High Protein Bites : హెల్తీగా ఉండేందు హై ప్రోటీన్ బైట్స్.. టేస్టీగా చేసుకునేందుకు ఈ రెసిపీని ఫాలో అవ్వండి
Healthy Food Recipes : మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి అంటారు. అయితే ఉదయాన్నే టేస్టీగా ప్రోటీన్‌ను తీసుకోవాలనుకుంటే ఈ హై ప్రోటీన్ బైట్స్‌ను తప్పకుండా ట్రై చేయాలి.
Health Breakfast : ఉదయాన్నే ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటే మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకా కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. హెల్త్‌కి మంచిది అంటే టేస్టీగా ఉండవేమో అనుకోకండి. ఇవి నోటికి రుచిగానూ.. చేసేందుకు సులభంగానూ ఉంటాయి. మరి ఈ హై ప్రోటీన్ బైట్స్‌ను ఏ విధంగా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వాటిని దేనితో తింటే రుచి ఇంకాస్త ఎక్కువ అవుతుంది.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
యోగర్ట్ - 120 గ్రాములు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్స్
మఖానే - 10 గ్రాములు
నీళ్లు - వంటకి సరిపడా
బంగాళదుంపలు - 300 గ్రాములు
పనీర్ - 120 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడేంత
మిరియాలపొడి - చిటికెడు
జీలకర్ర పొడి - చిటికెడు
కారం - చిటికెడు
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్
నూనె - ఫ్రైకి సరిపడేంత
రాడీష్ చట్నీ కోసం
రాడీష్ ఆకులు - 40 గ్రాములు
రాడీష్ - 60 గ్రాములు
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - పది గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - 1 అంగుళం
టమాటా - 50 గ్రాములు
నిమ్మరసం - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నీరు - చట్నీకి తగినంత
నూనె - వేయించేందుకు తగినంత
తయారీ విధానం
ముందుగా వెడల్పాడి గిన్నె తీసుకుని దానిపై వడకట్టే స్ట్రైనర్ తీసుకుని ప్లేస్ చేయండి. ఇప్పుడు ఓ క్లీన్, కాటన్ క్లాత్ ఉంచి.. యోగర్ట్ వేసి.. గట్టిగా మూట కట్టి.. ఓ గంట అలానే ఉండనివ్వండి. ఇప్పుడు దానిలోని నీరు కిందకి వెళ్లి.. యోగర్ట్ ఉండిపోతుంది. ఈలోపు బంగాళదుంపలను నీటిలో వేసి ఉడికించుకోండి. అనంతరం వాటిపై ఉన్న తొక్క తీసేయండి. స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో జీడిపప్పు, మఖానే వేసి డ్రై రోస్ట్ చేయండి. స్టౌవ్ ఆపేసి వాటిని చల్లారనివ్వండి. పనీర్‌ను తురుముకుని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఓ గిన్నెలో బంగాళదుంపలను వేసి.. వాటిని మెత్తగా చేయండి. అలాగే డ్రై రోస్ట్ చేసిన జీడిపప్పు, మఖానేను కూడా మిక్సీలో వేసి పౌడర్‌గా చేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో బంగాళదుంపలు, తురుమిన పనీర్, నీరు లేని యోగర్ట్, జీడిపప్పు, మఖానే పౌడర్ వేసి బాగా కలపండి. సాల్ట్ మిరియాల పొడి, కారం, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి వేసి పిండిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. వేడి అయ్యాక దానిలో డీప్ ఫ్రై కాకుండా.. నార్మల్‌గా ఫ్రై చేసేందుకు కొంత నూనె వేయండి.
తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని.. స్పూన్ కొలతతో చేతిలోకి ముద్ద తీసుకుని దానిని స్క్వేర్ రూపంలో నగ్గేట్స్లా ఒత్తుకోండి. వీటిని వేడి చేసిన పాన్‌లో ప్లేస్ చేయండి. సిమ్‌లో ఉంచి.. వాటిని రోస్ట్ చేయండి. ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత.. మరోవైపు మార్చి.. పూర్తిగా వేయించుకోండి. ఇలా మిగిలిన పిండితో ప్రోటీన్ బైట్స్ తయారు చేసుకోవచ్చు. వీటిని మీరు నేరుగా తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన చట్నీతో లాగించవచ్చు. కొత్తగా ట్రై చేయాలనుకుంటే రాడీష్ చట్నీదీనికి బాగా సూట్ అవుతుంది.
రాడీష్ చట్నీ కోసం
స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నూనె వేయండి. దానిలో రాడీష్, రాడీష్ ఆకులు వేసి వేయించండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై చేయండి. దానిలో అల్లం, వెల్లుల్లి, టమాటా వేసి మగ్గనివ్వండి. కొత్తిమీర కూడా వేసి ఫ్రై అయిన తర్వాత స్టౌవ్ దించేయండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్స్ చేయండి. దానిలో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి కలపండి. హై ప్రోటీన్ బైట్స్‌ను మీరు దీనితో కలిపి తీసుకోవచ్చు.
Also Read : మైసూర్ బోండా, కొబ్బరి చట్నీ డెడ్లీ కాంబినేషన్.. మీరు ట్రై చేశారా?