూన్ 29వ తేదీ ఆదివారం నుంచి వీటిని జరుపుకోనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్​లలో వీటిని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో మహాకాళి దేవిని పూజిస్తూ.. ఆషాడ మాస బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అసలు ఈ పండుగ స్పెషల్ ఏంటి? చరిత్ర, ముఖ్యమైన తేదీలు, ఇతర ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

తెలంగాణ సంస్కృతిని ప్రదర్శిస్తూ.. మహాకాళి దేవిని పూజిస్తూ భక్తులు ఈ బోనాలు నిర్వహిస్తారు. పండుగ రోజులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ బోనాలు 2025లో జూన్​ 29న ప్రారంభమై.. జూలై 20వ తేదీన ముగియనున్నాయి. ఆదివారంతో మొదలై.. ఆదివారంతోనే ఇవి ముగుస్తాయి. అసలు ఈ బోనం అంటే అర్థమేంటి? ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

బోనం అంటే అర్థమిదే..

బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. దేవతలకు ఇచ్చే నైవేద్యాలలో ఒకటి. మట్టి లేదా ఇత్తడి కుండలలో పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని వండుతారు. ఇలా వండిన బోనాన్ని వేప, పసుపు, సింధూరంతో అలంకరిస్తారు. వెలిగించని దీపాన్ని బోనంపై ఉంచి.. దానిని అమ్మవారికి తీసుకెళ్లి సమర్పిస్తారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహాకాళిని పూజించి.. ఈ బోనాలు సమర్పిస్తారు. అందుకే ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.

బోనాల చరిత్ర.. 

సికింద్రాబాద్​, హైదరాబాద్​లలో 1813లో ఓ అంటువ్యాధి ప్రబలింది. ఆ సమయంలో వేలాది మంది చనిపోవడంతో తగ్గాలని కోరుకుంటూ.. మహాకాళి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆ వ్యాధి వ్యాప్తి తగ్గడంతో అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్​లో ప్రతిష్టించారు. అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ.. దీనిని నిర్వహిస్తున్నారు. 

ఈ బోనాల సమయంలో మహిళలు అందంగా ముస్తాబవుతారు. సాంప్రదాయ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే బోనాలు తీసుకెళ్లేవారి పాదాలపై నీటిని చల్లి.. శాంతపరుస్తారు. 

ముఖ్యమైన తేదీలు ఇవే.. 

ఆషాడంలో మొదటి గురువారం నుంచి ఈ బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాదిలో జూన్ 26వ తేదీన గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఇస్తారు. జూన్ 29వ తేదీన విజయవాడ కనకదుర్గకు 2వ బోనం సమర్పిస్తారు. 3వ బోనాన్ని జూలై 3వ తేదీన, నాల్గవ బోనాన్ని జూలై 6వ తేదీన పెద్దమ్మ తల్లికి అందిస్తారు. 5వ బోనం జూలై 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి సమర్పిస్తారు. 

జూలై 13వ తేదీన సికింద్రాబాద్​లో బోనాల జాతర చేస్తారు. జూలై 14వ తేదీన అమ్మవారి ఊరేగింపు చేస్తారు. 15వ తారీఖున చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బోనం సమర్పిస్తారు. 17వ తేదీన లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు. 20వ తేదీన పాతబస్తీ, లాల్ దర్వాజాలో బోనాల జాతర చేస్తారు. 21వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు చేసి బోనాలు ముగిస్తారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget